Sep 29, 2009

ప్రేమించు పెళ్ళాడు

గాత్రం: బాలు, జానకి




పల్లవి:

ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన
ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ

చరణం1:

విడిపోలేని విరితీవెలలో
కురులే మరులై పోతుంటే
ఎడబాటేది ఎదలోతులలో
అదిమే వలపే పుడుతుంటే
తనువూ తనువు తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ

చరణం2:

గళమే పాడే కల కోయిలనె
వలచి పిలిచే నా గీతం
నదులై సాగే ఋతుశోభలనే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలిసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమైపోతుంటే హొయ్
వనమే యవ్వనమై జీవనమై సాగే రాగాలాపన

ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: