Sep 30, 2009

వెంగమాంబ

గాత్రం: చిత్ర
సాహిత్యం: వెంగమాంబ



శృంగారరాయని చెలువుమీరిన కొండ
ఫణిరాజు పేరిటి పసిడి కొండ
ఘోరపాపమనన్‌చు కొనేర్లు గల కొండ
తలచిన మోక్షంబు తగులు కొండ
చిలుకలు కోయిలలు చెలగి కూసెడి కొండ
చెలగి కూసెడి కొండ
వెగజాతి కోట్లెల్ల వెలగు కొండ
పుష్పజాతుల విష్ణు పూజింపగల కొండ
కల్పవృక్షములైదు కలుగు కొండ
అమరవరులకునాధారమైన కొండ
ఆళ్వారులకు ప్రత్యక్షమైన కొండ
అలరజూచిన బ్రహ్మాండమైన కొండ
నేను కనుగొంటి శ్రీవేంకటేశు కొండ
శ్రీవేంకటేశు కొండ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: