Dec 30, 2009

గోపి గోపిక గోదావరి

గాత్రం: చక్రి,కౌసల్య
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి




పల్లవి:

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
గల గల
ఎందుకో ఏకాంతవేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
గల గల

చరణం1:

సరిగమలే వర్ణాలుగా కలగలిసే కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగ కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా
జాను తెలుగులా జాణ వెలుగులా
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో వున్నా
నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
గల గల

చరణం2:

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసులజోలా
ప్రతి కిరణం నీలా మారే వెలుగులమాలా
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరుపున గీత చెరపనా
ఎంత దూరాన నేవున్నా నీతోనే నేలేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
గల గల
ఎందుకో ఏకాంతవేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
గల గల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 28, 2009

ఆర్య

తారాగణం: అల్లు అర్జున్,శివబాలాజి,అనుమెహతా,అభినయశ్రీ
గాత్రం: సాగర్,సుమంగళి
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: సుకుమార్
సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 2004




పల్లవి:

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

చరణం1:

పాట పాడదా మౌనం
పురి విప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం
అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలె గంధం
నువ్వుంటే ఎండైన కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాట వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం

చరణం2:

ఉన్నచోట ఉన్నానా
ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా
ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయె
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 27, 2009

భలే అమ్మాయిలు

గాత్రం: పి.బి.శ్రీనివాస్,జిక్కి




పల్లవి:

చీటికిమాటికి చీటికట్టి వేధించేవానాడు
లాటరిలోన లక్షలు లక్షలు సాధించేవీనాడు
చీటికిమాటికి చీటికట్టి వేధించేనానాడు
లాటరిలోన లక్షలు లక్షలు సాధించేనీనాడు

పల్లవి:

చెంగావి చీరకట్టి రంగైన రైక తొడిగి అహ అహ అహ అహ
చెంగావి చీరకట్టి రంగైన రైక తొడిగి
బంగారు రవ్వల నగలు సింగారించి జోరుగా
నే నీతో వస్తా జోడుగా
చిలకా గోరింకల్లాగ ఆలూమగలం హాయిగా ఆ ఆ ఆ ఆ
నిసరిమప సరిమప రిమప మప ప
చిలకా గోరింకల్లాగ ఆలూమగలం హాయిగా
చీకూ చింతా లేకునడా ఇక ఆడుతుపాడుతు వేడుక చేద్దాం
గురువా శిష్యా నిసరిమప సరిమప రిమప మప ఛీ పో

చీటికిమాటికి చీటికట్టి వేధించేవానాడు
లాటరిలోన లక్షలు లక్షలు సాధించేవీనాడు

చరణం2:

కోరిన కోరికలన్ని తీరేను ఒకటేసారి అహ అహ అహ అహ
కోరిన కోరికలన్ని తీరేను ఒకటేసారి
సాటివారందరిలోన రాణిలాగ ఉంటాను మహరాణిలాగ ఉంటాను
రాణిలాగ ఉంటే నువ్వు రాజాలా నేనుండనా ఆ ఆ ఆ ఆ
నిసరిమప సరిమప రిమప మప ప
రాణిలాగ ఉంటే నువ్వు రాజాలా నేనుండనా
రాణి నువ్వు రాజా నేను
చెతిలో బెల్లం ఉన్నంత కాలం
గురువా ఛీ పో
నిసరిమప సరిమప రిమప మప ప

లాటరిలోన లక్షలు లక్షలు లాభించే ఈనాడే
మోటరు మీద ఇద్దరమింక పోదామా ఈనాడే
ఇక పోదామా ఈనాడే
ఊరు పోదామా ఈనాడే

||

Dec 25, 2009

రాజాధిరాజు

గాత్రం: పి.సుశీల
తారాగణం : విజయచందర్ ,నూతన్ ప్రసాద్ ,శారద
సంగీతం : కె.వి.మహదేవన్
దర్శకత్వం : బాపు
నిర్మాణ సంస్థ : రమా చిత్ర
విడుదల: 1980



పల్లవి:

రాజ్యము బలము మహిమా నీవే నీవే
జవము జీవము జీవనమీవే నీవే
రాజ్యము బలము మహిమా నీవే నీవే
జవము జీవము జీవనమీవే నీవే
మరియ తనయ మధుర హృదయ
మరియ తనయ మధుర హృదయ
కరుణామయ కరుణామయ
రాజ్యము బలము మహిమా నీవే నీవే
జవము జీవము జీవనమీవే నీవే
మరియ తనయ మధుర హృదయ
కరుణామయ కరుణామయ

చరణం1:

అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే
మనిషి కన్ను మిన్ను కానబోడేమో
కడుపుకు చాలినంత సబలమీయకుంటే
మనిషి నీతి నియమం పాటించడేమో
మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి ప్రేమ తృప్తినిచ్చి
మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి ప్రేమ తృప్తినిచ్చి
గుండె గుండె నీ గుడి దీపాలై
అడుగు అడుగు నీ ఆలయమయ్యే రాజ్యమీవయ్య
నీ రాజ్యమీవయ్య

చరణం2:

అర్హతలేనివారికి అధికారం ఇస్తే
దయాధర్మం దారి తప్పునేమో
దారి తప్పినవారిని చేరదీయకుంటే
తిరిగి తిరిగి తిరిగబడతారేమో
తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి
తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి
తనువు తనువు నీరీక్షణశాలై
అణువు అణువు నీ రక్షశేరయ్యే బలమీవయ్య
ఆత్మ బలమీవయ్య

చరణం3:

శిలువపైన నీ రక్తం చిందిననాడే
సమదమాలు శోభించెను కాదా
నీ పునరుద్ధానముతో రక్షణ రాజిల్లి
శోకం,మరణం మరణించెను కాదా
చావు పుటుక నీ స్వాసలని
దయా దండన పరీక్షలని
చావు పుటుక నీ స్వాసలని
దయా దండన పరీక్షలని
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని
సత్యం మార్గం సర్వం నీవని
మహిమ తెలుపవయ్య నీ మహిమ తెలుపవయ్య

రాజ్యము బలము మహిమా నీవే నీవే
జవము జీవము జీవనమీవే నీవే
మరియ తనయ మధుర హృదయ
కరుణామయ కరుణామయ


||

Dec 23, 2009

చిన్న కోడలు

తారాగణం: సురేష్,వాణీ విశ్వనాధ్
సంగీతం : వాసురావు
దర్శకత్వం : కె.వాసు
నిర్మాణ సంస్థ: పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్
విడుదల: 1990



పల్లవి:

ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ
అనురాగం విరిసినరోజు
ఇల్లే కోవెల ఈ రోజు
అరవైలో నవవాసంతం
అడుగిడి మురిసెను ఈ రోజు
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ
అనురాగం విరిసినరోజు
ఇల్లే కోవెల ఈ రోజు
అరవైలో నవవాసంతం
అడుగిడి మురిసెను ఈ రోజు
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ

చరణం1:

పొద్దేమో వాలింది ముద్దొచ్చి మెరిసింది
వద్దన్నా ఆనందం వరదై పొంగింది
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ
పొద్దేమో వాలింది ముద్దొచ్చి మెరిసింది
వద్దన్నా ఆనందం వరదై పొంగింది
దరహాసానికి పరిహాసం దాసోహం అనె ఈరోజు

అనురాగం విరిసినరోజు
ఇల్లే కోవెల ఈ రోజు
అరవైలో నవవాసంతం
అడుగిడి మురిసెను ఈ రోజు
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ

చరణం2:

చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా
లోకంలో వెలుగంతా చూసెను మనవంక
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ
చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా
లోకంలో వెలుగంతా చూసెను మనవంక
మమకారం ఆలంబనగా మనుగడ సాగాలికరోజు

అనురాగం విరిసినరోజు
ఇల్లే కోవెల ఈ రోజు
అరవైలో నవవాసంతం
అడుగిడి మురిసెను ఈ రోజు
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహ
ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...ఓహొ ఓహొ...హహహహ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 21, 2009

స్వయంవరం

తారాగణం: శోభన్ బాబు ,జయప్రద , దాసరి నారాయణరావు
గాత్రం: జేసుదాసు
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం: సత్యం
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంస్థ: లక్ష్మి గణేష్ చిత్ర
విడుదల: 1982




పల్లవి:

గాలి వానలో వాన నీటిలో
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో

చరణం1:

ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హొరు గాలిలో వరద పొంగులొ
సాగలేలని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
జోరు వానలొ నీటి సుడులలో
మునక తప్పదని తెలుసు

అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో

చరణం2:

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఆశ జారినా వెలుగు తొలిగినా
ఆగదు జీవిత పొరాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్నదొక శవం

అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో

||

Dec 19, 2009

వెంగమాంబ

గాత్రం: కీరవాణి,రమ్య
సాహిత్యం: వేటూరి




పల్లవి:

సప్తగిరీశుని వేంకటేశుని సప్తస్వర మణిమాలికగా
అల మంగమాంబ తలపే
ఇల మంగమాంబ కడుపై
హస్తకమలమే ఆడబిడ్డగా
అగ్నిపుత్రి జననం ఇది ఆంధ్రశక్తి అవతరణం
ఆంధ్రశక్తి అవతరణం

చరణం1:

ఉలకని పలకని ఏడవని ఊపిరి బొమ్మను చూచుకొని
తల్లడిల్లిన తల్లిని చూచి సాధువొకడు వచ్చి
ఆ ఆ ఆ ఆ
పాప చెవిలోన పాపవినాశక మంత్రమొకటి ఊదె
మంత్రమొకటి ఊదే
ఓం నమో: వేంకటేశాయ
ఓం నమో: వేంకటేశాయ

చరణం2:

ఉలికిన పాపే తొలకరి మెరుపై
పలికిన పాపే వెలుగు వేలుపై
ఎదలో ఉన్న ఏడుకొండల విభుని నీడని వాడని వలపై
ఎదిగె వేంగమాంబ
ఎదిగె వేంగమాంబ
ఒదిగె వేంగమాంబ

చరణం3:

వేంకటపతియే నా పతి అన్నది పసిపాప వేంగమాంబ
తిరుమల కోవెల అత్తిళ్ళన్నది సిరికన్నె వేంగమాంబ
నివ్వెరపోయిరి బంధుజనం
అచ్చెరువొందిరి ఊరుజనం
వేంకటపతి అను బాలునితో వేగమె జరిగెను కళ్యాణం

చరణం4:

అభినవ బోధ ఆమె కథ
అపుడిక రాధే తాను సదా
అలమేల్మంగకు తెలిసె కధ
ఆనంద నిలయమే ఆమె కథ
కర్పూర హారతే ఆమె కథ
కడలేని హారతే ఆమె కథ
కర్పూర హారతే ఆమె కథ
కడలేని హారతే ఆమె కథ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 18, 2009

గృహలక్ష్మి

గాత్రం: ఘంటసాల,భానుమతి



పల్లవి:

మనలో మనకే తెలుసునులే
ఈ మధుర మధురమగు ఆనందం
మరపురాని మన కళ్యాణం
మరపురాని మన కళ్యాణం
మనలో మనకే తెలుసునులే
ఈ మధుర మధురమగు ఆనందం
మరపురాని మన కళ్యాణం
మరపురాని మన కళ్యాణం

చరణం1:

మనసే పరిణయ వేదిక
మన వలపే మంగళ గీతిక
మనసే పరిణయ వేదిక
మన వలపే మంగళ గీతిక
చూపే పిలిచే శుభలేఖ
కనుచూపే పిలిచే శుభలేఖ
లేత కోరిక ప్రేమకానుక

ఓ ఓ ఓ ఓ
మనలో మనకే తెలుసునులే
ఈ మధుర మధురమగు ఆనందం
మరపురాని మన కళ్యాణం

చరణం2:

ఘనస్వాగతమన్నవి హృదయాలు
అభినందనలన్నవి అందాలు
ఘనస్వాగతమన్నవి హృదయాలు
అభినందనలన్నవి అందాలు
పరువము జల్లే పన్నీరు
పరువము జల్లే పన్నీరు
కోటితలపులు కోరి పిలిచెను

ఓ ఓ ఓ ఓ
మనలో మనకే తెలుసునులే
ఈ మధుర మధురమగు ఆనందం
మరపురాని మన కళ్యాణం

చరణం3:

నవ్వుల పువ్వుల దండలు
నవయవ్వన జ్యోతులే హారతులు
తొందరచేసే భావాలు
ప్రేమయాత్రకు సాగమన్నవి

ఓ ఓ ఓ ఓ
మనలో మనకే తెలుసునులే
ఈ మధుర మధురమగు ఆనందం
మరపురాని మన కళ్యాణం
మరపురాని మన కళ్యాణం

||

Dec 16, 2009

మంచి మిత్రులు

తారాగణం: కృష్ణ,శోభన్‌బాబు,విజయనిర్మల,చలం,గీతాంజలి
గాత్రం: ఘంటసాల,బాలు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
నిర్మాత: పి. మల్లికార్జునరావు
దర్శకత్వం: తాతినేని రామారావు
సంస్థ: మధు పిక్చర్స్
విడుదల: 1969




పల్లవి:

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

చరణం1:

మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని
నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని
నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

చరణం2:

నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరే వానిని ఆ కత్తితోనే గెలవాలని
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 14, 2009

శరణం శరణం అయ్యప్ప - అయ్యప్ప స్వామి భక్తులకోసం

గాత్రం: జేసుదాసు






శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
పదునెనిమిది మెట్లకు అర్ధమే భగవానుడ అది నీ మహత్యమే
పదునెనిమిది మెట్లకు అర్ధమే భగవానుడ అది నీ మహత్యమే
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప

ముక్తికోసం తపించు ఆత్మ తొలిమెట్టగు విషాదయోగం
తొలిమెట్టగు విషాదయోగం
ఆత్మ ఉపదేశం సాంఖ్యయోగం రెండో మెట్టుగ వెలసింది
రెండో మెట్టుగ వెలసింది
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప

పక్వపు పనులే కర్మయోగం మూడో మెట్టుగ అమరిందే
మూడో మెట్టుగ అమరిందే
జ్ఞానయోగం నాల్గవ మెట్టట ఎంతో సంతసమొందామే
ఎంతో సంతసమొందామే
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప

గర్వించకనే కర్మలు చేయుట అయిదవ మెట్టగు సన్యాసయోగం
అయిదవ మెట్టగు సన్యాసయోగం
నిగ్రహశకతే ధ్యానయోగం ఆరో మెట్టుగ నిలచిందే
ఆరో మెట్టుగ నిలచిందే
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప

ప్రతిదిబ్రహ్మమే ఏడవమెట్టగు జ్ఞానవిజ్ఞానయోగమట
జ్ఞానవిజ్ఞానయోగమట
ఎన్నడు దేవుని మదిలో తలచిన ఎనిమిదవ మెట్టు అక్షరబ్రహ్మమే
ఎనిమిదవ మెట్టు అక్షరబ్రహ్మమే
మంచి పనులన్ని దేవునికర్పణ తొమ్మిదో మెట్టగు రాజవిద్యాయోగమే
తొమ్మిదో మెట్టగు రాజవిద్యాయోగమే
అందం జ్ఞానం ఇది దైవీకం పదియొవ మెట్టు విభూతియోగమే
పదియొవ మెట్టు విభూతియోగమే
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప

దైవరూపమున అన్నియుగనుట విశ్వరూపదర్శనయోగం పదకొండోమెట్టు
విశ్వరూపదర్శనయోగం పదకొండోమెట్టు
సుఖము దు:ఖము సర్వసమత్వం భక్తియోగం పండ్రెండో మెట్టు
భక్తియోగం పండ్రెండో మెట్టు
శరీరమ్మను క్షేత్రమదియే సకలము ఈశ్వరుడను సత్యం
సకలము ఈశ్వరుడను సత్యం

క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం పదమూడో మెట్టాయెనుగా
పదమూడో మెట్టాయెనుగా
ఆత్మగానే దేవుడున్నచో గుణత్రయ విభాగయోగం పధ్నాలుగో మెట్టు
గుణత్రయ విభాగయోగం పధ్నాలుగో మెట్టు
తానని లేక సర్వం వాడర పురుషోత్మప్రాప్తి పదిహేనో మెట్టు
పురుషోత్మప్రాప్తి పదిహేనో మెట్టు

సంస్కృతి దైవాసుర సంభద్విభాగం పదహారో మెట్టాయెనుగా
పదహారో మెట్టాయెనుగా
జ్ఞానధృడమే సత్వాత్రయమే పదిహేడవ మెట్టాయెనుగా
పదిహేడవ మెట్టాయెనుగా
దేహాదాత్మ అర్పణచేసి శరణ్యము మోక్ష సన్యాసము
శరణ్యము మోక్ష సన్యాసము
పద్దెనిమిదో మెట్టాయెనే
భక్తివల్ల దాటి వచ్చామే
భక్తివల్ల దాటి వచ్చామే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 13, 2009

ప్రేమించుకుందాం రా

గాత్రం: మనో, చంద్రబోస్
సాహిత్యం: చంద్రబోస్



Happy Birthday Venki



పల్లవి:

చదువుకి టాటా చెప్పేస్తే ఓ పనైపోతుంది బాబు
బుక్సును అటకే ఎక్కిస్తే ఓ పనైపోతుంది బాబు
రోడ్డులు సర్వే చేసేస్తే ఓ పనైపోతుంది బాబు
ఊరును మొత్తం చుట్టొస్తే ఓ పనైపోతుంది బాబు
ఫ్రీ పక్షుల్లాగా తిరిగేస్తే పొద్దేక్కే దాకా నిదరోతే
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు

బ్యూటీ బేబికి బీటేస్తే ఓ పనైపోతుంది బాబు
బాటాతో తను బదులిస్తే ఓ పనైపోతుంది బాబు
గొప్పల కోసం గుడికెళ్తే ఓ పనైపోతుంది బాబు
ఆ తప్పుకు చెప్పులు మిస్సైతే ఓ పనైపోతుంది బాబు
మిడ్‌నైటుకు ఇంటికి దయ చేస్తే దొంగనుకుని కుక్కలు తరిమేస్తే
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు


yo mama so no one makes me too cool
things all work so well come on speak it out a sensation

చరణం1:

అందరి హాజరు ఒకడే పలికే హంగామా ఇక లేదు
ఔరంగజేబు రూలింగ్ గురించి నొరెత్తే పని లేదు
హొలిడేకై ఎదురే చూసే అవసరమే ఇక రాదు
అక్బర్ చేసిన ఘనకార్యాలు అసలే అక్కర్లేదు
మార్కుల మాటే మరిచేస్తే ర్యాంకుల గొడవే వదిలేస్తే
నిన్నటి బూజును దులిపేస్తే రేపటి రోజును పిలిచేస్తే
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు


ఇంగ్లిష్ ఫిల్మికి చెక్కేస్తే ఓ పనైపోతుంది బాబు
అక్కడ నాన్నే ఎదురొస్తే ఓ పనైపోతుంది బాబు
ఎంట్రన్స్ పేపర్ లీకయితే ఓ పనైపోతుంది బాబు
ఎగ్జాం వాయిదా పడిపోతే ఓ పనైపోతుంది బాబు
లవ్‌లెటరే పోస్టులో వచ్చేస్తే చిరునామా తప్పని తెలిసొస్తే
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు

చరణం2:

జనరేషన్‌కో సిలబస్ చొప్పున కోర్సులు మారేనండి
ప్రతి సీజన్‌లో ఆక్సిజన్‌లా స్నేహం నిలబడుతుంది
గుండెల్లోన ఫ్రెండ్‌షిప్ కోసం బాండే రాసుందండి
ఎండే రాని వానే రాని రెండుగ విడిపోమండి
సందడి ఉంటే మనతోడే సంక్రాంతేగా ఎవ్విరిడే
లోకం మొత్తం ఇవ్వాళే స్నేహం విలువను వివరిస్తే
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు


హీరో రోలుకి ట్రై చేస్తే ఓ పనైపోతుంది బాబు
ఎక్ష్ట్రాలాగే ఫిక్ష్ అయితే ఓ పనైపోతుంది బాబు
సింగర్‌లాగ సెటిల్ అయితే ఓ పనైపోతుంది బాబు
డాంకీలొచ్చి డాన్స్ యేస్తే ఓ పనైపోతుంది బబు
చదవాలని బ్రదర్ని తిట్టేస్తే నెక్స్ట్‌డే నీ రిజల్ట్ వచ్చేస్తే
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోయింది బాబు

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 12, 2009

విప్రనారాయణ

గాత్రం:ఏ.ఎం.రాజా
సాహిత్యం:సముద్రాల



పల్లవి:

చూడుమదే చెలియ కనులా
చూడుమదే చెలియ కనులా
చూడుమదే చెలియ
బృందావనిలో నంద కిశోరుడు
బృందావనిలో నంద కిశోరుడు
అందముగా తీపించే లీల
చూడుమదే చెలియ కనులా
చూడుమదే చెలియ

చరణం1:

మురళికృష్ణుని మోహనగీతికి
మురళికృష్ణుని మోహనగీతికి
పరవశమైనవి లోకములే
పరవశమైనవి లోకములే
విరబూసినవి పొన్నలు పొగడలు
విరబూసినవి పొన్నలు పొగడలు
పరిమళమెగసెను మళయానిలయముల సోలెను యమునా
చూడుమదే చెలియ కనులా
చూడుమదే చెలియ

చరణం2:

నారి నారి నడుమ మురారి
నారి నారి నడుమ మురారి
హరికి హరికి నడుమ వయ్యారి
హరికి హరికి నడుమ వయ్యారి
తానొకడైనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధామాధవకేళి నటన
చూడుమదే చెలియ కనులా
చూడుమదే చెలియ


||

Dec 11, 2009

యమలీల

తారాగణం: ఆలి,ఇంద్రజ,మంజుభార్గవి
గాత్రం: చిత్ర,బాలు
సంగీతం: కృష్ణారెడ్డి
దర్శకత్వం: ఎస్.వీ. కృష్ణారెడ్డి
నిర్మాత: అచ్చిరెడ్డి
విడుదల: 1994




పల్లవి:

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు
సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి

చరణం1:

నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ
ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు

చరణం2:

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు
సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 10, 2009

నేనున్నాను

గాత్రం: కె.కె,శ్రేయాఘోషల్
సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

వేసంకాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీ కోసం నీకోసం నీకోసం నీ కోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసి సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీ కోసం

చరణం1:

గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్న పాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాట లేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోనా చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో
ఆముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చే సోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం
నీకోసం నీకోసం నీ కోసం నీకోసం నీకోసం నీ కోసం

చరణం3:

సిగ్గుకోరిక నెగ్గలేదుగా ఏడమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మొయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దరకానా చిగురింటి పెదవులపైనా
మురిపాల మువ్వనుకానా దొరగారి నవ్వులలోనా
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆహద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోనే ముద్దులెన్నో తెచ్చా నీ కోసం
నీకోసం నీకోసం నీ కోసం
నీకోసం నీకోసం నీ కోసం

వేసంకాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీ కోసం
నీకోసం నీకోసం నీ కోసం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 9, 2009

సంబరం

గాత్రం:మల్లికార్జున్



పల్లవి:

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
ఈ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగ
ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక
నీ గమ్యం చేరేదాక దూసుకుపోరా సొదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చరణం1:

ఇష్టం ఉంటే చేదు కూడ తీయనే
కష్టం అంటే దూది కూడ భారమే
లక్ష్యమంటు లేని జన్మే దండగ
లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టి పోరాడందే
కోరిన వరాలు పొందలేరు కదా

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చరణం2:

చేస్తు ఉంటే ఏ పనైనా సాధ్యమే
చూస్తు ఉంటే రోజులన్ని శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేది లేదురా
నవ్వే వాళ్ళు నివ్వెరపోగా
దిక్కులు జయించి సాగిపోరామరి

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
ఈ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగ
ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక
నీ గమ్యం చేరేదాక దూసుకుపోరా సొదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 8, 2009

సుస్వాగతం

గాత్రం: హరిహరణ్,చిత్ర
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ




పల్లవి:

సుస్వాగతం నవరాగమా
పలికిందిలే ఎద సరిగమ
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలిస్పర్శలో ఇంత సుఖమైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
సుస్వాగతం నవరాగమా

చరణం1:

అంతేలేని వేగంతోనె ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనె ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోనె మునిగిపోతుంటే
ఇంక క్షేమంగనే జీవిస్తా నీ చెయ్యందిస్తుంటే
ఆ చేతులే నీకు పూలదండగా
మెడలోన వేసి నీ జంట చేరనా
నా చూపు సూత్రంగ ముడిపడగా
నాజుకు చిత్రాల రాజ్యమేలనా
మౌనమే మాని గానమై పలికె నా భావన

చరణం2:

సూరీడున్నాడమ్మ నిన్నే చూపడానికి
రేయి ఉన్నాదమ్మ తనలో నిన్నే చేరడానికి
మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి
నా కళ్ళు పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి
ఏనాడు చూసానో రూపురేఖలు
ఆనాడే రాసాను చూపులేఖలు
ఏరోజు లేవమ్మ ఇన్ని వింతలు
ఈవేళ నాముందు ప్రేమ పుంతలు
ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా

సుస్వాగతం నవరాగమా
పలికిందిలే ఎద సరిగమ
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలిస్పర్శలో ఇంత సుఖమైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
సుస్వాగతం నవరాగమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 7, 2009

హరేరామ్

తారాగణం: కళ్యాణ్ రామ్,ప్రియమణి,సింధుతులాని,సీత
గాత్రం: హరీష్ రాఘవేంద్ర,కళ్యాణి
సంగీతం: మిక్కి జె.మేయర్
దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాత: జానకిరామ్
సంస్థ: నందమూరి తారకరామారావు ఆర్ట్స్
విడుదల: 2008




పల్లవి:

ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తోచక చస్తున్నా ఏం జోరే జాణ
పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి
పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి
పట్టపగలే వచ్చి బరితెగించి
పచ్చి వగలే తెచ్చి వెంట రాకె కొంటెగా కవ్వించి
ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తొచక చస్తున్నా ఏం జోరే జాణ

చరణం1:

ఒంటరి ఈడు కదా తుంటరి తొందర ఉండదా
ఎందుకు ఈ పరదా తగునా
అందుకు ఆడ జత తప్పక అవసరమే కదా
నువ్వది కాదు కదా అవునా
ఇంతలేసి కళ్ళు మొత్తం కట్టి వేసుకు కూర్చున్నావ
నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా
బాప్ రే బాప్ తెగ బెదిరానే నమ్మవేం చెబుతున్నా
గాభరా పడుతున్నానే చాలదా పులికూన

ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటాన
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తొచక ఛస్తున్నా ఏం జోరే జాణ

చరణం2:

దక్కిన చుక్కనిలా తక్కువ చేయకు ఇంతలా
మక్కువ దాచకలా మదిలో
కమ్ముకు రాకె ఇలా తిమ్మిరి పెంచకె వింతగా
గమ్మున ఉండవెలా తెరలో
ఆశపుడితే దాగుతుందా రాచకార్యం ఇన్నాళ్ళుంటే
మూతపెడితే దాగుతుందా చాలు రాదది జోకొడితే
క్యా కరే నాకేం దారి నౌకరీ పోతుంటే
పోకిరి వైఖిరి చాలే ఛోకిరి వదిలెయ్‌వే

ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటాన
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తొచక ఛస్తున్నా ఏం జోరే జాణ
పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి
పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి
పట్టపగలే వచ్చి బరితెగించి
పచ్చి వగలే తెచ్చి వెంట రాకే కొంటెగా కవ్వించి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 6, 2009

లవకుశ

గాత్రం: పి.లీల,పి.సుశీల



పల్లవి:

రామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా

చరణం1:

అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు
కౌసల్యా, సుమిత్రా, కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా

చరణం2:

ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజాని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యాముని
రామకథను వినరయ్యా

చరణం3:

తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి
రామకథను వినరయ్యా

చరణం4:

మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల వీచినది
రామకథను వినరయ్యా

చరణం5:

హరుని విల్లు రఘునాధుడు చేగొని
ఎక్కిడ ఫెళఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కళకళలాడే సీతారాముల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కళకళలాడే సీతారాముల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిపినవి
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 5, 2009

వెంగమాంబ

గాత్రం: చిత్ర
సాహిత్యం: వేదవ్యాస




పల్లవి:

జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ జయ దానవ దండనభీమ
జయ జయ మానవ మంగళసోమ
జయ జయ దానవ దండనభీమ
జయ జయ మానవ మంగళసోమ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ

కొండవేల ఎత్తినట్టి గోవిందుడు
తరిగొండలోన వెలిసెనమ్మ నృసింహుడు
పండుగల్లే వచ్చెనమ్మ కొండదేవుడు
మన చింతలన్ని తీర్చెనమ్మ శ్రీనివాసుడు
మురిపాల మురహరుడు సరసాల సుమసరుడు
సుధ పంచే సురవరుడు వరమిచ్చే పరకరుడు
కొండవేల ఎత్తినట్టి గోవిందుడు
తరిగొండలోన వెలిసెనమ్మ నృసింహుడు
పండుగల్లే వచ్చెనమ్మ కొండదేవుడు
మన చింతలన్ని తీర్చెనమ్మ శ్రీనివాసుడు

జయ జయ నవరస నరసింహ జయ జయహే జయధామ
జయ జయ నవరస నరసింహ జయ జయహే జయధామ
జయ జయ కృతయుగ జగదభిరామ
జయ జయ పదయుగ వరపరమాత్మ
జయ జయ కృతయుగ జగదభిరామ
జయ జయ పదయుగ వరపరమాత్మ
జయ జయ నవరస నరసింహ జయ జయహే జయధామ
జయ జయ నవరస నరసింహ జయ జయహే జయధామ

చరణం1:

నీలినీలి నింగిలోని నీటిమబ్బు రంగులన్ని
నేల రంగరించుకున్న రంగనాధుడు
సృష్టిలోన విచ్చుకున్న తమ్మిపూల సోయగాలు
కళ్ళలోన దాచుకున్న కమలనాభుడు
బంగారం సింగారాలకు సిరులొలికే పీతాంబరుడు
అనురాగం మందారాలను అమరిన వనమాలాధరుడు
శ్రీమత్య్సాంకము కల నెలరేడు
వామాంకము సిరికలవాడు

కొండవేల ఎత్తినట్టి గోవిందుడు
తరిగొండలోన వెలిసెనమ్మ నృసింహుడు
పండుగల్లే వచ్చెనమ్మ కొండదేవుడు
మన చింతలన్ని తీర్చెనమ్మ శ్రీనివాసుడు

జయ జయ పురుషోత్తమా జయ జయహే సురోత్తమా
జయ జయ పురుషోత్తమా జయ జయహే సురోత్తమా
జయ జయ లక్ష్మి ప్రియనరసింహ
జయ జయ జయ జయ పరంధామ
జయ జయ లక్ష్మి ప్రియనరసింహ
జయ జయ జయ జయ పరంధామ

చరణం2:

దానవుల గుండె పిండి పిండి చేయు సవ్వడుల
దండి శంఖమున్నవాడు ధర్మరూపుడు
దానవుల గుండె పిండి పిండి చేయు సవ్వడుల
దండి శంఖమున్నవాడు ధర్మరూపుడు
దిక్కు నీవె అన్న చాలు చిక్కులన్ని చీల్చివేయు
చక్రమును చేతపట్టు చిన్నికృష్ణుడు
ప్రహ్లాదుని పరిపాలించిన పరమాత్ముడు కరుణాకరుడు
జతగూడే యోగనిదురలో జగమేలే యోగీశ్వరుడు
రాసక్రీడ రాధాప్రియుడు రసమయ మురళీలోలుడు

కొండవేల ఎత్తినట్టి గోవిందుడు
తరిగొండలోన వెలిసెనమ్మ నృసింహుడు
పండుగల్లే వచ్చెనమ్మ కొండదేవుడు
మన చింతలన్ని తీర్చెనమ్మ శ్రీనివాసుడు

జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ జయ దానవ దండనభీమ
జయ జయ మానవ మంగళసోమ
జయ జయ దానవ దండనభీమ
జయ జయ మానవ మంగళసోమ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ
జయ తరిగొండ నరసింహ జయ జయహే జయధామ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 4, 2009

సంతోషీమాతా వ్రతమహత్యం

తారాగణం: కె.ఆర్.విజయ,చంద్రమోహన్,ప్రభ
గాత్రం: బాలు,సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
విడుదల: 1985




పల్లవి:

వెలిసావు వెలిసావు అమ్మణివై
మేము వెతుకుతున్న సంతోషమే బ్రహ్మణివై
జగమంతా నీ నవ్వుల విరిజల్లు జల్లుచూ
సాగిరమ్ము శ్రీలలిత సంతోషమాత
జయజయహొ జయజయహొ సంతోషమాత
సాగిరమ్ము శ్రీలలిత సంతోషమాత
జయజయహొ జయజయహొ సంతోషమాత
సాగిరమ్ము శ్రీలలిత సంతోషమాత
జయజయహొ జయజయహొ సంతోషమాత
సాగిరమ్ము శ్రీలలిత సంతోషమాత

చరణం1:

కలలెన్నో కన్నాము కన్నతల్లి నీకోసం
ఇలపై నీ అవతారం నూతన సందేశం
కలలెన్నో కన్నాము కన్నతల్లి నీకోసం
ఇలపై నీ అవతారం నూతన సందేశం
ప్రతి ఇంట సంతోషపు పాలవెల్లి పొంగులలొ రాతల్లి
ప్రతి ఇంట సంతోషపు పాలవెల్లి పొంగులలొ రాతల్లి
నీ అందెల రవళి మ్రోగ మా మదిలో రా తల్లి

జయజయహొ జయజయహొ సంతోషమాత
సాగిరమ్ము శ్రీలలిత సంతోషమాత
జయజయహొ జయజయహొ సంతోషమాత
సాగిరమ్ము శ్రీలలిత సంతోషమాత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 3, 2009

చక్రం

గాత్రం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల




పల్లవి:

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

చరణం1:

నేను అనీ లేను అనీ చెబితే ఏం చేస్తావు
నమ్మననీ నవ్వుకుని చాల్లే పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

చరణం2:

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేనని
నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 2, 2009

పెళ్ళిసందడి

తారాగణం: శ్రీకాంత్,దీప్తి భట్నాగర్,రవళి
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: అశ్వనీదత్,అల్లు అరవింద్
సంస్థ: రాఘవేంద్ర మూవీ కార్పోరేషన్స్
విడుదల: 1995





పల్లవి:

హా హా హా హా హ
హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

చరణం1:

ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమ
తనకొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వటమే చూపగల ఈ ప్రేమ
మంటలనె వెన్నెలగ మార్చును కదా
గాలికి గంధము పూయటమే పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి
మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

చరణం2:

ఏ జతనో ఎందుకో విడదీసి
వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
మౌనముతో మనసునే శృతి చేసి
రాగాలు పలికించు పాటే ప్రేమ
శాశ్వత చరితల ఈ ప్రేమ
మృత్యువు ఎరుగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా
వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
కరుణించు వరమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 1, 2009

వైశాలి

తారాగణం: సంజయ్,సుపర్ణ,గీత
గాత్రం: చిత్ర
సంగీతం: రవి
దర్శకత్వం: భరతన్
విడుదల: 1988




పల్లవి:

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
తీయని భావాల రాగసరాగమంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులె రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు
ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

చరణం1:

సగమదమగస గమదనిగమగ మదరిసనిదమదస
ఆడే మయూరబాల పురివిప్పి చెంత తాను విరిసెను పూలలో గారాలీవేళ
మధువులు కురిసే పెదవులలోన మధురస్వరాలు సాగేను ఈవేళ
ఓ గండుకోయిల జతకోరి పాడింది
అది విని ఆడింది ఓ కన్నెకోయిల

తలపులె రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు
ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

చరణం2:

నక్షత్రమాల నేడు ఆకాశవీధిలోన
కాంతుల విరివాన కురిపించేనులే
కలలే రగిలి అలలై కదిలి ఊహలు నాలోన ఉరికెనులే
హంసలు జతచేరి ఆనందమున తేలి
మనసార విహరించె మధురిమలో

తలపులె రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు
ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం
తీయని భావాల రాగసరాగమంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులె రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు
ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~