Sep 20, 2010

తోడూ నీడా

సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: ఘంటసాల, సుశీల




పల్లవి:

మళ్ళున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలి

మళ్ళున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలి

చరణం1:

పైరు మీది చల్లని గాలి
పైట చెరగు నెగరేయాలి
పైరు మీది చల్లని గాలి
పైట చెరగు నెగరేయాలి
పక్కన వున్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి
పక్కన వున్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి

మళ్ళున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలి

చరణం2:

ఏతమెక్కి గెడ వేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలి
ఏతమెక్కి గెడ వేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలి
వంగి బానను చేదుతు వుంటే
వంపుసొంపులు చూడాలి
వంగి బానను చేదుతు వుంటే
వంపుసొంపులు చూడాలి
వంపుసొంపులు చూడాలి

మళ్ళున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలి

చరణం3:

కాలు దువ్వి కోవెల బసవడు
ఖంగుమనీ రంకెయ్యాలి
కాలు దువ్వి కోవెల బసవడు
ఖంగుమనీ రంకెయ్యాలి
జడవనులే మావారున్నారు
వారి ఎదలో నేనుంటాను
జడవనులే మావారున్నారు
వారి ఎదలో నేనుంటాను

మళ్ళున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలి

Get this widget ||

No comments: