Sep 24, 2010

ఏంటి బావా మరీనూ

తారాగణం: నరేష్, శృతి, సింధుజ
గాత్రం: బాలు, చిత్ర, నరేష్
సంగీతం: విద్యాసాగర్
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంస్థ: సుచిత్ర క్రియేషన్స్
విడుదల: 1992




పల్లవి:

పనిస సనిస సనిసప
పనిస సనిస సనిస
మదిలో మెదిలే ఒక పాట
మనలో మనకే తెలుసు
చకచం చకచం చకచాచ
చకచం చకచం చకచ
ఆ వేణువు మళ్ళీ ఊదనా వినిపించే రాగాన
సరదాగా మళ్ళీ పాడనా సవిరహే తవదీన
పనిస సనిస సనిసప
పనిస సనిస సనిస
మదిలో మెదిలే ఒక పాట
మనలో మనకే తెలుసు

చరణం1:

పువ్వులే నవ్వగా ముసిరిన తొలకరి రాగం
ఝుమ్మనే తుమ్మెదే కొసరిన కుసుమపరాగం
అందాల ఆ విరులు విందే చేయనేలా
చిందేనే ఆవిర్లు పొందే కోరు వేళ
అవునంటావా?
కాదంటావా?
కాదనే అంటుంది
నువ్వేమన్నా నే కాదనక అవునంటాలే బావ
చకచం చకచం చకచాచ
చకచం చకచం చకచ

మదిలో మెదిలే ఒక పాట
మనలో మనకే తెలుసు
నీప నీప సాని సారిగమప
ఆహ ఆహ హాహహ అహహాహహా
పమ పమ ఉం ఉం
మగ మగ ఆ ఆ

చరణం2:

గుండెలో గంటలే పలికెను సరిగమలే
గువ్వల జంటలే కులుకుతు గుసగుసలాడే
రాగాల జగమంతా సాగే రాసలీల
చాలిస్తే మేలంటా మీరీ కాకిగోల
ఇవి కోపాలా?
మరి తాపాలా?
ఓ గోపాల ఇక ఆపాల లేదా వేళాపాళ

మదిలో మెదిలే ఒక పాట
మనలో మనకే తెలుసు
చకచం చకచం చకచాచ
చకచం చకచం చకచ
ఆ వేణువు మళ్ళీ ఊదనా వినిపించే రాగాన
సరదాగా మళ్ళీ పాడనా సవిరహే తవదీన
మదిలో మెదిలే ఒక పాట
మనలో మనకే తెలుసు
చకచం చకచం చకచాచ
చకచం చకచం చకచ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: