Nov 30, 2010

పద్మవ్యూహం

తారాగణం: సురేష్ మీనన్, రేవతి
గాత్రం: సుజాత
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: ఏ.ఆర్.రహ్మాన్
దర్శకత్వం: సురేష్ మీనన్
విడుదల: 1993




పల్లవి:

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందెలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందెలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా

చరణం1:

దైవముందంటినీ అమ్మనెరిగాకనే
కలలు నిజమంటినీ ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంతదాకా ప్రేమయే శాశ్వతం

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందెలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందెలే

చరణం2:

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే
మాట లేకున్ననూ భాష ఉంటుందిలే
ప్రేమయే లేక పోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడక గాలి కదలచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందెలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందెలే
ఇదియే ప్రేమ అందునా
వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా
ఓ మనసా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 27, 2010

కదలండి స్వాముల్లారా

గాత్రం: జేసుదాసు




పల్లవి:

కదలండి స్వాముల్లారా భక్తుల్లార నేడే మీరు
అయ్యప్పను చూడ శబరిమలై...శబరిమలై
తరలండి అయ్యల్లారా అనందంగా ఉత్సాహంగా
మణికంఠుని చూడ శబరిమలై...శబరిమలై
ఓసారి మీరు, అయ్యప్పస్వామి మాలెయ్యెండి
రక్షించును స్వామి, సత్యము ఇది మది నమ్మాలండి
భక్తితో పోదాము శబరిమలై
శరణం శరణం శరణం శరణం
అందరు వెళదాము జ్యోతిమలై
శరణం శరణం శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం

చరణం1:

వేకువనే వేగమే లేచి చన్నీటితో స్నానము చేసి
శ్రీగురుస్వామిని భక్తిగ కొలవాలి
గురుస్వామి దీవెన పొంది కడు శ్రద్ధగ దీక్షను పొంది
హరిహరతనయుని మాలలు వేయాలి
రుద్రాక్షలు ధరియించి అయ్యప్పను స్మరియించి
మండలము పూజలు చేయాలి
ముమ్మారులు సేవలు చేయాలి
కల్మషములు మరిచేపోవాలి
పరుషములగు మాటలు మానాలి
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం

కదలండి స్వాముల్లారా భక్తుల్లార నేడే మీరు
అయ్యప్పను చూడ శబరిమలై

చరణం2:

ప్రతిదినము నియమముగా ఇంటింటికి తిరగాలి
శ్రీమణికంఠునికి భజనలు చేయాలి
బహునల్లని వస్త్రాలు ప్రతినిత్యం ధరియించి
భూశయనంతోటి రేయిని గడపాలి
ఒకపూటే భుజియించి ముప్పూటలు భజియించి
స్మరణముతో కాలం గడపాలి
ఇరుముడితో కొండకు చేరాలి
పదునెనిమిది మెట్లను ఎక్కాలి
అయ్యప్పకు అర్పణ చేయాలి
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం

కదలండి స్వాముల్లారా భక్తుల్లార నేడే మీరు
అయ్యప్పను చూడ శబరిమలై...శబరిమలై
తరలండి అయ్యల్లారా అనందంగా ఉత్సాహంగా
మణికంఠుని చూడ శబరిమలై...శబరిమలై
ఓసారి మీరు, అయ్యప్పస్వామి మాలెయ్యెండి
రక్షించును స్వామి, సత్యము ఇది మది నమ్మాలండి
భక్తితో పోదాము శబరిమలై
శరణం శరణం శరణం శరణం
అందరు వెళదాము జ్యోతిమలై
శరణం శరణం శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 22, 2010

శ్రీరామదాసు

గాత్రం: బాలు
సాహిత్యం: పోతన,రామదాసు



పల్లవి:

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

చరణం1:

అంతరంగమున అత్మారాముడు
రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ

చరణం2:

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం

చరణం3:

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 19, 2010

బుల్లెమ్మ బుల్లోడు

తారాగణం: చలం,విజయనిర్మల
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: సత్యం
దర్శకత్వం: నాగాంజనేయులు
నిర్మాత: చలం
సంస్థ: శ్రీ రమణచిత్ర
విడుదల: 1972





పల్లవి:

కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా
కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు కొసరే రాగాలు
కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా

చరణం1:

అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను
తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను
అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను
చలి గాలి వీచె గిలిగింత తోచె
కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా

చరణం2:

ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడేను
కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపేను
ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడేను
బిగువు ఇంకేల దరికి రావేల
కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 17, 2010

ఎర్ర గులాబీలు

గాత్రం: బాలు, జానకి
సాహిత్యం: వీటూరి





పల్లవి:

ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే

చరణం1:

రోజాలతో పూజించని
విరితేనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించని
అనురాగమే పలికించని
కలగన్నదీ నిజమైనదీ
కధలే నడిపిందీ

ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే

చరణం2:

పయనించనా నీ బాటలో
మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలిరేయిని
కొనసాగనీ మన జంటని
మోహాలలో మన ఊహలే సాగే చెలరేగే

ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే

ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 15, 2010

అలీబాబా 40 దొంగలు

గాత్రం: ఏ.ఎం.రాజా, భానుమతి
సాహిత్యం: తోలేటి వెంకటరెడ్డి




పల్లవి:

ప్రియతమా మనసు మారునా, ప్రేమతో సిరులు నిలచి తీరునా
ప్రియతమా మనసు మారునా, ప్రేమతో సిరులు నిలచి తీరునా
తేనెలూరే మాటలన్ని తీరుగా నీటిపైన వ్రాతలేగా
తేనెలూరే మాటలన్ని తీరుగా నీటిపైన వ్రాతలేగా
నాపై బాస చేతునే హృదయమే నీది మధుర భాషిణి

చరణం1:

నా మనోహరి వినుము నీ గులామునే
ఓ మనోహరా కొనుము మా సలాములే
నా మనోహరి వినుము నీ గులామునే
ఓ మనోహరా కొనుము మా సలాములే
తేనెలూరే మాటలన్ని తీరుగా నీటిపైన వ్రాతలేగా
ప్రియతమా మనసు మారునా, ప్రేమతో సిరులు నిలచి తీరునా
నాపై బాస చేతునే హృదయమే నీది మధుర భాషిణి

చరణం2:

జవ్వని నీవు లేని జన్మమే వృధా
సుందరా నీవు లేని అందమే వృధా
జవ్వని నీవు లేని జన్మమే వృధా
సుందరా నీవు లేని అందమే వృధా
వలపు మీర తనివి తీరా హాయిగా ప్రణయసీమ సాగిపోదమా
వలపు మీర తనివి తీరా హాయిగా ప్రణయసీమ సాగిపోదమా

ప్రియతమా మనసు మారునా, ప్రేమతో సిరులు నిలచి తీరునా
ప్రియతమా మనసు మారునా, ప్రేమతో సిరులు నిలచి తీరునా
ప్రియతమా మనసు మారునా, ప్రేమతో సిరులు నిలచి తీరునా

| |

Nov 12, 2010

యువరాజు

తారాగణం: నాగేశ్వరరావు,జయసుధ,సుజాత
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల: 1982




పల్లవి:

ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కార్తీక పున్నమి చలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాజు పుట్టాడని
ఒక యువరాజు పుట్టాడని
వాడే వాడే నారాజు అవుతాడని

ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా కావేరి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాణి పుడుతుండని
ఆమే ఆమే నారాణి అవుతుందని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

చరణం1:

కనులనిండుగుంటాయనీ కామాక్షి కాదని కంచిలో లేదని
ప్రణయానికి రారాజని దేవేంద్రుడు కాడని స్వర్గంలో లేడని
కనుముక్కు తీరు చూసేటి జోరు
కనుముక్కు తీరు చూసేటి జోరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనేలేదని
ఆమే ఆమే నారాణి అవుతుందని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

చరణం2:

సిరులున్న చిన్నోడనీ శ్రీనివాసు కాడని తిరుపతిలో లేడని
చిన్నిముక్కు చిలకమ్మనీ చిత్రాంగి కాదని చిత్రాలు లేవని
చిరునవ్వు నోరు చిందాడే తీరు
చిరునవ్వు నోరు చిందాడే తీరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనేలేదని
వాడే వాడే నారాజు అవుతాడని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాజు పుట్టాడని
ఆమే ఆమే నారాణి అవుతుందని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 10, 2010

వధూవరులు

తారాగణం: గిరిబాబు,భారతి,అంజలీదేవి,చంద్రమోహన్
గాత్రం: రామకృష్ణ, వాణి జయరాం
దర్శకత్వం: విజయ బాబు
సంస్థ: చిత్రభాను పిక్చర్స్
విడుదల: 1976

పల్లవి:

చేయి చేయి కలిసింది
ఇక మనసు మనసు కలవాలి
ఇద్దరి నడుమ ఎన్నడు వీడని
ముద్దుల వంతెన వేయాలి
చేయి చేయి కలిసింది
మనసు మనసు కలవాలి

చరణం1:

గాలి ఈల వేస్తుందని
దేనికని? ఎందుకని?
నీ పాల బుగ్గలను నిమరాలని
కెరటం పొంగి వస్తున్నది
కెరటం పొంగి వస్తున్నది
దేనికని? ఎందుకని?
నీ అరికాళ్ళను తాకాలని
ఆ గాలిలో కెరటాలలో
ఆ గాలిలో కెరటాలలో
కరిగి ఒరిగి పోవాలి

చేయి చేయి కలిసింది
ఇక మనసు మనసు కలవాలి

చరణం2:

చూపు మాటు వేస్తున్నది
దేనికని? ఎందుకని?
నీ సొగసును సాంతం దోచాలని ఓ
హృదయం ఉబికి వస్తున్నది
హృదయం ఉబికి వస్తున్నది
హహ దేనికని? ఎందుకని?
నీ ఒడిలోనే ఒదగాలని
అనురాగమే మన లోకమై
అనురాగమే మన లోకమై
అలా అలా సాగాలి

చేయి చేయి కలిసింది
ఇక మనసు మనసు కలవాలి
ఇద్దరి నడుమ ఎన్నడు వీడని
ముద్దుల వంతెన వేయాలి
చేయి చేయి కలిసింది
మనసు మనసు కలవాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 8, 2010

రాజేశ్వరి కళ్యాణం

తారాగణం: నాగేశ్వరరావు, సురేష్, వాణిశ్రీ, మీనా
సాహిత్యం: వేటూరి
గాత్రం: బాలు, చిత్ర
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: క్రాంతికుమార్
సంస్థ: జయభేరి ప్రొడక్షన్స్
విడుదల: 1993




పల్లవి:

ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు
ఆడువారు యమునకాడ ఆ ఆ ఆ ఆ ఆ
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి ఆడుచు పాడుచు
అందరు చూడగ
ఓడను జరిపే ముచ్చట కనరే

చరణం1:

వలపు తడి తిరనాలే పొంగిన ఏటికి అందం
కెరటాలకు వయ్యారం కరిగే తీరం
తిలకమిడే కిరణాలే పొద్దుటి తూరుపుకందం
చినదానికి సింగారం సిగ మందరాం
పదాల మీదె పడవ
పెదాలు కోరే గొడవ
ఎదల్లో మోగే దరువే
కదంగా నావె నడవ
ఇలా నీలాటి రేవులో

ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు

తానానననాన నననానాన
తానానననాన నననానాన

చరణం2:

చిలిపి తడి వెన్నెలలే గౌతమి కౌగిలికందం
తొలిచూలుకు శ్రీకారం నడకే భారం
ఉలికిపడే ఊయలలే కన్నుల పాపలకందం
నెలవంకల సీమంతం ఓడిలో దీపం
తరాలు మారే జతలే
స్వరాలు పాడే కథలో
సగాలై పోయే మనువే
సృజించే మూడో తనువే
త్యాగయ్య రామ లాలిలో

ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 5, 2010

అయ్యప్పస్వామి మహత్యం

గాత్రం: బాలు
సాహిత్యం: వేటూరి




పల్లవి:

ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ మునిహృదయ జలజబృంగ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

చరణం1:

బ్రహ్మచారినై భక్తియోగినై ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై తాపత్రయమును విడిచి
కన్నెస్వామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా బంధము తెంచితి పందలవాస

ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

చరణం2:

శరణం శరణం భవతరణ శబరిగిరీశా అయ్యప్ప
శుభదం శుభదం నీ చరణం హరిహరపుత్ర అయ్యప్ప
అయినరేఖల సంగమవేళ మిధ్యావాసపు మధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో శిఖరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది
నీ మహిమ ఒక్కటే అయ్యప్ప
ఈ మహికి దేవుడే అయ్యప్ప
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం
శబరిగిరీశా ధన్యోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 3, 2010

ఆనంద్

గాత్రం: శ్రేయా గోషల్
సాహిత్యం; వేటూరి




పల్లవి:

తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే
తహ తహలోనే తకదిమి సాగే
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు

చరణం1:

పొద్దసలే పోక నిద్దుర పోనీక
ఎవ్వరిదో కేక ఎదలోతులదాకా
భారమాయె యవ్వనం
బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లే నేనున్నా
నీగాలి సోకేనా నా ఊపిరాడేనా
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు

అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే

చరణం2:

నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం లేత ఈడు ఏకాంతం
కోపమొచ్చే నామీద
తాపమాయె నీ మీద
దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్నా

తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nov 1, 2010

తల్లా? పెళ్ళామా?

తారాగణం: రామారావు, చంద్రకళ, శాంతకుమారి,హరికృష్ణ
గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: టి.వి.రాజు
దర్శకత్వం: రామారావు
నిర్మాత: నందమూరి త్రివిక్రమరావు
విడుదల: 1970





పల్లవి:

తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది
తెలంగాణా నాది రాయలసీమ నాది
సరారు నాది నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం1:

ప్రాంతాలు వేరైనా మన అంతరంగ మొకటేనన్నా
యాసలు వేరుగవున్నా మనభాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ
వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం2:

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్నా
ఈ రెంటిలోన ఏది కాదన్నా
ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్న
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం3:

పోచంపాడు ఎవరిది, నాగార్జునసాగరమెవరిది
పోచంపాడు ఎవరిది, నాగార్జునసాగరమెవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కారుపంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలౌ అయిదు కోట్ల తెలుగువారిది
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం4:

సిపాయి కలహం విజృంభించ నరసింహలై గర్జించాము...స్వతంత్ర భారతి జై
గాంధి నెహ్రుల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేసాము...వందేమాతరం,వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమ్మును సాధించాము...జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి ధీటే లేదనిపించాము
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది

చరణం5:

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇళ్ళెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గెడ్డను పగలగొట్టవద్దు
పాలు పొంగు మన తెలుగు గెడ్డను పగలగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులు పాలు చెయ్యొద్దు

తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది
తెలంగాణా మనది రాయలసీమ మనది
సరారు మనది నెల్లూరు మనది
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~