29-Oct-2010

తోడు నీడ

తారాగణం: శోభన్‌బాబు, సరిత, రాధిక, నళిని
గాత్రం: బాలు, సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: జనార్ధన్
నిర్మాత: వెంకన్న బాబు
సంస్థ: మహేశ్వరి ఫిలింస్
విడుదల: 1983




పల్లవి:

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

చరణం1:

నీ రూపం కలకాలం నా ఎదలో కదలాడే అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరిమువ్వల చిరునాదం ప్రతి ఉదయం వినిపించు భూపాల రాగం
మన లోకం అందాల లోకం
మన గీతం ఆనందగీతం
మన బ్రతుకు తుదిలేని సెలయేటి రాగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

చరణం2:

నీ చెంపల ఎరుపెక్కే నును కెంపుల సొంపులలో పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజిల్లే విరితేనెల మధురిమలో విరిసింది నవ పారిజాతం
ఈ రాగం అతిలోక బంధం
నీ స్నేహం ఎనలేని దాహం
అనుదినమొక అనుభవము రసమయ సంసారం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీతోనే, నా సర్వం నీలోనే
చూస్తున్నా నేనే నీవై

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27-Oct-2010

శ్రీరామదాసు

గాత్రం: విజయ్ యేసుదాసు,చిత్ర
సాహిత్యం: రామదాసు



చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ

పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా

చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం

శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ
పావన నామ పట్టాభి రామ
పావన నామ పట్టాభి రామ
నిత్యము నిన్నే కొలిచెద రామ
అహ నిత్యము నిన్నే కొలిచెద రామ
ఆహా రామా అయోధ్య రామ
ఆహా రామా అయోధ్య రామ
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకులసోమా
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25-Oct-2010

పద్మవ్యూహం

గాత్రం: బాలు
సాహిత్యం: రాజశ్రీ



పల్లవి:

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం

చరణం1:

కిరణాలు రవికందం, సెలయేరు భువికందం
మగువలకు కురులందం, మమతలకు మనసందం
పుత్తడికి మెరుపందం, పున్నమికి శశి అందం
పుత్తడికి మెరుపందం, పున్నమికి శశి అందం
నాదాలు శృతికందం, రాగాలు కృతికందం

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం

చరణం2:

వేకువకు వెలుగందం, రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం, ఆశలకు వలపందం
తలపులే మదికందం, వయసుకే ప్రేమందం
తలపులే మదికందం, వయసుకే ప్రేమందం
పాటకే తెలుగందం, శ్రీమతికి నేనందం

కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం, సిరిమల్లి సిగకందం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Oct-2010

అంజలి

తారాగణం: రఘువరణ్, రేవతి, బేబి షామిలి, తరుణ్
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: మణిరత్నం
సంస్థ: మద్రాస్ టాకీస్
విడుదల: 1990




పల్లవి:

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిల్లి
అమ్మమ్మ బంగారువే అందాలా చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాలా చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవల్లి
చల్లని చూపుల నా తల్లీ, వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే, ఆమని సొగలు నీ మురిపాలే
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిల్లి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిల్లి

చరణం1:

ఆకాశం సృష్టించిన దేవుడు గుర్తుండు రీతి
ఈ ఇలకే నిన్ను ఒక వరముగ ఇచ్చాడమ్మా
తల్లీ నీపై మేఘాలే పన్నీరే వెదజల్లేను
పూసే వసంత కోయిలలే నీకే జోలలు పాడేను
నడకలోన ఒక పూలతవే, నీవే
నవ్వులోన ఒక మల్లికవే, నీవే
అందచందాల చిన్నారి, నీవే
లోకమే మెచ్చు పొన్నారి
నీవేగ మాకు దేవత
ఇవాళ అంబరాన తారక

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిల్లి

చరణం2:

పువ్వల్లే నీ కళ్ళతో పలికే సింగారి నీవే
హంస వలే మాతో ఇక ఆడే బుజ్జాయివే
వినువీధుల్లో విహరించే వెన్నెల పాప అంజలివే
అమ్మ చల్లని ఒడిలోన ఆడీపాడే అంజలివే
నడిచి వచ్చు ఒక బొమ్మవట, నీవె
మెరిసిపోవు ఒక మెరుపువట, నీవె
చిందులాడు ఒక సిరివంట, నీవె
చిలకరించు నీ తేనెవట
తరంగమల్లె ఆడవా
వరాలు కోటి నీవు పంచవా

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిలి
అమ్మమ్మ బంగారువే అందాలా చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాలా చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవల్లి
చల్లని చూపుల నా తల్లీ, వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే, ఆమని సొగలు నీ మురిపాలే
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి...కమాన్
అంజలి అంజలి అంజలి విరిసే పున్నమి వెన్నెల జాబిలి...యాహూ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

||

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20-Oct-2010

వారసుడొచ్చాడు

గాత్రం: శైలజ, చిత్ర




పల్లవి:

పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక
ఇచ్చకాల ముళ్ళు చూపు గుచ్చిపోమాక
పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక
ఇచ్చకాల ముళ్ళు చూపు గుచ్చిపోమాక
చిచ్చు పెట్టి చిచ్చి కొట్టి తప్పుకోమాక
తప్పదింక బావయ్యో
తప్పు కాదు లేవయ్యో
మల్లెమొగ్గలాంటి పిల్ల అల్లుకోమంది
బుగ్గలోన సిగ్గు నీకు గిల్లుకోమంది
ముగ్గులోకి దించి మత్తు జల్లుకోమంది
గోల గోలగున్నాది
జోలపాడమన్నాది

చరణం1:

అందాల మామ నా చందమామ తానాలకొచ్చావా మావయ్యో
ఒళ్ళంత రుద్ది వయ్యారమద్ది నీళ్ళోయమంటావా
చుక్కంటి పిల్ల సూదంటి నడుము చుట్టేసుకోమంది మావయ్యో
చెక్కిళ్ళ తీపి నొక్కుళ్ళ మీద ఒట్టేసుకోమంది
జోరుమీదుంది అసలే వయ్యారం
తీరిపోవాల కొసరే యవ్వారం
డండ డాడాడ డాడ్డా డాడాడా
ఓయ్ డండ డాడాడ డాడ్డా డాడాడా
ఇక నీకే నా ముద్దు ముడుపులు
నాకే నీ పట్టు విడుపులు
డండరడడ్డ డాడ్డ డండరడడ్డ డాడ్డ

పచ్చిపాల ఒంటి ఈడు చిచ్చిపోమాక
ఇచ్చకాల ముళ్ళు చూపు గుచ్చిపోమాక
చిచ్చు పెట్టి చిచ్చి కొట్టి తప్పుకోమాక
తప్పదింక బావయ్యో
తప్పు కాదు లేవయ్యో

చరణం2:

ఉయ్యాలలూగే వయ్యారి భామ సయ్యాటకొచ్చింది మావయ్యో
తెల్లారిపోతే కిల్లాడి వయసు చల్లారిపోతుంది
పిచ్చెక్కిపోయే పిందంటి సోకు పండించుకుంటావా మావయ్యో
ముచ్చట్లు తీరే పందిట్లొ నాతో జంటేసుకుంటావా
సిగ్గు సింగారమిస్తా ఊ అంటే
లగ్గమెట్టించుకొస్తా సయ్యంటే
డడ్డ డాడాడ్డ డాడా డడడాడ్డ
డడ్డ డాడాడ్డ డాడా డడడాడ్డ
అరె వేసేయ్ ముత్యాల పందిరి
చేసేయ్ మురిపాల సందడి
డండరడడ్డ డాడ్డ డండరడడ్డ డాడ్డ

మల్లెమొగ్గలాంటి పిల్ల అల్లుకోమంది
బుగ్గలోన సిగ్గు నీకు గిల్లుకోమంది
ముగ్గులోకి దించి మత్తు జల్లుకోమంది
గోల గోలగున్నాది
జోలపాడమన్నాది
గోల గోలగున్నాది
నిన్ను జోలపాడమన్నాది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18-Oct-2010

మరణ మృదంగం

తారాగణం: చిరంజీవి, రాధ, సుహాసిని
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: కె.ఎస్.రామారావు
దర్శకత్వం: కోదండరామిరెడ్డి
సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్
విడుదల: 1988




పల్లవి:

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చంటే నమ్మండి ప్రేమ
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమ
మహా కసిగున్నది, భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది, ఎదే ఒడియన్నది
ఈ ముద్దుల్లో ముంచేసి ముద్దల్లే తడిపేసి
కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమ
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చంటే నమ్మండి ప్రేమ

చరణం1:

కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమ
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా ఎద ఎద కలిపేది ప్రేమ
శృంగార వీధుల్లోన షికారు చేసి
ఊరోళ్ళ నొలల్లోన పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారుకెక్కించి
పాటిస్తే వినుకోద్దు, లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు, ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలపు చిలిపి చినుకు

కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమ
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చంటే నమ్మండి ప్రేమ
మహా కసిగున్నది, భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది, ఎదే ఒడియన్నది
ఈ ముద్దుల్లో ముంచేసి ముద్దల్లే తడిపేసి
కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చంటే నమ్మండి ప్రేమ
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమ

చరణం2:

మళ్ళి మళ్ళి అంటుంది మారాముగా ఒళ్ళోకొచ్చి పాపంటి ప్రేమ
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా చెల్లించేయి ఆ కాస్త ప్రేమ
మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలెన్నో మరాము వేసి
వయసునే వసంతమాడించి, మనసులో తుళ్ళింత పుట్టించి
చూపుల్తో శృతి కాదు, మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు, ముట్టందే చలిపోదు
ఈ మనసు మదన తనువు తపన


కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చంటే నమ్మండి ప్రేమ
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమ
మహా కసిగున్నది, భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది, ఎదే ఒడియన్నది
ఈ ముద్దుల్లో ముంచేసి ముద్దల్లే తడిపేసి
కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమ
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చంటే నమ్మండి ప్రేమ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Oct-2010

అల్లరి ప్రియుడు

గాత్రం: బాలు,చిత్ర
సాహిత్యం: వేటూరి
సంగీతం: కీరవాణి



పల్లవి:

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

చరణం1:

చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా అహ అహ
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా అహ అహ
పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

చరణం2:

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వయ్యారమా
అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే

చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

||

13-Oct-2010

లవకుశ

గాత్రం: పి.సుశీల, రాణి
సాహిత్యం: కొసరాజు




పల్లవి:

రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం1:

నెల మూడు వానలు కురిసేనురా
బంగారు పంటలు పండేనురా
నెల మూడు వానలు కురిసేనురా
బంగారు పంటలు పండేనురా
కష్ట జీవుల వెతలు తీరేనురా
బీదా సాదా బ్రతుకు మారేనురా

రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం2:

రామయ్య వంటి కొడుకు రావాలనే
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే
రామయ్య వంటి కొడుకు రావాలనే
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే
ఇల్లు వాకిలి పరువు నిలపాలనే
చల్లంగ నూరేళ్ళు వెలగాలనే

రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం3:

పేదతనము భూమి మీద ఉండబోదురా
భేదాలకికమీద తావులేదురా
పేదతనము భూమి మీద ఉండబోదురా
భేదాలకికమీద తావులేదురా
దొంగ తోడుబోతు బాధ తొలగిపోవురా
రామరాజ్యమాయె మనకు లోటులేదురా

రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం4:

న్యాయమ్ము పాలించి నడుపువాడురా
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
న్యాయమ్ము పాలించి నడుపువాడురా
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
మునులందరినీ గాచు మొనగాడురా
ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా

రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
హోయ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Oct-2010

ష్...

తారాగణం: షఫీ,మాధవీలత,మిథున
గాత్రం: చిత్ర, కార్తీక్, గీతా మాధురి
సాహిత్యం: వేటూరి
సంగీతం: శ్రీ వసంత్
నిర్మాత & దర్శకత్వం: హరిచరణప్రసాద్
విడుదల: 2009





పల్లవి:

ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎదలో నీ వారెవ్వరో
ఎవరో ఎవరో మదినేలే వారెవ్వరో
మౌనం కరిగించే మనసే మురిపించే
నా ఏడేడు జన్మాల తోడెవ్వరో

ఎవరో ఎవరో
ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎదలో నీ వారెవ్వరో
ఎవరో ఎవరో మదినేలే వారెవ్వరో
మనసై కనిపించే మమతే కురిపించే
నా పంచప్రాణాల జాడెవ్వరో

చరణం1:

గుండెలోన పొంగుతున్న ప్రేమకు రూపం ఎవరో
ఇన్నినాళ్ళు దాచుకున్న ఊహల దీపం ఎవరో
మనసులోన తీయనైన గాయం చేసిందెవరో
మాటరాని చూపుతోనేఎ మంత్రం వేసిందెవరో
తొలిఋతువై నన్ను నాకు చూపించెనెవరో
తొలకరిలా మేను వేణు ఊదించెనెవరో
నాలోని తానెవ్వరో

ఎవరో ఎవరో ఎదలో నీ వారెవ్వరో
ఎవరో ఎవరో మదినేలే వారెవ్వరో

చరణం2:

సందెవేళ చందనాలు చల్లే జాబిల్లెవరో
ఎండలోన విరగబూసి నవ్వే సిరిమల్లెవరో
నందనాల స్వాగతించు ప్రేమకు రాగం ఎవరో
యమున పొంగు యవ్వనాల అలలకు తాళం ఎవరో
అలికిడిగా అసలు మాట దాచేదెవరో
అలజడిగా మెరుపు కన్ను గీటేదెవరో
తానింక నాకెవ్వరో

ఎవరో ఎవరో ఎదలో నీ వారెవ్వరో
ఎవరో ఎవరో మదినేలే వారెవ్వరో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Oct-2010

ఏమొకో చిగురుటధరమున

గాత్రం: బాలు
సాహిత్యం: అన్నమయ్య




పల్లవి:

ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో ఓ ఓ ఓ

చరణం1:

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువము
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువము
ఇప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటిన ఆ కొనచూపులు
నిలువున పెరుకగ అంటిన నెత్తురు కాదు కదా

ఏమొకో ఏమొకో
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో ఓ ఓ ఓ

చరణం2:

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల ఒద్దికలాగులివేమో
ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా

ఏమొకో ఏమొకో
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో ఓ ఓ ఓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Oct-2010

ఉయ్యాల జంపాల

గాత్రం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
సాహిత్యం: ఆరుద్ర




పల్లవి:

ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు

చరణం1:

ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
సొంతవూరు అయినవారు అంతరాన ఉందురోయ్
అంతరాన ఉందురోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు

చరణం2:

తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం
తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలె అతుకునోయ్‌
జ్ఞాపకాలె అతుకునోయ్‌
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు

చరణం3:

కనులనీరు చిందితే మనసు తేలికౌనులే
కనులనీరు చిందితే మనసు తేలికౌనులే
తనకూ తనవారికీ ఎడబాటే లేదులే
ఎడబాటే లేదులే
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

04-Oct-2010

అసెంబ్లీ రౌడీ

తారాగణం: మోహన్‌బాబు, దివ్యభారతి, జగ్గయ్య
గాత్రం: జేసుదాసు, చిత్ర
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాత: మోహన్‌బాబు
దర్శకత్వం: బి.గోపాల్
సంస్థ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్
విడుదల: 1991





పల్లవి:

అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
మనసునిండా మరులుపండ పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలే ఊగాల శివరంజి నవ్వాల
గరిసదస గరిసదస గరిసదస
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరార మగసిరిలా
కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస
అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరార మగసిరిలా

చరణం1:

నురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాలా
ఒంపు సొంపుల సెలయేరై వయసు గల గల నవ్వాలా
నురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాలా
ఒంపు సొంపుల సెలయేరై వయసు గల గల నవ్వాలా
కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాలా
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
కంటి పాపనై, కాలి అందెనై
కంటి పాపనై, కాలి అందెనై
కాలమంతా కరగబోసి కాపు ఉండనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా

చరణం2:

ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
తీగమల్లెనై తేనేజల్లునై
తీగమల్లెనై తేనేజల్లునై
కోరికంత కూడబెట్టి కొలువు సేయనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-Oct-2010

సంబరం

తారాగణం:నితిన్,నికిత
సంగీతం & గాత్రం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
సంస్థ: చిత్రం మూవీస్
దర్శకత్వం: దశరథ్
విడుదల: 2003



పల్లవి:

ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిల ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
వెంటాడుతు వేదించాల మంటై నను సాదించాలా
కన్నీటిని కురిపించాల జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానియ్యవా దయలేని స్నేహమా
ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిల ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

చరణం1:

తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా
ఒంటిగ నన్నెన్నడు వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి
ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపుల అల్లుకోకిల ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

చరణం2:

ఆపకిలా ఆనాటి కల అడుగడుగు కూలిపోదా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువ్వులేవని ఇకనైన నన్ను నమ్మనీ
నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
నన్నే నేను వైవేసుకొని దూరం అవుతున్నా

ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపుల అల్లుకోకిల ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా


||