Dec 12, 2011

పౌర్ణమి

గాత్రం: సాగర్,చిత్ర
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ
ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ మజిలీ

చరణం1:

స్మృతులే బ్రతుకై గడిపా ప్రతి పూటా నిన్నగా
సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా
మెరిసే కంటి పాపలలో వెలిశా నిత్య పౌర్ణమిలా
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వల

ఎవరో ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: