Dec 13, 2011

ఒక్కడు

గాత్రం: కార్తిక్,చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల

అయ్యబాబోయ్ నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి
ఏం ఐడియాలు ఆ నెలవంకను తుంచి నా జడలో తురమాలనుందా
దాంతో నా వీపును గోక్కోవాలనుంది
నువ్వేం మాయ చేశావో గాని
బాగుందే ఉం తర్వాత ఆ తర్వాత
ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీకు చలేస్తుందా
ఉహు ఆ చున్నీ ఇటిస్తావా
ఇవ్వు నాకు చలేస్తుంది
అవును మాయ నేను చేశానా
నువ్వేం మాయ చేశావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని

పల్లవి:

నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయని కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ తనదని తెలుసానీ
మనసు నీదే మహిమ నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని

చరణం1:

మూగ మనసిది ఎంత గడుసిది నంగనాచి సంగతులెన్నొ వాగుతున్నది
ఓహొ ఇంత కాలము కంటి పాపలో కొలువున్న కల నువ్వే అంటున్నది

హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
ఎందుకు ఉలికి పడుతుందని అడిగి చూడు నీ మనసుని
హే నిదురించే నీలి కళ్ళలో కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కలమేం వెతుకుతున్నదో తెలుసానీ
కనులు నీవే కలలు నీవే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని

చరణం2:

పిచ్చి మనసిది ఆ ఎంత పిరికిది నచ్చుతానో లేదో నీతో అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక అలలాగా ఎగిరి ఎగిరి పడుతున్నది

హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని
హేయ్ ఏ దారిన సాగుతున్నదో ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసానీ
పదము నీదే పరుగు నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: