31-Jan-2011

చంద్రహాస

తారాగణం:హరనాథ్,కృష్ణకుమారి,గుమ్మడి
గాత్రం: పి.లీల
సంగీతం: ఎస్.హనుమంతరావు
నిర్మాత & దర్శకుడు : బి.ఎస్.రంగా
సంస్థ: విక్రమ్ ప్రొడక్షన్స్
విడుదల: 1965



పల్లవి:

ఓ శేషశయనా నారాయణా
ఓ కమలనయనా దీనావన
ఓ శేషశయనా నారాయణా
ఓ చక్రధారి ఓహో మురారి
నీకంటే మాకు వేరేది దారి
నా చంద్రహాసు నీ పాదదాసు
కరుణించవయ్యా కాపాడవయ్యా
ఓ శేషశయనా నారాయణా

చరణం1:

అలనాడు నీవే ఆదరించావే
ఏ పాపమెరుగని ప్రహ్లాదుని
ఎలుగెత్తి నిన్నే తా పిలువుగా
కరుణించలేదా గజరాజుని
ఓ శేషశయనా నారాయణా

చరణం2:

దుష్టాత్మువలన కష్టాలు కలిగె
ఏ తప్పులేని యువరాజు నలిగే
శిక్షించవయ్యా పాపాత్ముల
రక్షించవయ్యా నీ భక్తుల

ఓ శేషశయనా నారాయణా
ఓ కమలనయనా దీనావన
ఓ శేషశయనా నారాయణా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Jan-2011

గోదావరి

గాత్రం: శంకర్‌మహదేవన్,చిత్ర
సాహిత్యం: వేటూరి




పల్లవి:

విధి లేదు తిధి లేదు ప్రతి రోజూ నీదే లేరా
పడిలేచే కెరటాల సరిజోడీ నీవే లేరా
ఈ దేశం అందించే ఆందేశం నీకేరా
నీ శంఖం పూరించే ఆవేశం రానీరా
రేపు మాపు నీదేరా
మనసా గెలుపు నీదేరా
మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా నీదేరా

చరణం1:

మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇక
లేనిదేని బాణమింక చేరుకోదు ఎలా
ప్రతిరోజు నీకొక పాఠమే చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా

మనసా గెలుపు నీదేరా
మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా నీదేరా

చరణం2:

ఆమనొస్తే కొమ్మలన్ని కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగివస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైనా రాముడైనది ప్రేమకోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగునీడల బొమ్మలాటే కదా

మనసా గెలుపు నీదేరా
మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా నీదేరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Jan-2011

గాయం

గాత్రం: బాలు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి





పల్లవి:

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం

చరణం1:

ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితను విశ్వవిజయాల విభవం

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ

చరణం2:

కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరిచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషము చిందెను జాతి కనుమున ఈ వికృత గాయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Jan-2011

అన్నదమ్ముల అనుబంధం

గాత్రం: బాలు,సుశీల



పల్లవి:

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

చరణం1:

వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా...రాజా

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

చరణ2:

మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే
రేయి పగలు నాలో వున్నది నీవే సోనీ


గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
లాలలా లాలలా లాలలా లాలలా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Jan-2011

రాజా

గాత్రం: ఉన్నికృష్ణన్,చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి

లాల్లలాల్లలా లాల్లలాల్లలా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

చరణం1:

గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార వాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని తరిమే బంధమిది
కల చెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

చరణం2:

పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు తుళ్లి తుళ్లి ఆడుతున్నవి
పంచలేని ఊహలే పంచవన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళ
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈవేళ
అణువణువును తడిపిన ఈ తడి అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటలు పరిచిన వనమున చూస్తున్నా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది

||

19-Jan-2011

ఇల్లాలు

గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆత్రేయ




పల్లవి:

నీవు నా ఊహలందే నిలిచావు
నేను నీ కళ్ళలోనే వెలిసాను
వేయి జన్మాలకైనా విడలేను
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను

చరణం1:

నీవొక చోట నేనొక చోట
అది లోకము పలికే తేలిక మాట
నీవొక చోట నేనొక చోట
అది లోకము పలికే తేలిక మాట
నీవున్నచోటే నిలిచాను నేను
ఏచోటనున్నా నీవు నేను ఒకటేలే

నీవు నా ఊహలందే నిలిచావు
నేను నీ కళ్ళలోనే వెలిసాను
వేయి జన్మాలకైనా విడలేను
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను

చరణం2:

నీ మనసే ఒక కోవెల కాదా
నా వలపే ఒక దీపము కాదా
నీ మనసే ఒక కోవెల కాదా
నా వలపే ఒక దీపము కాదా
దీపము నేనే దీవెన నీవే
దేవుని సాక్షిగ నీవు నేను ఒకటేలే

నీవు నా ఊహలందే నిలిచావు
నేను నీ కళ్ళలోనే వెలిసాను
వేయి జన్మాలకైనా విడలేను
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Jan-2011

ఆనంద్

గాత్రం: హరిహరన్,చిత్ర
సాహిత్యం; వేటూరి



పల్లవి:

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైనా కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైనా కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

చరణం1:

కట్టుకధలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిలకూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధిమార్చే కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో
పూసేటి మల్లెల్లో మనసు కధ
మరువకుమా వేసంగి ఎండల్లో
పూసేటి మల్లెల్లో మనసు కధ

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైనా కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

చరణం2:

శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులు ఎగసిన ఊసులు
మూగే మనసులు అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్నవేళలోన
శ్రీ గౌరీ

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైనా కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైనా కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Jan-2011

మహానది

గాత్రం: చిత్ర & కోరస్





పల్లవి:

సంక్రాంతి సంక్రాంతి ఊరంతా సంక్రాంతి...ఊరంతా సంక్రాంతి
ఓ సుబ్బీ గొబ్బమ్మ సుబ్బడ్నీయమంటు గొబ్బిళ్ళు తట్టండి- 2
మంచి మొగలిరేకువంటి మొగుడ్నీయమంటు పాటలు పాడండి - 2
ధన ధాన్యాలన్నీ రాశులుపోసి వచ్చే సంక్రాంతి - 2
మణిమాన్యాలన్నీ వరాలీయగ తెచ్చేనూ కాంతి - 2
ఏ తయ్యంతీయంతక్కు తీయంతక్కు - 4
ఓ సుబ్బీ గొబ్బమ్మ సుబ్బడ్నీయమంటు గొబ్బిళ్ళు తట్టండి
మంచి మొగలిరేకువంటి మొగుడ్నీయమంటు పాటలు పాడండి

చరణం1:

ముక్కారు పంటలతోటి వర్ధిల్లు ఈ పల్లె
చల్లంగ ఉన్నాదంటే కృష్ణమ్మ దయవల్లే
ఆ కొండకోనలు దాటి సాగి వచ్చిందీ
బంజర్లు మాగాణయ్యే సాగునిచ్చిందీ
కృష్ణమ్మ తోడై ఉంటే పంట చేలు బంగారం
అందాలు చిందేనంట పల్లెసీమ సింగారం
ఆ స్వర్గం అన్నది వేరే ఎక్కడొ లేనే లేదంట
కల్లకపటమన్నది కానరాని పల్లెల్లో ఉందంట

ఓ సుబ్బీ గొబ్బమ్మ సుబ్బడ్నీయమంటు గొబ్బిళ్ళు తట్టండి
మంచి మొగలిరేకువంటి మొగుడ్నీయమంటు పాటలు పాడండి
ధన ధాన్యాలన్నీ రాశులుపోసి వచ్చే సంక్రాంతి
మణిమాన్యాలన్నీ వరాలీయగ తెచ్చేనూ కాంతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Jan-2011

ఉయ్యాల జంపాల

సాహిత్యం: ఆరుద్ర
గాత్రం: ఘంటసాల,పి.సుశీల



పల్లవి:

దాచిన దాగదు వలపు
ఇక దాగుడు మూతలు వలదు
దాచిన దాగదు వలపు
ఇక దాగుడు మూతలు వలదు
చక్కనీ కోపమూ చల్లనీ తాపమూ
చక్కనీ కోపమూ చల్లనీ తాపమూ
ఎందుకు మనలో మనకు
దాచిన దాగదు వలపు
ఇక దాగుడు మూతలు వలదు
దాచిన దాగదు వలపు

చరణం1:

కనుచూపుల కమ్మని కులుకు
నను దోచుట మునుపే తెలుసు
కనుచూపుల కమ్మని కులుకు
నను దోచుట మునుపే తెలుసు
మనసంతా తనదైతే మరి చోరీ ఎందుకు
పూసలో దారమై
పూవులో తావియై
పూసలో దారమై
పూవులో తావియై
కలిసెను మనసు మనసు

దాచిన దాగదు వలపు
ఇక దాగుడు మూతలు వలదు
దాచిన దాగదు వలపు

చరణం2:

ఒక తీయని మైకము కలిగే
నెరవెన్నెల కన్నుల వెలిగే
ఒక తీయని మైకము కలిగే
నెరవెన్నెల కన్నుల వెలిగే
కలలందు హృదయాలు వినువీధులలో ఎగిరే
ఇరువూ ఏకమై ఒక్కటే ప్రాణమై
ఇరువూ ఏకమై ఒక్కటే ప్రాణమై
ముచ్చటగొలుపగవలయు

దాచిన దాగదు వలపు
ఇక దాగుడు మూతలు వలదు
దాచిన దాగదు వలపు
అహహహా హాహహా
ఓహొహో ఒహొహో
అహహహా హాహహా
ఓహొహో ఒహొహో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Jan-2011

చిరంజీవులు

గాత్రం: ఘంటసాల,పి.లీల
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి



పల్లవి:

కనుపాప కరవైన కనులెందుకు
తనవారె పరులైన బ్రతుకెందుకు
కనుపాప కరవైన కనులెందుకు
తనవారె పరులైన బ్రతుకెందుకు

చరణం1:

విరజాజి శిలపైన రాలేందుకే
మరుమల్లె సెంధూళి కలసేందుకే
విరజాజి శిలపైన రాలేందుకే
మరుమల్లె సెంధూళి కలసేందుకే
మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే
కనుపాప కరవైన కనులెందుకు
తనవారె పరులైన బ్రతుకెందుకు

చరణం2:

అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కధలాయెనా
అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కధలాయెనా
తలపోసి తలపోసి కుమిలేందుకా కనువిందుకా
కనుపాప కరవైన కనులెందుకు
తనవారె పరులైన బ్రతుకెందుకు

చరణం3:

తనవారు తనవారి విడిపోరులే
కనుమూసి గగనాన కలసేరులే
తనవారు తనవారి విడిపోరులే
కనుమూసి గగనాన కలసేరులే
ఏ నాటికైనాను నీదాననే,నీదాననే
చిననాటి మన పాట మిగిలేనులే
కలకాలమీగాధ రగిలేనులే
కలకాలమీగాధ రగిలేనులే
రగిలేనులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Jan-2011

అల్లరి ప్రియుడు



పల్లవి:

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపీ శిల్పమా,బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మథురా నగరమా,కృష్ణాసాగర కెరటమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం 1:

ఏ రవీంద్రుని భావమో గీతంజలి కళ వివరించె
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికె నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించె
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా..నీ నింగిలో
విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా
తెలుపుమా నీ ఊరేమిటి పరువమా

చరణం 2:

భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా
ఓ కావ్యమా నీ తోటలో
నవరస పోషణే గాలిగా
నవ్విన పూలే మాలగా
పూజకే సాధ్యమా తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపీ శిల్పమా,బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

||

06-Jan-2011

డిటెక్టివ్ నారద

గాత్రం: బాలు,చిత్ర




పల్లవి:

జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి
ఆశపడ్డ పాప నీరు లేని చేప
ఆటకట్టిపోతే బ్రతుకు బాట బలి
కన్నె పరువు వెలి
జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి

చరణం1:

గోడకున్న పాడు బొమ్మ చూడమని జాతర
మంత్రమంతా తంత్రమైతే యాతన
గోతిముందు కాపు వేసే నీతి లేని జాతికి
ఎప్పటికి లేకి బుద్ది మారదా
అడుగు కలపబోకు ఈ పడుచు పూతరేకు
మడత చెదరనీకు ఆ ఉసురు తగులు నీకు
ఎంత కట్టుబాటని ఎన్నుకునే ఉన్నది
ఎన్ని కలలు కన్నది
మాయలోకముల మాయరోగమిది

జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి
ఆశపడ్డ పాప నీరు లేని చేప
ఆటకట్టిపోతే బ్రతుకు బాట బలి
కన్నె పరువు వెలి
జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి

చరణం2:

మోజుపుట్టి లేచినట్టే మేలుకున్న రాతిరి
మేడమెట్లే దాటుతుంటె సుందరి
ఊగిపోరా రేగిపోరా సాగిపోరా సోదరా
లేదు నీకు స్పీడు బ్రేకు సాగరా
వరస కుదిరె రాజా అహ దొరికె లేత రోజా
తెలివికెదురులేదు మన గురికి తిరుగు లేదు
నాటుకున్న బాణము మాట వినను అన్నది
ఫేటు ఇలా ఉన్నది చేటు కాలమిది చేయి జారినది

జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి
ఆశపడ్డ పాప నీరు లేని చేప
ఆటకట్టిపోతే బ్రతుకు బాట బలి
కన్నె పరువు వెలి
జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి

||

04-Jan-2011

రాజా

గాత్రం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి:

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నా పాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నా పయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

చరణం1:

పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

చరణం2:

బ్రతుకే పాటగా మారి బాటయే మార్చగా
వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపననే
పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నా పాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నా పయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

||

02-Jan-2011

కొత్తనీరు

తారాగణం: చంద్రమోహన్, మోహన్‌బాబు,దీప
గాత్రం: ఎస్.పి.శైలజ
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: రమేష్ నాయుడు
దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
సంస్థ: లక్ష్మి ప్రొడక్షన్స్
విడుదల: 1981



పల్లవి:

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో ఆశగా ఉందనో
ఉర్రూతలూగకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా

చరణం1:

తలలోన ముడిచాక విలువైన పూవైన
దైవపూజకు తగదు మనసా
దైవపూజకు తగదు మనసా
తలలోన ముడిచాక విలువైన పూవైన
దైవపూజకు తగదు మనసా
దైవపూజకు తగదు మనసా
పొరపాటు చేసావో దిగాజారిపోతావు
నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు మొదటికే మోసాలు
చాలు నీ వేషాలు మనసా
చాలు నీ వేషాలు మనసా

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో ఆశగా ఉందనో
ఉర్రూతలూగకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా

చరణం2:

తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను
దిమ్మరిని నమ్మకే మనసా
దేశదిమ్మరిని నమ్మకే మనసా
తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను
దిమ్మరిని నమ్మకే మనసా
దేశదిమ్మరిని నమ్మకే మనసా
చపలచిత్తము విపరీతమవుతుంది
చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు కవ్వింపు సరసాలు
కాలు జారేనేమో మనసా
కాలు జారేనేమో మనసా

ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో ఆశగా ఉందనో
ఉర్రూతలూగకే మనసా
ఊగిసలాడకె మనసా
నువ్వు ఉబలాటపడకే మనసా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~