28-Dec-2011

ఇల్లాలు

గాత్రం: బాలు & కోరస్



పల్లవి:

స్వామియే శరణమయ్యప్ప
శబరిగిరీస అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
శబరిగిరీస అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ ఆ ఆ
చల్లని నీ దయ చల్లర స్వామి శరణం శరణం అయ్యప్ప
చల్లని నీ దయ చల్లర స్వామి శరణం శరణం అయ్యప్ప
సుధామయా మా వ్యధను తీర్చరా
శబరిగిరీస అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
శబరిగిరీస అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
శబరిగిరీస అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
శబరిగిరీస అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప

చరణం1:

సాగరమధనము జరిగే వేళ
హరి మోహినిగా అవతరించగా
హరీహర సంగమ ఫలమై
కలిజన దుష్కర హరమై
కొలిచినవారికి వరమై
వెలసిన దేవా అయ్యప్ప
వెలుగు చూపరా అయ్యప్ప

మకర సమీప అయ్యప్ప మము దయ చూడర అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
మకర సమీప అయ్యప్ప మము దయ చూడర అయ్యప్ప
మకర సమీప అయ్యప్ప మము దయ చూడర అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
మకర సమీప అయ్యప్ప మము దయ చూడర అయ్యప్ప

చరణం2:

పరమహంసవై బ్రహ్మచారివై
సంసార భాదలు కడతేర్చగా
పిలిచిన పలికే దేవుడవై
అడగక దొరికే దీవెనవై
ఆపదలో నేనున్నాని
అభయమునిచ్చే అయ్యప్ప
ఆదుకోర మా అయ్యప్ప

అనాధరక్షక అయ్యప్ప ఆపధ్బాంధవ అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అనాధరక్షక అయ్యప్ప ఆపధ్బాంధవ అయ్యప్ప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16-Dec-2011

వాన

గాత్రం: కార్తీక్
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు

చరణం1:

నిజం లాంటి ఈ స్వప్నం
ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడు

చరణం2:

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-Dec-2011

ఒక్కడు

గాత్రం: కార్తిక్,చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల



అయ్యబాబోయ్ నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి
ఏం ఐడియాలు ఆ నెలవంకను తుంచి నా జడలో తురమాలనుందా
దాంతో నా వీపును గోక్కోవాలనుంది
నువ్వేం మాయ చేశావో గాని
బాగుందే ఉం తర్వాత ఆ తర్వాత
ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీకు చలేస్తుందా
ఉహు ఆ చున్నీ ఇటిస్తావా
ఇవ్వు నాకు చలేస్తుంది
అవును మాయ నేను చేశానా
నువ్వేం మాయ చేశావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని

పల్లవి:

నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయని కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ తనదని తెలుసానీ
మనసు నీదే మహిమ నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని

చరణం1:

మూగ మనసిది ఎంత గడుసిది నంగనాచి సంగతులెన్నొ వాగుతున్నది
ఓహొ ఇంత కాలము కంటి పాపలో కొలువున్న కల నువ్వే అంటున్నది

హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
ఎందుకు ఉలికి పడుతుందని అడిగి చూడు నీ మనసుని
హే నిదురించే నీలి కళ్ళలో కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కలమేం వెతుకుతున్నదో తెలుసానీ
కనులు నీవే కలలు నీవే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని

చరణం2:

పిచ్చి మనసిది ఆ ఎంత పిరికిది నచ్చుతానో లేదో నీతో అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక అలలాగా ఎగిరి ఎగిరి పడుతున్నది

హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని
హేయ్ ఏ దారిన సాగుతున్నదో ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసానీ
పదము నీదే పరుగు నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోని


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Dec-2011

పౌర్ణమి

గాత్రం: సాగర్,చిత్ర
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ
ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ మజిలీ

చరణం1:

స్మృతులే బ్రతుకై గడిపా ప్రతి పూటా నిన్నగా
సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా
మెరిసే కంటి పాపలలో వెలిశా నిత్య పౌర్ణమిలా
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వల

ఎవరో ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Dec-2011

బామ్మ మాట బంగారు బాట

గాత్రం: బాలు, జానకి
సాహిత్యం: వేటూరి



పల్లవి:

ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా

ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
మొగ్గ విచ్చుకున్న వేళ కలువభామా
ముద్దులన్ని లెక్కపెట్టె చందమామ
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా

చరణం1:

గుట్టు లేని గుండెలో గుచ్చి గుచ్చి చూడకు
మల్లెపూల దండలో దారమింక దాచకు
గుట్టు లేని గుండెలో గుచ్చి గుచ్చి చూడకు
మల్లెపూల దండలో దారమింక దాచకు
కొంటెగా చూడకు కోక సిగ్గు మాత్రము
కంటితో తుంచనీ కన్నె జాజి పుష్పము
మోగుతున్న యవ్వనం వేగుచుక్క కోరునా
కాగుతున్న పాలలో మీగడింక దాగునా

ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
మొగ్గ విచ్చుకున్న వేళ కలువభామా
ముద్దులన్ని లెక్కపెట్టె చందమామ
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు ఉహుహు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

02-Dec-2011

మంగమ్మగారి మనవడు

గాత్రం: భానుమతి



పల్లవి:

శ్రీరఘురామ సీతారామ రావాలయ్యా నీ రాజ్యం
శ్రీరఘురామ సీతారామ రావాలయ్యా నీ రాజ్యం
శ్రీరఘురామ సీతారామా

చరణం1:

చల్లని సీమ మా పల్లెసీమ నానా పాత్రల మేలవం
చల్లని సీమ మా పల్లెసీమ నానా పాత్రల మేలవం
నవరసభరితమీ నాటకరంగము
నవరసభరితమీ నాటకరంగము
ఆడించేది నీవేనయ్యా

శ్రీరఘురామ సీతారామ రావాలయ్యా నీ రాజ్యం
శ్రీరఘురామ సీతారామా

చరణం2:

నీ నామ మహిమ పాషాణాలే కడలికి వారధి కాలేదా
నీ నామ మహిమ పాషాణాలే కడలికి వారధి కాలేదా
నిన్నే నమ్మిన నిజ భక్తులను
నిన్నే నమ్మిన నిజ భక్తులను
నిరతం దయతో చూడాలయ్యా

శ్రీరఘురామ సీతారామ రావాలయ్యా నీ రాజ్యం
శ్రీరఘురామ సీతారామా ఆ ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~