Sep 21, 2008

అందమైన అనుభవం

గాత్రం:బాలు



పల్లవి:

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ
మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది ఎహెహెహెహె హహహ


చరణం1:

దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నేనలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతె గిలిగింత పెట్టావు శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది పాపప్పపాప

చరణం2:

నీ కళ్ళు నా కళ్ళు కలిసి నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది రపప్పరరపప్ప

||

No comments: