30-Nov-2009

జై

గాత్రం: శ్రేయ ఘోషల్
సాహిత్యం: కులశేఖర్




పల్లవి:

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోన
తీయనీ బాధ ఏమిటో
ఆపినా ఆగదేమిటో
ఉన్నమాటలే రాని వేళలో
కొత్త మాటకై తొందరేమిటో
తెలుసునా చిలిపి ప్రాయమా
ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోన

చరణం1:

గుండె గూటిలోన
నా కంటి పాపలోన
చెప్పలేని సిగ్గులెందుకో
కొంటె ఊసులోన
ఈ కొత్త హాయిలోన
పైట కొంగు జారెనెందుకో
గాలి అలలపైన ఉయ్యాలలూగుతునన్నా
మాట రాని నేను ఈ పాట పాడుతున్నా
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసునా చిలిపి ప్రాయమా

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోన

చరణం2:

ఎన్ని రోజులైన
ఈ వింత మోజులోన
ఆకలంటూ వేయదెందుకో
ఎన్ని రాత్రులైనా
ఎంత మాత్రమైనా
కంటి రెప్ప వాలదెందుకో
మూగ సైగలోన మోగింది మౌనవీణ
పాల గుండెలోన పున్నాగ పూలవాన
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసునా చిలిపి ప్రాయమా

ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
ఎంత అల్లరో మల్లె మనసులోన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29-Nov-2009

అమాయకురాలు

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు,శారద,కాంచన,గుమ్మడి
గాత్రం: పి.సుశీల
సాహిత్యం: దాశరధి
సంగీతం: సాలురి రాజేశ్వరరావు
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: డి. మధుసూదనరావు
సంస్థ: అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్
విడుదల: 1971




పల్లవి:

పాడెద నీ నామమే గోపాల
పాడెద నీ నామమే గోపాల
హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాల

చరణం1:

మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా
మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా
ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా
పాడెద నీ నామమే గోపాల

చరణం2:

నీ మురళీగానమే పిలిచెరా
కన్నుల నీ మోము కదలెనులేరా
నీ మురళీ గానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసె యమునా తటిపై ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునా తటిపై
నీ సన్నిధిలో జీవితమంత కానుక చేసెను రా రా

పాడెద నీ నామమే గోపాల
హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Nov-2009

తలంబ్రాలు

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: మల్లెమాల




పల్లవి:

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
తోడుగా నాతో ఉండిపో

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
నీడలా నాతో ఉండిపో

చరణం1:

నీలల నింగి ఒంగి నేల చెవిలో ఇలా అంది
నీలల నింగి ఒంగి నేల చెవిలో ఇలా అంది
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నది
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నది హొయ్
సరిలేని సుద్దుల్లో విడిపోని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ


నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
నీడలా నాతో ఉండిపో

చరణం2:

గోదారి కెరటంలోన గోరంత సొగసే ఉంది
హొయ్ గోదారి కెరటంలోన గోరంత సొగసే ఉంది
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ
కార్తీక పున్నమిలోన కాసింత హాయే ఉంది
కార్తీక పున్నమిలోన కాసింత హాయే ఉంది
ఏ వేళనైన నీ నీడలోన ఎనలేని హాయున్నదీ
కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
నీడలా నాతో ఉండిపో
నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27-Nov-2009

మజ్ను

తారాగణం: నాగార్జున,రజని
గాత్రం: బాలు
సంగీతం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్
నిర్మాత & దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంస్థ: తారకప్రభు ఫిలంస్
విడుదల: 1987




పల్లవి:

ఇది తొలిరాత్రి కదలని రాత్రి
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కధల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కధల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

చరణం1:

వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది
దీపమేమో విరబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచీ పిలిచి వేచి వేచి ఎదురురు చూస్తున్నవీ

ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

చరణం2:

వెన్నెలంతా అడవిపాలు కానున్నది
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
ఆ ఆ వెన్నెలంతా అడవిపాలు కానున్నది
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలిలో దీపమైనది
మమకారం మనసునే కాల్చుతున్నది
నీ చివరి పిలుపు కొరకు
ఈ చావు రాని బ్రతుకు
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది

ఆ ఆ ఆ ఆ ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కధల రాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Nov-2009

శివమెత్తిన సత్యం

గాత్రం: జేసుదాసు,వాణిజయరాం



పల్లవి:

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన
ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోనా…
ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హాయి

చరణం1:

కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
అనురాగ శిఖరాన అందాల తోట
అనురాగ శిఖరాన అందాల తోట
ఆ చోట కోనేట సయ్యటలాడాలీ

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోనా…
ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హాయి

చరణం2:

కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన ఆ ఆ ఆ ఆ
కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన
కన్ను సైగల కౌగిలింతల సన్నజాజి తావి
ఎన్ని మారులు నిన్ను చూసినా దేవ రంభ ఠీవి
మువ్వల రవళి మోహన మురళి
మువ్వల రవళి మోహన మురళీళి
మధురం మధురం మానస కేళి

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోనా…
ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హాయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25-Nov-2009

ఆర్య

గాత్రం: కె.కె
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

feel my love
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో
చెలియా feel my love
నా ప్రేమను భారంగానో
నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో
సఖియా feel my love
నా ప్రేమను మౌనంగానో
నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో
కాదో లేదో ఏదో గానో
feel my love
feel my love
feel my love
feel my love

నా ప్రేమను
నా ప్రేమను
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో
చెలియా feel my love

చరణం1:

నేనిచ్చే లేఖలన్ని చించేస్తూ feel my love
నే పంపే పువ్వులనే విసిరేస్తూ feel my love
నే చెప్పే కవితలన్ని ఛీ కొడుతూ feel my love
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే feel my love
నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదని
నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటునే
feel my love
feel my love

నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో
చెలియా feel my love

చరణం2:

ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love
ఏదోటి తిడుతూనే నోరారా feel my love
విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love
వదిలెసి వెళుతూనే అడుగారా feel my love
అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
feel my love
feel my love

నా ప్రేమను కోపంగానో...నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో...నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను భారంగానో
నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో
సఖియా feel my love
feel my love

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Nov-2009

ఆడపిల్లనమ్మ

గాత్రం: మధుప్రియ
సాహిత్యం: మధుప్రియ



పల్లవి:

ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ
ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ

చరణం1:

అష్టమిలో పుట్టాననీ అమ్మా జెష్టదాన్నంటున్నరా
ఈ పాడు లోకములొ అమ్మా హీనంగ చూస్తున్నరా
ఆడదని అంటున్నరా అమ్మా పాడు అని తిడుతున్నరా
అష్టమిలో పుట్టిన కృష్ణుడ్నేమో దేవుడని అంటున్నరా
నన్నేమో పాడుదని తిడుతున్నరా

ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ

చరణం2:

పలక బలపం బట్టి అమ్మా బడికీ పోతుంటే
ఆడపిల్లయినందుకు అమ్మా సదువెందుకంటున్నరా
సదువెందుకంటున్నరా అమ్మా సందెందుకంటున్నరా
సదువుల తల్లి సరస్వతిదేవి ఆడదె కదమ్మా
నాకేమో సదువెందుకంటున్నరా

ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ

చరణం3:

ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా
లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తాననీ
కడుపులోనె ఆడబిడ్డంటె అమ్మా కరగదీస్తున్నరా
ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది
రేపేమో జగతికి మార్గమేదీ

ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ
బాధపడకమ్మ నీవు దిగులు చెందకమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Nov-2009

మొండిమొగుడు పెంకిపెళ్ళాం

తారాగణం : సుమన్,విజయశాంతి,తనికెళ్ళ భరణి
గాత్రం: శైలజ
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : వై.నాగేశ్వరరావు
విడుదల: 1992



పల్లవి:

లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి
లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి
ఔ మల్లా ఒట్టిజూట మాట చెప్పి వచ్చెదాక లొల్లి పెట్టి
పట్టుకుంటె పోరగాడు పలకనామ పారిపోయె తుర్ర్ ర్
లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి

చరణం1:

ఆడె సెలికాడు నాకు లాఠి పోలీసువోడు ఆన్నే ప్రేమించినాను సై సై సై
కృష్ణా నీకంటెవాడు ఇంకా మాకొంటెవాడు కన్నె కొట్టిండు నాకు కొయ్ కొయ్ కొయ్
నెమలిఫించమొకటి తక్కువ ఆడి పొగరుచూస్తె తగని మక్కువ
ఏడికో ఉరుకుతాడని ఏసినా ముక్కు తాడునే
కొంగులాగి ఓడిపోని కొంగుముళ్ళు ఏసుకున్నా
వేడుకైన కన్నె ఊసు నేడు మళ్ళి సెప్పుకున్న తుర్ర్ ర్ సమజైనదా

లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి
లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి
ఔ మల్లా ఒట్ట్జూట మాట చెప్పి వచ్చెదాక లొల్లి పెట్టి
పట్టుకుంటె పోరగాడు పలకనామ పారిపోయె తుర్ర్ ర్

చరణం2:

టోపి చప్రాసికన్న,బీడి బంట్రోతుకన్న పోలీసు పటేలు బతుకు డొయ్ డొయ్ డొయ్
గదిలో పెళ్ళాంతో ఉన్నా,గంటల్ ఫోనొస్తే మళ్ళ ఎంటంటె కాళ్ళ పరుగు రయ్ రయ్ రయ్
పొద్ద్ల లేస్తె ఖూని కేసులు,పిండలెత్తెదాక పావుకాపులు
బందులైతె చచ్చి తిరుగుడు ఆడ బందుకెత్తి గోలికాల్చుడు
ఉండదే కంటినిద్దరు ఏళకే తిండితిప్పలు
అడవికెళ్ళి బదలయిస్తె ఆలుబిడ్డ యాదమరచి
ఆకు అలం మెక్కుడేలె మీకు బలం మింగుడేలే
తుర్ర్ ర్ జర గుస్సదేకుండ్రి నే సచ్చ చెపుతున్నా

లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి
లాలుదర్వాజ లష్కర్ బోనాల్ పండగకొత్తనని రాకపోతివి
లకిడికాపూల్ పోరికి రబ్బరు గాజులు తెత్తనని తేకపోతివి
ఔ మల్లా ఒట్ట్జూట మాట చెప్పి వచ్చెదాక లొల్లి పెట్టి
పట్టుకుంటె పోరగాడు పలకనామ పారిపోయె తుర


||

22-Nov-2009

జమిందారుగారి అమ్మాయి

తారాగణం: రంగనాథ్,శారద,రాజబాబు
గాత్రం: సుశీల
సాహిత్యం: దాశరధి
సంగీతం: జి.కె.వెంకటేష్
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
విడుదల: 1975



పల్లవి:

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే

చరణం1:

అధరాల మీద ఆడింది నామం
అధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరి మరీ నిలిచిందిలే

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే

చరణం2:

సిరిమల్లెపువ్వు కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరి మరీ ఆనందమే

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Nov-2009

వెంగమాంబ

గాత్రం: చిత్ర
సాహిత్యం: వేదవ్యాస




పల్లవి:

అమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అలమేల్మంగమ్మ
మోహన వేంకటరమణుని ముద్దులరాణి మొరవినవమ్మ
మృదు మధుర మధుర మంజుల వాణి పద్మమ్మ పలుకవమ్మ
అలకులకులుకల ఆమని తలుకుల అలమేల్మంగమ్మ
హరి చిలకల పలుకుల కులకల మొలకల
సురుచిర సుమధుర సుధవమ్మ
మోహన వేంకటరమణుని ముద్దులరాణి మొరవినవమ్మ

చరణం1:

అనంతరంగని అంతరంగమున అమృత తరంగము నీవమ్మ
అంగరంగ వైభోగ కమనీయ కళ్యాణ గంగవమ్మ
పట్టిన పట్టును వీడక శ్రీనివాసుని చేపట్టితివమ్మ
ఏ వేళనైన ఏ ఘడియనైన పతి ఎదవీడి ఎరుగవమ్మ
ప్రేమకు పెన్నిధివమ్మ ప్రీదకు సన్నిధివమ్మ
మోహన వేంకటరమణుని ముద్దులరాణి మొరవినవమ్మ

చరణం2:

కొండంత ఆశతో తిరుమల కొండనుండ కోరితినమ్మ
కొండంత ఆశతో తిరుమల కొండనుండ కోరితినమ్మ
అది ఏమొగాని నీ విభుడు నిన్నడిగి నన్నిచట ఉండమనెనమ్మ
అమ్మా యోహలక్ష్మి అనుమతిని ఇవ్వవమ్మ
అనుమతిని ఇవ్వవమ్మ
అనుమతిని ఇవ్వవమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20-Nov-2009

పెళ్ళి సందడి

గాత్రం:చిత్ర
సాహిత్యం:సామవేదం షణ్ముఖశర్మ



పల్లవి:

నవమన్మధుడ,అతిసుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

చరణం1:

గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగాలే శృతి చేసాడే జత తాళలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదొ పలికే

అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

చరణం2:

వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరిక లూగెనె ఒడి చేరి తలవాల్చెనే
జడ లాగాడే కవ్వించాడే నడు ఓంపుల్లో చిటికేసాడే
అధరాలతోనె శుభలేఖ రాసె మరుడే

చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు
నవమన్మధుడ,అతిసుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Nov-2009

సంతోషీమాతా వ్రతమహత్యం

గాత్రం: బాలు,సుశీల




పల్లవి:

పువ్వు తావి వెలుగు నీడ
మీరు నేను విడిపోము
పువ్వు తావి వెలుగు నీడ
మీరు నేను విడిపోము
పదమూ భావము స్వరమూ రాగము
మనమిరువురము కలిసాము
పువ్వు తావి వెలుగు నీడ
మీరు నేను విడిపోము

చరణం1:

పైరగాలి తూగాడే పరవళ్ళ సొగసుల్లో
తిమిరాలను తొలగించు వెలుగులొలుకు కిరణాల్లో
పైరగాలి తూగాడే పరవళ్ళ సొగసుల్లో
తిమిరాల తొలగించు వెలుగులొలుకు కిరణాల్లో
నేల తల్లి ఓరిమిలో నిన్ను చూచుకున్నాను
నిన్నందిన నీ మదిలో వెన్నెలగా విరిసాను

పువ్వు తావి వెలుగు నీడ
మీరు నేను విడిపోము

చరణం2:

పురివిప్పిన నెమళ్ళలో పరువానివి నువ్వేలే
హరిచందన తరువులలో పరిమళము నీవేలే
పురివిప్పిన నెమళ్ళలో పరువానివి నువ్వేలే
హరిచందన తరువులలో పరిమళము నీవేలే
చిరుసందెలకాంతుల్లో చిరుగాలివి నీవేలే
నా మదిలో వినిపించే రాగానివి నీవేలే

పువ్వు తావి వెలుగు నీడ
మనమిరువురమూ విడిపోము

చరణం2:

శివపార్వతులము మనమో సీతారాములమో
ఏ జన్మల అనుబంధమో ఎంత పుణ్యఫలమో
శివపార్వతులము మనమో సీతారాములమో
ఏ జన్మల అనుబంధమో ఎంత పుణ్యఫలమో
ఈ లోకమునందు మనము ఎచటున్నాగాని
ఏడడుగుల మన బాసలే ఎపుడూ వినిపిస్తాయి

పువ్వు తావి వెలుగు నీడ
మనమిరువురము విడిపోము
పదమూ భావము స్వరమూ రాగము
మనమూ మనమూ కలిసాము
పువ్వు తావి వెలుగు నీడ
మనమిరువురము విడిపోము

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

18-Nov-2009

దేవుళ్ళు

గాత్రం: బాలు
సాహిత్యం: జొన్నవిత్తుల




పల్లవి:

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః
హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయనమః
నిజ భీర గంభీర శభరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్ధితానంత బ్రహ్మండరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః

చరణం1:

పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభుమనుచు దీవించి జనకృందములచేరె జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ముకాగ ధీమంతుడైలేచి ఆ కన్నెస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగుపరుగున వచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః

చరణం2:

ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని రోజు శబరీషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామీ
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర కలి భీతి తొలగించు భూతాదినేత
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయనమః

చరణం3:

ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము అణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానదీ తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామీ
శరణమయ్యప్పా శరణమయ్యప్పా
శంభు విష్ణు తనయ శరణమయ్యప్పా
శరణమయ్యప్పా శరణమయ్యప్పా
శంభు విష్ణు తనయ శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః


||

17-Nov-2009

గోపి గోపిక గోదావరి

గాత్రం: చక్రి,వంశీ
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి




పల్లవి:

గో గో తననన గో గో
గో గో తననన గో గో
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
గో గో తననన గో గో తననన గో గో తననన గో గో
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
తెరమరుగు నలుపునిక తుడిచెయ్
అదమరుపు ముసుగు నువ్వు వదిలెయ్
అలుపనని పరుగులకు జతవై
కధ మలుపు వెనుకె నువ్వు పదవోయ్
దరికేసేయ్ జోర్సేయ్ వార్సేయ్ పడవై నువ్వై
గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై

చరణం1:

తననన తననన తననన తననన
నువ్వెవరైనా నేనెవరైనా నవ్వులు ఒకటేలే...జాణ
ఏ పెదవైనా ఏ ఎదకయినా సవ్వడి ఒకటేలే...కాదా
వినవా వినవా గురువా
మన అందరిదొకటే పడవ
మనసు మమత కరువా
జనమంతా ఒకటే అనవా
చినుకు తడి తగిలిన చోట పరిమళం పుడుతుందంట
తలుకు సిరిజల్లువు నువ్వై అల్లుకుపోమరి

గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై

చరణం2:

తననన తననన తననన తననన
ఎల్లలు తెలిపే అల్లరితనమై మాటలు ఎగరాలి...జాణ
గుండెను తడిపే వెన్నెల గుణమై తేనెలు చిలకాలి...కాదా
పదవే పదవే చిలక
పదుగురిని కలిసే పనిగా
పరదా వెనకే విడిగా
నువ్వొంటరి కాకే పలుకా
పిలుపు వినిపించిన వైపు కదలని నీ కనుచూపు
బదులుగా ఎదురేరాదా తూరుపు మెరుపు

గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
తెరమరుగు నలుపునిక తుడిచెయ్
అదమరుపు ముసుగు నువ్వు వదిలెయ్
అలుపనని పరుగులకు జతవై
కధ మలుపు వెనుకె నువ్వు పదవోయ్
దరికేసేయ్ జోర్సేయ్ వార్సేయ్ పడవై నువ్వై
గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
నీదై

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16-Nov-2009

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

తారాగణం: రవితేజ,భూమిక,గోపిక,మల్లిక,కనిక
గాత్రం: కె.కె
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: ఎస్. గోపాల్‌రెడ్డి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
సంస్థ: శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్
విడుదల: 2004




పల్లవి:

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చరణం1:

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగచాటుగా కాల్చిన బీడి
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చరణం1:

మొదటిసారిగా గీసిన మీసం
మెదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తియ్యందనము

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Nov-2009

విప్రనారాయణ

గాత్రం:ఏ.ఎం.రాజా,భానుమతి



పల్లవి:

మధుర మధురమీ చల్లని రేయి
మరువ తగనిది ఈ హాయి
మధుర మధురమీ చల్లని రేయి
మరువ తగనిది ఈ హాయి
మధుర మధురమీ చల్లని రేయి

చరణం1:

నవ్వుల వెన్నెల నాలో వలపుల
నవ్వుల వెన్నెల నాలో వలపుల
కవ్వించునదే దేవి
స్వాముల సోయగమెంచి
పులకించునదేమో ఈ రాణి
మధుర మధురమీ చల్లని రేయి
మరువ తగనిది ఈ హాయి
మధుర మధురమీ చల్లని రేయి

చరణం2:

విరికన్నెలు అర విరిసిన కన్నుల
దరహసించునో దేవి
విరికన్నెలు అర విరిసిన కన్నుల
దరహసించునో దేవి
మన అనురాగము చూసి ఈ ఈ ఈ ఈ ఈ ఈ
మన అనురాగము చూసి
చిరునవ్వులు చిలుకు స్వామి
మధుర మధురమీ చల్లని రేయి
మరువ తగనిది ఈ హాయి
మధుర మధురమీ చల్లని రేయి

చరణం3:

మీ వరమున నా జీవనమే పావనమాయెను స్వామి
మీ వరమున నా జీవనమే పావనమాయెను స్వామి
ఈ వనసీమయే నీ చెలిమి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ వనసీమయే నీ చెలిమి
జీవనమాధురి చవిచూపినది
మధుర మధురమీ చల్లని రేయి
మరువ తగనిది ఈ హాయి
మధుర మధురమీ చల్లని రేయి

||

14-Nov-2009

సుస్వాగతం

గాత్రం: మనో,జయచంద్రన్
సాహిత్యం: షణ్ముఖశర్మ



పల్లవి:

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

చరణం1:

తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
భోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది
ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
హ్యాపి హ్యాపి ఆ ఆ ఆ

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

చరణం2:

మ్యూజిక్క మేజిక్కా మజా కాదు ఛాలెంజి
బాపూజి ఆవోజి భలే గులామాలీజి

నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటె ఏమైనా ఎదురేలేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తె ఒప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా
లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
హ్యాపి హ్యాపి ఆ ఆ ఆ

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-Nov-2009

భక్త కన్నప్ప

గాత్రం: రామకృష్ణ,సుశీల
సాహిత్యం: ఆరుద్ర




పల్లవి:

ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
హొయ్ చిన్నదాని మనవు సెయ్యి సందమామ
ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
హొయ్ చిన్నదాని మనవు సెయ్యి సందమామ
అరె సిన్నోడా ఆఆఆఆఆ
ఆకు సాటున పిందె వుంది
సెట్టు సాటున సిన్నాదుంది
ఓ ఓ ఓ ఆకు సాటున పిందె వుంది
సెట్టు సాటున సిన్నాదుంది
సక్కని చుక్కని టక్కున ఎతికి
దక్కించుకోరా దక్కించుకోరా

ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
హొయ్ చిన్నదాని మనవు సెయ్యి సందమామ
అరె సిన్నమ్మి
మబ్బు ఎనక మెరుపుతీగ
దుబ్బు ఎనక మల్లెతీగ
ఓ ఓ ఓ మబ్బు ఎనక మెరుపుతీగ
దుబ్బు ఎనక మల్లెతీగ
ఏడనున్న దాగోలేవే
మల్లెమొగ్గా అబ్బోసిగ్గా
మల్లెమొగ్గా అబ్బోసిగ్గా

ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
హొయ్ చిన్నదాని మనవు సెయ్యి సందమామ

చరణం1:

అహ అత్తారింటికి దారేదమ్మ సందామామ
అరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మ సందామామ
ఆమడదోరం ఉన్నాగాని ఎళ్ళాలమ్మా
ఆమడదోరం ఉన్నాగాని ఎళ్ళాలమ్మా

ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
చిన్నదాని మనవుసెయ్యి సందమామ

చరణం2:

హొయ్ హొయ్ చీకటింట్లో సిక్కుతీసా
ఎలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పులోని మొగలిపువ్వు గుప్పుమందే ఒప్పులకుప్పా
హొయ్ గుప్పుమందే ఒప్పులకుప్పా

ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
హొయ్ చిన్నదాని మనవుసెయ్యి సందమామ

చరణం3:

చందమామ రేకలెన్ని
కలువపువ్వు రేకులెన్ని
దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా
నీకు నేనే నాకు నీవే
నీకు నేనే నాకు నీవే

ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
హొయ్ చిన్నదాని మనవుసెయ్యి సందమామ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Nov-2009

ఆర్య

గాత్రం: రంజిత్,మాలతి
సాహిత్యం: వేటూరి




పల్లవి:

హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారునా ఫ్రెంఛి పిడేలు ఆగున హే
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం

చరణం1:

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
హే గాజువాక చేరినాక
మోజు పడ్డ కుర్రమూక
నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటరా
రాజనిమ్మ పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం

ఏ కొంచం బీటు మార్చండ్రా బాబొ

చరణం2:

హే అల్లువారి పిల్లగాడ
అల్లుకోర సందెకాడ
సొంత మేనమామ వాటమందుకో
రేణిగుంట రాణివంట
బిట్రగుంట దేనికంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో
హే ఒంటిలోన శక్తి పుట్టెరో ఎన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అంబోరబాజిపేటరో

అ అంటే
అ అంటే ఏ
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారునా ఫ్రెంఛి పిడేలు ఆగున హే
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

ఈల వేసి లాగుతారు ఆంధ్రాజనం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Nov-2009

తూర్పు వెళ్ళే రైలు

తారాగణం : మోహన్,జ్యోతి
గాత్రం: బాలు
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
దర్శకత్వం : బాపు
నిర్మాత: పి.పేర్రాజు
నిర్మాణ సంస్థ: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 1979



పల్లవి:

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

చరణం1:

తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మ
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మ్
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

చరణం2:

నేరేడు కళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో తోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నెవన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

10-Nov-2009

కొండవీటి సింహం

గాత్రం: బాలు , సుశీల



పల్లవి:

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ

చరణం1:

ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
సమశృతిలో జత కలిసి
ప్రియలయలో అదమరచి
అనురాగాలు పలికించువేళ

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ

చరణం2:

అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే
శుభయోగాలు తిలకించువేళ

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

09-Nov-2009

మురారి

తారాగణం: మహేష్‌బాబు,సోనాలిబింద్రే,లక్ష్మి
గాత్రం: ఎస్.పి.చరణ్,హరిణి
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: ఎన్.దేవీప్రసాద్,రామలింగేశ్వరరావు
సంస్థ: రామ్ ప్రసాద్ ఆర్ట్స్
విడుదల: 2001




పల్లవి:

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఒహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

చరణం1:

కులుకులో ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది

ఒహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

చరణం2:

ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
ఏ తోటలో తనుందోనని ఎటు పంపను నా మనసుని
ఏనాడు ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నాకోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మ
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Nov-2009

సిరిసంపదలు

తారాగణం : నాగేశ్వరరావు,సావిత్రి
గాత్రం: ఘంటసాల
సంగీతం : మాస్టర్ వేణు
దర్శకత్వం : పి.పుల్లయ్య
సంస్థ: పద్మశ్రీ పిక్చర్స్
విడుదల: 1962



పల్లవి:

ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ
మారినదేమి చెలి,ఆ కారణమేమి చెలి ఆ ఉం
వింత కాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి,నిండు పున్నమి జాబిలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చరణం1:

మనసున తొనికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు అహ ఒహొ అహా
మనసున తొనికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో కదిలే
మాట తెలియునని మానేవు ఉం
వెండి వెన్నెల జాబిలి,నిండు పున్నమి జాబిలి

చరణం2:

కన్నులు తెలిపే కధలనెందుకు
రెప్పలార్చి ఏమర్చేవు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్నులు తెలిపే కధలనెందుకు
రెప్పలార్చి ఏమర్చేవు
చెంపల పూసే కెంపులు నాతో
నిజము తెలుపునని జడిసేవు
ఒహొహొ
వెండి వెన్నెల జాబిలి,నిండు పున్నమి జాబిలి

చరణం3:

అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు
నీ మవ్వులకర్ధము చూపేను
అహ
వెండి వెన్నెల జాబిలి,నిండు పున్నమి జాబిలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

07-Nov-2009

వెంగమాంబ

గాత్రం: ఎన్.సాహితి
సాహిత్యం: అన్నమయ్య




పల్లవి:

రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు

చరణం1:

అరయ పుత్రకామేష్టియందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
అరయ పుత్రకామేష్టియందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు

చరణం2:

వేద వేదాంతములయందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్ధము
వేద వేదాంతములయందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్ధము
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన
ఆదికి అనాదియైన అర్చావతారము

రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Nov-2009

పెళ్ళిసందడి

గాత్రం: బాలు,చిత్ర



పల్లవి:

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా

చరణం1:

తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం
చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం
కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి
పరువానికి పరువైన యువతి
వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి
మనసిచ్చిన మరుమల్లికి మరిది
దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ ఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా

చరణం2:

చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం
పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం
పెదవిచాటు కవిత మన ప్రేమాయణం
వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడి ఆరిన బిడియాల తరుణి
మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి
మగసిరిగల దొరతనమెవరిదనీ
బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ ఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Nov-2009

చక్రం

గాత్రం: కౌసల్య
సాహిత్యం: సిరివెన్నెల




పల్లవి:

కొంచం కారంగా కొంచం గారంగా
కొంచం కష్థంగా కొంచం ఇష్థంగా
అందించని అదిరే అధరాంజలి
బందించని కాలాన్ని కౌగిలి
సుడిగాలిగ మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నీరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి
కొంచం కారంగా కొంచం గారంగా
కొంచం కష్థంగా కొంచం ఇష్థంగా

చరణం1:

తలుపేసుకుంటె నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నరనరమునా
ఇక నా వశము కాకుంది యమయాతన
లేని పోని నిందలు గాని
హాయిగానే ఉంది హాని
ఉన్నమాట నీతో చేప్పని

కొంచం కారంగా కొంచం గారంగా
కొంచం కష్థంగా కొంచం ఇష్థంగా

చరణం2:

అమ్మాయినంటూ నాకే గుర్తుచేస్తూ
లాగావు గుట్టు గుండెల్లొకే చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసుకంది మన్మదలేఖ
కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయె వేడిగా

కొంచం కారంగా కొంచం గారంగా
కొంచం కష్థంగా కొంచం ఇష్థంగా
అందించని అదిరే అధరాంజలి
బందించని కాలాన్ని కౌగిలి
సుడిగాలిగ మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నీరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి
కొంచం కారంగా కొంచం గారంగా
కొంచం కష్థంగా కొంచం ఇష్థంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

04-Nov-2009

సాక్షి

తారాగణం: కృష్ణ,విజయనిర్మల
గాత్రం: పి.సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: బాపు
నిర్మాత: శేషగిరిరావు
సంస్థ: నందనా ఫిలిమ్స్
విడుదల: 1967





పల్లవి:

అమ్మ కడుపు చల్లగా
అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా
అమ్మ కడుపు చల్లగా
అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా

చరణం1:

నా మెడలో తాళిబొట్టు కట్టరా
నా నుదట నిలువు బొట్టు పెట్టరా
నా మెడలో తాళిబొట్టు కట్టరా
నా నుదట నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు సెరగదురా
నీ సిగపూవుల రేకైనా వాడదురా వాడదురా
బతకరా బతకరా పచ్చగా

చరణం2:

చల్లని అయిరేణికి మొక్కరా
సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లని అయిరేణికి మొక్కరా
సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లవేళ కంటనీరు వద్దురా
నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా
బతకరా బతకరా పచ్చగా

చరణం3:

నా కొంగు నీ చెంగు ముడివేయరా
నా చెయ్యి నీ చెయ్యి కలపరా
నా కొంగు నీ చెంగు ముడివేయరా
నా చెయ్యి నీ చెయ్యి కలపరా
ఏడడుగులు నాతో నడవరా
ఆ యముడైనా మనమద్దికి రాడురా రాడురా
బతకరా బతకరా పచ్చగా

అమ్మ కడుపు చల్లగా
అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-Nov-2009

సంతానం

తారాగణం: నాగేశ్వరరావు,అమరనాథ్,సావిత్రి,ఎస్వీ రంగారావు,శ్రీరంజని సీనియర్,రేలంగి
గాత్రం: లతా మంగేష్కర్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాత & దర్శకత్వం: సి.వి.రంగనాథ దాసు
సంస్థ: సాధనా ప్రొడక్షన్స్
విడుదల: 1955




పల్లవి:

నిదురపో నిదురపో నిదురపో
నిదురపో నిదురపో నిదురపో
నిద్దురపోరా తమ్ముడా
నిద్దురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా
నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగానా కలత నిదురే మేలురా
నిదురపోరా తమ్ముడా

చరణం1:

కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా

చరణం2:

జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితిఆయే
నీడజూపి నిలవుమనకు నిదురయేరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా

||

02-Nov-2009

శివరంజని

తారాగణం: హరిప్రసాద్,జయసుధ
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమేష్ నాయుడు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంస్థ: తారకప్రభు ఫిల్మ్స్
విడుదల: 1978




పల్లవి:

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు

చరణం1:

నీ వయసే వసంత ఋతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవిగా
నీ నగవే సిగ మల్లికగా
చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయకలో

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు

చరణం2:

నీ ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రస జగమేలే సరస మధుర సంగమ గీతికలో

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి
నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు

~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-Nov-2009

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

ఆంధ్రరాష్ట్ర అవతణ దినోత్సవం సందర్భంగా టంగుటూరి సూర్యకుమారిగారి గొంతులో మొదటిసారి వినిపించిన మా తెలుగు తల్లికి మల్లె పూ దండ పాట తెలుగు భాషాభిమానులందరికోసం



గాత్రం: టంగుటూరి సూర్యకుమారి
రచన: శంకరంబాడి సుందరాచార్య

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ
మా కన్న తల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో శిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

గలగలా గోదారి కదలి పోతుంటేను
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ పాటలే పాడుతాం,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి


||