31-Oct-2009

విచిత్ర వివాహం

గాత్రం: భానుమతి




పల్లవి:

నాగరికత పేరుతో నవ్వుల పాలైయేరు
దోర వయసు జోరులో దారి తప్పిపోయేరు హుహు
నా మాటలో నిజం వింటారా మీరు ?

అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు

చరణం1:

దమ్మారో దం అంటు పాడేరులే
ఆడమగ కలిసి ఆడేరులే
దమ్మారో దం అంటు పాడేరులే
ఆడమగ కలిసి ఆడేరులే
ఇదే గానమంటు ఇదే నాట్యమంటు
పెడదారిలో మీరు పడిపోతున్నారు

అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు

చరణం2:

ప్రతివారు లవ్ పేరు చెబుతారులే
పై మోజుకే లొంగిపోతారులే
ప్రతివారు లవ్ పేరు చెబుతారులే
పై మోజుకే లొంగిపోతారులే
ఇదే ఫ్యాషనంటు ఇదే కల్చరంటు
పెడదారిలో మీరు పడిపోతున్నారు

అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు

చరణం3:

ప్రతి జంట ఈలాగె వర్ధిల్లాలి
ప్రతి ఈలాగె విలసిల్లాలి
ప్రతి జంట ఈలాగె వర్ధిల్లాలి
ప్రతి ఈలాగె విలసిల్లాలి
ఈ చిరునవ్వు చిందే ఈ పసిపాపలుండే
సంసారమే కదా సౌభాగ్యసీమ

అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

30-Oct-2009

చంటి

గాత్రం: బాలు




పల్లవి:

అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమసుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణి ఈ రాణి
అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

చరణం1:

ఆ దేవుడు ఆ దేవితొ అలక పూనెనేమో
ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో
మోహనాల సోయగాల మేనకో
మరి దేవలోక పారిజాత మాలికో
రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి
నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి
విరబూసే పూబోణి

అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమసుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణి ఈ రాణి
అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

చరణం2:

ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో
ఆ నగవులు వేకువలకు మేలుకొలుపులేమో
పాలకడలి మీద తేలు చంద్రికో
గగనాన వేల కాంతులీను తారకో
వెన్నెల్లా వస్తాడు ఓనాడు
రాజంటి గొప్పింటి మొగుడు
ఊరంత సందళ్ళు ఆనాడు
వాడంతా వియ్యాలవారు
పిపిపీపీ డుండుండుం

అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమసుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణి ఈ రాణి
అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

||

29-Oct-2009

గోపి గోపిక గోదావరి

గాత్రం: వేణు,మధుమిత
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి




పల్లవి:

హొ లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటూ చందరవంకే నీ పేరంటూ
ముద్దులహారం మెళ్ళో వేయనా అబ్బబ్బా
బందరులడ్డు నువ్వేనంటూ బంగరు జింకై దూకావంటూ
ఇందర లోకం రాసిచ్చేయనా అబ్బబ్బా
నువ్వే ముద్దన్నాక ఒద్దొద్దంటానా
అట్టా హద్దే దాటి రావొద్దంటానా
ఆడ ఈడ నన్ను తాకొద్దంటానా
కొంటె తాపాలేవో పెంచొద్దంటానా
అమ్మో అంతోద్దంటున్నా నిండ ముంచొద్దంటున్నా
ఏదో సరదాకన్నానే లలన
రాణి నువ్వేలెమన్నా రాజీకొస్తానంటున్న
పేచీ పెడితే ఎట్టాగే సుగుణ
చాల్లే చాల్లేగాని పొతేపోని సద్దేలేని బాతాఖాని
ఐసా పైసా కాని అంటున్నా

హొ లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటూ చందరవంకే నీ పేరంటూ
ముద్దులహారం మెళ్ళో వేయనా అబ్బబ్బా
బందరులడ్డు నువ్వేనంటూ బంగరు జింకై దూకావంటూ
ఇందర లోకం రాసిచ్చేయనా అబ్బబ్బా

చరణం1:

పైటే జారె మగువ ఏదో కోరే తెగువ
ఏకై వచ్చి మేకై పోయవా
చెంగే లాగే చొరవ చెంతేవున్నా కరువా
చుట్టు పక్కల చూస్తా వుంటావా
ముహుర్తాలన్ని ముడి పడని
నీ నోరే పండే తాంబూలన్ని నేనవనా
వారం వర్జం చూసుకొని
నువ్వొచ్చేలోగ ఉసురంటూ దిగులవనా
తాతై తతత్తై చిందులన్ని ఆపేసెయ్ ఈసారిట్టా పోనిలేవమ్మ

హొ లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటూ చందరవంకే నీ పేరంటూ
ముద్దులహారం మెళ్ళో వేయనా అబ్బబ్బా
బందరులడ్డు నువ్వేనంటూ బంగరు జింకై దూకావంటూ
ఇందర లోకం రాసిచ్చేయనా అబ్బబ్బా

చరణం2:

అయ్యో పాపం అనవా
నా మాటేదీ వినవా
అవి ఇవి ఇచ్చేయ్ గురువా
సింగారాల బరువ సీతాకాలం చలవ
పై పై కొచ్చి వేడెక్కిస్తావా
రా రమ్మంటే ఏదో పనిగా ఇందాక వచ్చా
తీరా వస్తే పిల్లి గొడవ
రై రై అంటూ రేగే తేనీగ
నీ కంట్లో కచ్చ ఆర్చే దాకా ఓర్చగలవా
ఆశై అత్యాశై అల్లల్లాడే అచూకై
నీవే కొంచెం సాయం చేయవా

హొ లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
సుందరివంటే నువ్వేనంటూ చందరవంకే నీ పేరంటూ
ముద్దులహారం మెళ్ళో వేయనా అబ్బబ్బా
బందరులడ్డు నువ్వేనంటూ బంగరు జింకై దూకావంటూ
ఇందర లోకం రాసిచ్చేయనా అబ్బబ్బా
నువ్వే ముద్దన్నాక ఒద్దొద్దంటానా
అట్టా హద్దే దాటి రావొద్దంటానా
ఆడ ఈడ నన్ను తాకొద్దంటానా
కొంటె తాపాలేవో పెంచొద్దంటానా
హొ లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి
హొ లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Oct-2009

దేవుళ్ళు

గాత్రం: రాజేష్,చిత్ర
సాహిత్యం: జొన్నవిత్తుల




పల్లవి:

సాగర ఘోషల శృతిలో
హిమ జలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం
సునోరే భాయీ సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్‌సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
ఓ ఓ ఓ ఓ సత్యాహింసలు శృతిలయిలైన మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం
ప్రపంచ శాంతి సంకేతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

చరణం1:

సూర్యోదయం భూపాళం
చంద్రోదయం హిందోళం
ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్‌ గిటారుపై హంసద్వని చెలరేగగా
జర్మన్‌ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనని
కర్ణాటిక్‌ భావాలు కమ్మనైనవి
సగమ గమగ మగని సానిద సానిదసా
ఇంద్ర ధనుసు రంగులైన ఎడారిలో వానలైన
ఐ విల్‌ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్‌ ఎస్‌

చరణం2:

దేశ దేశముల సంస్కృతులే
రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే
పసిఫిక్‌ కన్నలోతు ఎవరెస్టు కన్న ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూర్పు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వరాలతో ఈయగా
అణు యుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే
ప్రతిరోజు ఒక పండుగలే
ఇల మానవులందరు బంధువులే
సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట
నయాగారా హోరులో ఆలపించగా
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు
పంచమాల వసంతాలు తారా స్ధాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాద దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయగానము

శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్‌సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

||

27-Oct-2009

సంతానం

గాత్రం: ఘంటసాల




పల్లవి:

చల్లని వెన్నెలలో
చల్లని వెన్నెలలో ఓ ఓ ఓ ఓ
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో

చరణం1:

తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన
గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో ఓ ఓ ఓ
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో

చరణం2:

కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలం నీ కమ్మని రూపము
కలకాలం నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో ఓ ఓ ఓ ఓ
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో

||

26-Oct-2009

ఆర్య

గాత్రం: టిప్పు
సాహిత్యం: సురేంద్రకృష్ణ




పల్లవి:

హే తకదిమితోం తకదిమితోం తరికిట తరికిట తకదిమితోం
చిందులు వేసే వయసుకి తకదిమితోం తోం
తకదిమితోం తకదిమితోం సరిగమ పదమని తకదిమితోం
ఉరకలు వేసే మనసుకు తకదిమితోం తోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదే చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమితోం
తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమితోం
కృషి వుంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగే జోష్ కే లియే జీయేంగె ప్యార్ కే లియే
హే తకదిమితోం తకదిమితోం తరికిట తరికిట తకదిమితోం
చిందులు వేసే వయసుకి తకదిమితోం తోం
తకదిమితోం తకదిమితోం సరిగమ పదమని తకదిమితోం
ఉరకలు వేసే మనసుకు తకదిమితోం

చరణం1:

చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమితోం
ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఉరకాలిరా
ఆ జోరుకి తకదిమితోం
పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం
గురి చూసాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కే లియే

హే తకదిమితోం తకదిమితోం తరికిట తరికిట తకదిమితోం
చిందులు వేసే వయసుకి తకదిమితోం

చరణం2:

నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమితోం
నీ ప్రేమతో ఆ శత్రువునే ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమితోం
ఒకటవుదాం ఒకటవుదాం ప్రేమను పంచగ ఒకటవుదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కే లియే

హే తకదిమితోం తకదిమితోం తరికిట తరికిట తకదిమితోం
చిందులు వేసే వయసుకి తకదిమితోం...తకదిమితోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదే చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమితోం
కృషి వుంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగే జోష్ కే లియే
జీయేంగె ప్యార్ కే లియే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25-Oct-2009

సిరిసంపదలు

గాత్రం: పి.సుశీల, ఎస్.జానకి, జిక్కి



పల్లవి:

వేణుగానమ్ము వినిపించేనే
చిన్నికృష్ణయ్య కనిపించడే
వేణుగానమ్ము వినిపించేనే
చిన్నికృష్ణయ్య కనిపించడే
వేణుగానమ్ము వినిపించేనే

చరణం1:

దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే వట్టి కథలేనటే
ఏడి కనపడితే నిలవేసి అడగాలి వానినే

వేణుగానమ్ము వినిపించేనే
చిన్నికృష్ణయ్య కనిపించడే
వేణుగానమ్ము వినిపించేనే

చరణం2:

మన్ను తిన్నావని యశోదమ్మ ఆడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ ఆడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏడి కనపడితే కనులార చూడాలి వానినే

వేణుగానమ్ము వినిపించేనే
చిన్నికృష్ణయ్య కనిపించడే
వేణుగానమ్ము వినిపించేనే

చరణం3:

దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు ఘల్ఘల్లన ఒళ్ళు ఝల్ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమడెనే

వేణుగానమ్ము వినిపించేనే
చిన్నికృష్ణయ్య కనిపించడే
వేణుగానమ్ము వినిపించేనే

||

24-Oct-2009

వెంగమాంబ

గాత్రం: చిత్ర
సాహిత్యం: వేదవ్యాస




పల్లవి:

మామూలు మనిషివా మాధవుడవు కావా
నన్నెరుగని వాడివా నా స్వామివి కావా ఆ ఆ ఆ
మామూలు మనిషివా

చరణం1:

అపుడు ఆదిలక్ష్మినడిగి కొండనుండమంటివి
ఇపుడు నిరంకుశుడవై ఇటుల గెంటుచుంటివి
నారాయణా ఆ ఆ ఆ ఆ ఆ
నారాయణా నను వెలివేయ న్యాయమా
దామోదరా దాసిని దండించుట ధర్మమా

నన్నెరుగని వాడివా నా స్వామివి కావా ఆ ఆ ఆ
మామూలు మనిషివా మాధవుడవు కావా

చరణం2:

కఠినుడవై ప్రహ్లాదుని కటకటలను కంటివి
చెరలో ఆ రామదాసు చిత్రహింస చూసితివి
పురుషోత్తమా ఆ ఆ ఆ ఆ ఆ
పురుషోత్తమా నన్నెంత పరీక్షించినా
పరంధామా నీ సన్నిధి విడిపోదునా

నిన్నెరుగని దాననా నీ దానను కానా
మాధవా కేశవా మహాదేవదేవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Oct-2009

చూపులు కలిసిన శుభవేళ

గాత్రం: బాలు,చిత్ర



పల్లవి:

ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళు గింజుకున్నా తొడకొట్టి పడకొట్టి జేకొట్టవే
ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళు గింజుకున్నా తొడకొట్టి పడకొట్టి జేకొట్టవే
ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే

చరణం1:

నీ చూపే నీలాంబరి
నీ రూపే కాదంబరి
నీవే నా రాగలహరి
నీ చూపే నీలాంబరి
నీ రూపే కాదంబరి
నీవే నా రాగలహరి
రాగమైనా తాళమైనా
లయతోనే రాణిస్తుంది
నింగి కొసలు నేల మనిషి మీటగా

ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళు గింజుకున్నా తొడకొట్టి పడకొట్టి జేకొట్టవే
గిట్టనోళ్ళు గింజుకున్నా తొడకొట్టి పడకొట్టి జేకొట్టవే
ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే

చరణం2:

ముసలోళ్ళు ప్రేమించరు
ప్రేమిస్తే హర్షించరు
ప్రేమ మహిమ అసలు తెలుసుకోరు
ముసలోళ్ళు ప్రేమించరు
ప్రేమిస్తే హర్షించరు
ప్రేమ మహిమ అసలు తెలుసుకోరు
శిశువైనా పశువైనా ప్రేమిస్తూ జీవిస్తుంది
నొసలు పెదవి మొదటి రుచులు కదపగా

ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళు గింజుకున్నా తొడకొట్టి పడకొట్టి జేకొట్టవే
ఆ గిట్టనోళ్ళు గింజుకున్నా తొడకొట్టి పడకొట్టి జేకొట్టవే
ప్రేమ గర్జించవే నీ ధీమా వర్షించవే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Oct-2009

అనుబంధం

గాత్రం: బాలు,సుశీల



పల్లవి:

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడు దగ్గరైన ప్రాణాలు
జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
సందెపొద్దువేళాయే చందమామ రావే
చీకటైన పొదరింట దీపమెట్టిపోవే
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
నాకే సోకే కొంటెచూపు కోణాలు

చరణం1:

పువ్వుల వానల్లే నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే
వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే
వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే
సూరీడేమో కొండలు దాటే
నా ఈడేమో కొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో
ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూళిపోయే నడుమివ్వు
నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు
జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ

చరణం2:

కొండకోనల్లో ఎండవానల్లో
మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే
వెర్రిచూపులతో రాసిన జాబులతో
అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే
అల్లరి కళ్ళు ఆరాతీసే
దూరాలన్ని చేరువచేసే
ఒడిచేరి పరువాలు పంచుకో
బిడియాల గడపింట దాచుకో
నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు
నీకు నాకు పెళ్ళిచేసే చైత్రాలు

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
సందెపొద్దువేళాయే చందమామ రావే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Oct-2009

ఆశ ఆశ ఆశ

తారాగణం: అజిత్,సువలక్ష్మి,ప్రకాష్‌రాజ్
గాత్రం:చిత్ర
సంగీతం:దేవా
విడుదల:1995



పల్లవి:

మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది,ఇలనేలుతున్నది
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా

చరణం1:

చిక్ చిక్ చిక్ చిక్ చిటి పొటి పిచ్చుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్ని ఆడుకుందాం రమ్మన్నాయి తలలూపి
కొమ్మ మీద కోయిలమ్మ నన్ను చూసి పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా
మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపువెచ్చగా చేరంగా

చరణం2:

తుల్ తుల్ తుల్ తుల్ తుల్లే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
ఝల్ ఝల్ ఝల్ ఝాల్ పారే ఏరా ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో ఉరుకుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా
మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి

మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది,ఇల నేలుతున్నది

||

20-Oct-2009

లిటిల్ సోల్జర్స్

గాత్రం: బాలు



పల్లవి:

సరేలే ఊరుకో పరేషానెందుకు
సరేలే ఊరుకో పరేషానెందుకు
చలేసే ఊరిలో జనాలే ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్తా మారిపొతే
మూతిముడుచుకునుంటారా
ఆటలోనూ పాటలోనూ మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరు
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

చరణం1:

పిల్లిపిల్లదెపుడూ ఒకే మాటకదా
మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్
కోడి పెట్టదెపుడూ ఒకే కూతకదా
కొకో కొక్కొరొకో కొకో కొక్కొరొకో
కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెప్పుడు మారనీయకే ఏమైనా
కష్టమొస్తే కేరుచేయక నవ్వుతో తరివేయవమ్మ

మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరు
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

చరణం2:

గూటిబిళ్ళ ఆడదాం సిక్సరుకొడదాం
క్రికెట్ కాదుగాని ఫన్నీగానే ఉంది
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం
బఫెల్లోసుకది బాత్రూంకాదా మరి
రాణిగారి పోజులో నువు కూరుసోమ్మ ఠీవిగా
గేదెగారి వీపుమీద షైరు కెళదాం స్టైలుగా
జురాసిక్ పార్కుకన్నా బెస్టు ప్లేసీ పల్లెటూరే బుల్లెమ్మ
బోలెడన్ని వింతలున్నాయ్ బోరులేక చూడవమ్మ

మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరు
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరు
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Oct-2009

మగమహరాజు

సాహిత్యం:వేటూరి



పల్లవి:

నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

చరణం1:

ఆశయాలు గుడిగా సాహసాలు సిరిగా
సాగాలి చైత్రరథం వడివడిగా
మలుపులెన్ని వున్నా గెలుపు నీదిరన్నా
సాధించు మనోరధం మనిషిగా
నరుడివై హరుడువై నారాయణుడే నీవై
నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి
నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి

నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప

చరణం2:

కాళరాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే
నీ మండిన గుండెల నిటూర్పులలో
చల్లగాలి విసిరే తల్లి చేయి తగిలే
నీకొసం నిండిన ఓదార్పులతో
విజమో విలయమో విధి విలాసమేదైనా
నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి
నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి

నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప

చరణం3:

దిక్కులన్ని కలిసే ఆ ఆ ఆ
దైవమొకటి వెలసే ఆ ఆ ఆ
నీ రక్తం అభిషేకం చేస్తుంటే
మతములన్ని కరిగే మమత దివ్వె వెలిగే
నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే
హీరుడివై ధీరుడువై విక్రమార్కుడు నీవై
నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవశక్తి
నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవశక్తి


~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18-Oct-2009

గృహలక్ష్మి

గాత్రం: ఘంటసాల,భానుమతి



ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వినవే ఓ ప్రియురాల వివరాలన్ని ఈవేళ
వినవే ఓ ప్రియురాల వివరాలన్ని ఈవేళ
మగువలు ఏమిచేయాలి
ఎమి చెయ్యాలే?
ఎమి చెయ్యాలా?
మగనికి సేవ చెయ్యాలి
మగువలు ఏమిచేయాలి మగనికి సేవ చెయ్యాలి
వినవే ఓ ప్రియురాల వివరాలన్ని ఈవేళ
వినవే ఓ ప్రియురాల

కార్యేషు దాసి , కరణేషు మంత్రి
భోజ్యేషు మాత , శయనేషు రంభ
వినవే ఓ ప్రియురాల వివరాలన్ని ఈవేళ
వినవే ఓ ప్రియురాల

ఏవిటో ఆ వివరాలు?
తెల్లవారగనే లేవాలి
నన్ను మెల్లగ నిద్దుర లేపాలి
లేత నవ్వులే రువ్వాలి
నా చేతికి కాఫీ ఇవ్వాలి
రెండుజాములు దాటకముందే నిండైన విందును చేయాలి
అబ్బో ఊహాగానం చేస్తున్నారా తరవాత

నీటుగ ముస్తాబు కావాలి
పనీటి జల్లులా రావాలి
మల్లెల పానుపు వేయాలి
చలచల్లగ గంధం పూయాలి
అత్తమామ సేవలే కాస్త మాని
హుహుహు మాని?
ఈ చందమామ సేవలే చెయ్యాలి
హు హూ
వినవే ఓ ప్రియురాల వివరాలన్ని ఈవేళ
వినవే ఓ ప్రియురాల

చాలా పెద్ద లిస్టు కష్టమండి
కష్టమంటే ఎలా?
ఆనాడు సీతమ్మ ఏమి చేసినది?
అడవిలో విభునితో విడిది చేసినది
అలనాటి దమయంతి ఏమి చేసినది ఈ ఈ ఈ
నలునికై తనువెల్ల ముడుపు చేసినది
సతి చంద్రమతి నాడు ఏమి చేసినది?
పతికై బ్రతుకంతా ధారబోసినది ఆ ఆ ఆ ఆ
ఇంకా?
లక్షమాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడు ఇంతేలే
లక్షమాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడు ఇంతేలే

వినవే ఓ ప్రియురాల వివరాలన్ని ఈవేళ
వినవే ఓ ప్రియురాల

||

17-Oct-2009

అమ్మలేని పుట్టిల్లు

తారాగణం: శశికుమార్,ఊహ,చంద్రమోహన్,సుధ
గాత్రం: మనో,చిత్ర
సాహిత్యం: సాహితి
సంగీతం: చంద్రమోహన్
దర్శకత్వం: సాయిప్రకాష్
నిర్మాత: కె.మహేంద్ర
సంస్థ: ఎ.ఎ.ఆర్ట్స్
విడుదల: 1995




పల్లవి:

సాయిబాబా సాయిబాబా
మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే
ఆ గుడి దీప కాంతులే మా ఒడి చేరు పిల్లలే
మా ముంగిట తోరణమల్లే నిత్యం వెలుగును సంతోషాలే
మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే

చరణం1:

మా పందిరి మల్లెతీగలే మాకే పొదరిల్లే అల్లెలే
ఆ తీగకు పిల్లలమంటూ మా పిల్లల కిలకిల వింటూ
ఆ తెల్లని మల్లెల పువ్వులు నవ్వులు రువ్వే
ఈ పచ్చని పంటచేలల్లే చలచల్లని పైరగాలల్లే
కాపురమే కలలేచెందే మా కమ్మని కలలే పండే
మా కన్నుల వన్నెల చిన్నెల వెన్నెల కాసే
అమ్మే ఉంటే లోటేమంట
నాన్నే ఉంటే ఆటాపాటా
మా పిల్లల అల్లరి చూసి మేము పిల్లలమయ్యేమంట

మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే

చరణం2:

ఈనాడు ఉన్న ప్రేమలే ఏ ఏ ఏ ఏ
ఏనాడు మారిపోవులే ఏ ఏ ఏ ఏ
హృదయాల ఆనందాలు విడిపోని అనుబంధాలు
మదిలోని మమకారాలు జీవించెలే
ఈ కన్ను కలతచెందగా ఆ ఆ ఆ
ఆ కన్ను వగచినట్టుగా ఆ ఆ ఆ
ఏ ఒక్కరి కష్టానైనా ఒక్కటిగా ఏనాడైనా
అందరము కలసిమెలసి పంచుకోమా
అమ్మంటేనే అమ్మొక్కటే
మురిసేమమ్మ నీ ముద్దుకే
ఈ కళ్ళే ఉన్నన్నాళ్ళు రానీదమ్మ ఏ కన్నీళ్ళు

మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే
ఆ గుడి దీప కాంతులే మా ఒడి చేరు పిల్లలే
మా ముంగిట తోరణమల్లే నిత్యం వెలుగును సంతోషాలే
మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16-Oct-2009

లక్ష్మీనివాసం

తారాగణం:ఎస్వి.రంగారావు,కృష్ణ,అంజలీదేవి,వాణిశ్రీ
గాత్రం : ఘంటసాల
సాహిత్యం :ఆరుద్ర
సంగీతం :కె.వి.మహదేవన్
దర్శకత్వం: వి.మధుసూదనరావు
సంస్థ :వీనస్ పద్మినీ కంబైన్స్
విడుదల:1967



పల్లవి:

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

చరణం1:

మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ధనమేరా అన్నిటికీ మూలం

చరణం2:

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే
ధనమేరా అన్నిటికీ మూలం

చరణం3:

కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

||

15-Oct-2009

తాండ్ర పాపారాయుడు

గాత్రం:యేసుదాసు,సుశీల
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,జయసుధ,సుమలత
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
దర్శకత్వం :దాసరి నారాయణరావు
సంస్థ: గోపికృష్ణ మూవీస్
విడుదల: 1986




పల్లవి:

అభినందన మందారమాల
అభినందన మందారమాల
అభినందన మందారమాల
అధినాయక స్వాగతవేళ
అభినందన మందారమాల
స్రీజాతికి ఏనాటికి స్మరనీయ మహనీయ వీరాగ్రనికి
అభినందన మందారమాల
అధినాయక స్వాగతవేళ
అభినందన మందారమాల

చరణం1:

వేయి వేణువులు నిన్నే పిలివగ నీ పిలిపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలివగ నీ పిలిపు నావైపు పయనించెనా
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ
నీచూపు నారూపు వరియించెనా
నీచూపు నారూపు వరియించెనా
నాగుండెపై నీవుండగా దివి తానే భువిపైనె దిగివచ్చెనా

అభినందన మందారమాల
అలివేణి స్వాగతవేళ
అభినందన మందారమాల
సౌందర్యము సౌశీల్యము నిలువెల్ల నెలకొన్న కళభాసినికి
అభినందన మందారమాల

చరణం2:

వెండికొండపై వెలిసిన దేవర నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండికొండపై వెలిసిన దేవర నెలవంక మెరిసింది నీ కరుణలో
సగము మేనిలో ఒదిగిన దేవత
సగము మేనిలో ఒదిగిన దేవత
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
ప్రియభావమే లయరూపమై అలలెత్తి ఆడింది అణువణులో

అభినందన మందారమాల
ఉభయాత్మల సంగమవేళ
అభినందన మందారమాల


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Oct-2009

వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్

తారాగణం: చక్రవర్తి,వినీత్,అవని
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: రాంగోపాల్‌వర్మ
సంస్థ: వర్మ కార్పోరేషన్ లిమిటెడ్
విడుదల: 1997




పల్లవి:

ఆ ఆ ఆ ఆ నా జత నీవే ప్రియ
ఎక్కడికి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకుపోతావేం అలా
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడవున్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి

ఆ ఆ ఆ ఆ నా జత నీవే ప్రియ
ఎక్కడికి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకుపోతావేం అలా
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడవున్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి

ఆ ఆ ఆ ఆ నా జత నీవే ప్రియ

చరణం1:

నే వెతికే కలల చెలి ఇక్కడనే నా మజిలి
జాడను చూపినదే మరి నువు పాడిన తీయని జావళి
వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి
గుండెలలో నీ మురళి వెళ్ళదులే నన్నొదిలి
తెరిచే వుంచా వాకిలి దయ చేయాలని నా జాబిలి
ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి

చరణం2:

ఈ రామ చిలక సాక్ష్యం
నీ ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం
మనమింకా ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం
విరహాలతో వాడదు ఏ క్షణం
కల నిజమై నిలచినది
మన జతనే పిలచినది
ఆమని కోకిల తీయగా
మన ప్రేమకి దీవేనలీయగా

~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

13-Oct-2009

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

గాత్రం: సందీప్,గంగ
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు
మరి మలయాళంలో ?
ఇరువు ఒహొ
ఇది తీపి మీ భాషలో?
మధురం
మరి చేదు చేదు చేదు చేదు
కైక్కు

చరణం1:

ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
రుజిగల్ ఆరిం నాన్ కన్డు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్
ఏలాం రుజియు ఉండెన్‌ తరయు నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులో ఈ లోకంలో‌
ఇన్నుమెదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్
ఏ మనసిలాయో
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని

మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల చిలిపితన్నాని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పెదాలనేమంటారు ?
చుండు
నడుముని ?
ఇడుప్పు
నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?
ఆశ దోశ అమ్ము మిండ మీస
ఏయ్ చెప్పమంటుంటే
చెప్పనా

చరణం2:

రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతాద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే ఈ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల చిలిపితన్నాని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Oct-2009

మురారి

గాత్రం: జిక్కి,సంధ్య,సునీత
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ



పల్లవి:

అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండడి

చందమామ చందమామ కిందికి చూడమ్మ
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మ
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మ
మా అన్నులమిన్నకు సరిగాలేవని వెలవెలబోవమ్మ

చరణం1:

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కలగల కంటని పదిమంది చూడండి
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి

చందమామ చందమామ కిందికి చూడమ్మ
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మ
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మ
మా అన్నులమిన్నకు సరిగాలేవని వెలవెలబోవమ్మ

చరణం2:

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరిశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకోని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగగ బంధువలంతా కదలండి

చందమామ చందమామ కిందికి చూడమ్మ
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మ
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మ
మా అన్నులమిన్నకు సరిగాలేవని వెలవెలబోవమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Oct-2009

రాజ మకుటం

గాత్రం: పి.లీల



పల్లవి:

ఏడనున్నాడో ఎక్కడున్నాడో
చూడచక్కని చుక్కలరేడు
ఈడుజోడూ కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో

చరణం1:

ఒహొహొ ఒహొహొ
గాలి రెక్కల పక్షుల్లారా
గాలి రెక్కల పక్షుల్లారా
పాల వన్నెల మబ్బుల్లారా ఓ ఓ ఓ
గాలి రెక్కల పక్షుల్లారా
పాల వన్నెల మబ్బుల్లారా
పక్షుల్లారా మబ్బుల్లారా
మన్సు చూరగొని మాయమైన మక్కువరేడే
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
నా చూడచక్కని చుక్కలరేడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో

చరణం2:

ఓ ఓ ఓ ఓ ఓ
పొగడపొన్నల పువ్వలవీడ
పూలవీధిలో తుమ్మెదున్నాడా
పొగడపొన్నల పువ్వలవీడ
పూలవీధిలో తుమ్మెదున్నాడా
గున్నమామిడి కొమ్మలగూడా
గూటిలోన గండు కోయిలలేడా
గున్నమామిడి కొమ్మలగూడా
గూటిలోన గండు కోయిలలేడా
కోయిలలేడా తుమ్మెదున్నాడా
కులుకు బెలుకుగల కోడె ప్రాయపు కొంటెవాడే

ఏడనున్నాడో ఎక్కడున్నాడో
నా చూడచక్కని చుక్కలరేడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
చూడచక్కని చుక్కలరేడు
ఈడుజోడూ కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Oct-2009

వెంగమాంబ

గాత్రం: సునీత
సాహిత్యం: అన్నమయ్య




పల్లవి:

చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్లను నొసగ
చాలదా
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్లను నొసగ
చాలదా

గోవింద గోవింద హరిగోవింద
గోవింద గోవింద జయగోవింద
గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరిగోవింద

చరణం1:

ఇది యొకటి హరినామ మింతైన చాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటి హరినామ మంత్రమది చాలదా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మదినొకటి హరినామ మంత్రమది చాలదా
పదివేల నరక కూపముల వెడలించ

చాలదా చాలదా
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్లను నొసగ
చాలదా

గోవింద గోవింద హరిగోవింద
గోవింద గోవింద జయగోవింద
గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరిగోవింద

చరణం2:

తగువేంకటేశుకి ధనమొకటి చాలదా
జగములో కల్ప భూజంబు వలెనుండ
సొగసి ఈ విభుని దాసుల కరుణ చాలదా
నగవు జూపులను నున్నతమెపుడు చూప

చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్లను నొసగ
చాలదా ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

09-Oct-2009

వీరాభిమన్యు

గాత్రం: ఘంటసాల,సుశీల
సాహిత్యం: ఆరుద్ర




పల్లవి:

చూచి వలచి చెంతకు పిలచి
నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు పిలచి
సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు చేరి
నా సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి
చూచి వలచి చెంతకు చేరి
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

చరణం1:

అందాలన్నీ దోచి ఆనందపుటంచుల చూచి
అందాలన్నీ దోచి ఆనందపుటంచుల చూచి
సందిట బందీ చేసి
సందిట బందీ చేసి నా బందీ వశమై పోతీ

చూచి వలచి చెంతకు చేరి
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

చరణం2:

నూతన వధువై నిలచి వరుని వలపుల మధువై మారి
నూతన వధువై నిలచి వరుని వలపుల మధువై మారి
సఖునీ ఒడిలో సురిగీ
సఖునీ ఒడిలో సురిగీ
కోటి సుఖముల శిఖరమునైతి

చూచి వలచి చెంతకు పిలచి
సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి

చరణం3:

వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగమూ మరచి
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగమూ మరచి
నీవే జగమై నీలో సగమై
నేటికి నిండుగ పండితి

చూచి వలచి చెంతకు పిలచి
సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు చేరి
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Oct-2009

తోట రాముడు

తారాగణం: చలం,సుజాత
గాత్రం: బాలు, పి.సుశీల
సంగీతం: సత్యం
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
సంస్థ: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 1975




పల్లవి:

ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఏ ఏ ఏ ఏ
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

చరణం1:

పంజరాన్ని దాటుకుని
బంధనాలు తెంచుకుని
నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా
మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

చరణం2:

సన్నజాజి తీగుంది
తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది
జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురేలేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ


||

07-Oct-2009

నిర్ణయం

గాత్రం: బాలు,జానకి




పల్లవి:

ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణయోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయిరాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళి పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ గియ్యాలతో
పదపదపదమని పిలిచెను విరిపొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం
సిగ్గే సింగారం చిందే సింధూరం
వయ్యారి నెయ్యాలతో
ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణయోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయిరాగం

చరణం1:

తియ్యందిచ్చే తీర్చనా రుణము
చెయ్యందిస్తే తీరవా
బందించేద్దాం యవ్వనం వనం
పండించేద్దాం జీవనం
నవనవమను పరువం ఫలించే పరిణయ శుభతరుణం
కువకువమను కవనం లిఖించే కులుకుల కలికితనం
నా ఉదయమై వెలిగే ప్రియవరం

అహ ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణయోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయిరాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళి పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ గియ్యాలతో
అహ పదపదపదమని పిలిచెను విరిపొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

చరణం2:

వడ్డించమ్మ సోయగం సగం
ఒడ్డెంకించే సాయమా
సయ్యంటున్నా తీయగా నిజం
స్వర్గంనిచ్చే స్నేహమా
పెదవుల ముడిపెడదాం
ఎదల్లో మదనుడి గుడి కడదాం
వదలని జత కడదాం
జతుల్లో సుడిపడి సుఖపడదాం
రా వెతుకుదాం రగిలే రసజగం

అహ ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణయోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయిరాగం
విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం
సిగ్గే సింగారం చిందే సింధూరం
వయ్యారి నెయ్యాలతో
ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణయోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయిరాగం
పదపదపదమని పిలిచెను విరిపొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Oct-2009

బొబ్బిలియుద్ధం

గాత్రం: ఘంటసాల,సుశీల




పల్లవి:

అందాలరాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా
వీరాధి వీరులే

పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నిరీక్ష చాల మంచిది

వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా
వీరాధి వీరులే

చరణం1:

క్రీగంటితో ననుదోచి నా గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడుటే చాలులే
ఆడుటే చాలులే
చాలులే చాలులే
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళజాలనే

అందాలరాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
అందాలరాణివే

చరణం2:

మీ వంటివారికి మేలా
మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము ఏల ఈ ఆగుము
ఆగుము ఆగుము
ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను
జగానికందము వివాహ బంధము
ఆనాడే తీరు వేడుక
అందాలరాణివే

||

05-Oct-2009

ముద్దుల కృష్ణయ్య

తారాగణం: బాలకృష్ణ,రాధ,విజయశాంతి
గాత్రం: బాలు,పి.సుశీల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: కె వి.మహదేవన్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ఎస్.గోపాల్‌రెడ్డి
సంస్థ: భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
విడుదల: 1986




పల్లవి:

సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి
ఆ ఆ ఆ ఆ సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయవేదమాలపించనీ
హృదయ రమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ
సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయవేదమాలపించనీ
హృదయ రమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ
సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి

చరణం1:

గళభాస్వర లలితస్వర పదసుందర లయబంధుర చలనమంబులో సాగిపోనీ
రజనీకర హిమశేఖర సుమనోహర కిరణాంతర రసడోలలో ఊగిపోనీ
జలరాశులన్నీ చెలరేగినా విళయాగ్నులన్నీ విషమించినా
జగదేకవీరుడినై ఏలుకోనీ నిన్నేలుకోనీ

సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయవేదమాలపించనీ
హృదయ రమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ
సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి

చరణం2:

ప్రతిదృశ్యం శతపత్రం ప్రతివచనం శృతిరుచిరం బ్రతుకంత ప్రసరించిపోనీ
ప్రతికణమొక మణిమకురం ప్రతి కలయిక మధుమధురం ప్రణయాగ్ని ఉప్పొంగిపోనీ
పలనాటి వీరా తలభాషణ నా బాలచంద్ర నవమోహనా
మాంచాలనై నేనుండిపోనీ మది నిండిపోనీ

సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయవేదమాలపించనీ
హృదయ రమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

04-Oct-2009

చంటి

గాత్రం: బాలు,చిత్ర




పల్లవి:

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

చరణం1:

సిరిగల చిలకలు ఇల దిగి నడుచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలి మర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిళ్ళు పొదరిల్లు
ఇలలో ఉన్న హరివిల్లు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

చరణం2:

జలజల పదముల అలజడి నదులకు వంత నేపాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నేవున్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

||

03-Oct-2009

పెళ్ళి సందడి

గాత్రం: బాలు,కీరవాణి etc




పల్లవి:

సరిగమ పదనిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకదిమి తకదిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు వెన్నెల మావకు
కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ
మలుపొకటే కళ్యాణం
టట్టటారటట్టటం శభాష్
టట్టటారటట్టటం
టట్టటారటట్టటం
టట్టటారటట్టటం
సరిగమ పదనిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకదిమి తకదిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం

చరణం1:

గళముకోసమే గాత్రమున్నది
స్వరముకోసమే సరళి ఉన్నది
పొరుగుకోసమే పేపరున్నది
అతిధికోసమే తిధులు ఉన్నది...శబాష్
పూతకోసమే మావి ఉన్నది
కూతకోసమే కోయిలున్నది
కోత కోసమే కరెంటు ఉన్నది
పెళ్ళికోసమే పేరంటమున్నది
తాళికోసమే ఆలి ఉన్నది
జారిపోవుటకే ఛోళీ ఉన్నది
బ్రహ్మచారికై మెస్సులున్నవి
ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగలకోసమే మెడలు ఉన్నవి
సుముహూర్తానికి చూపులున్నవి

సరిగమపాదనిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకదిమి తకదిమి తకదిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు వెన్నెల మావకు
కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ
మలుపొకటే కళ్యాణం
టట్టటారటట్టటం
టట్టటారటట్టటం
అదిరింది బావగారు
టట్టటారటట్టటం
టట్టటారటట్టటం

చరణం2:

హృదయనాదమై మధురదాహమై
ఎదలు దోచుటకె పాటలున్నవి
పొలములోపల కుప్పకుప్పగా
కూలిపోవుటకే ఫ్లైటులున్నవి
రామకోటికే బామ్మలున్నది
ప్రేమకాటుకే భామలున్నది
క్యూలకోసమే రేషన్లు ఉన్నది
కునుకుకోసమే ఆఫీసులున్నది
మధురవాణి మా వెంట ఉన్నది
నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది
బాలులోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకె తొందరున్నది
ఒకటయ్యేందుకె ఇద్దరున్నది

సససస సమరిసనిప సరిగమపదనిస రాగం
పనిమపమరి రిపమరిసని నినిసస నిసరిస పమరిస రాగం
పానిస పానిస దనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమపదనిస రాగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సరిగమపదనిస రాగం
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

02-Oct-2009

గాంధీ పుట్టిన దేశం

తారాగణం: కృష్ణంరాజు,ప్రమీల,ప్రభాకర రెడ్డి
గాత్రం: సుశీల
సాహిత్యం: మల్లవరపు గోపి
సంగీతం: ఎస్.పీ. కోదండపాణి
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంస్థ: జయప్రద ఆర్ట్ పిక్చర్స్
విడుదల: 1973




పల్లవి:

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్

చరణం1:

భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలిః
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలిః
బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్

చరణం2:

ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-Oct-2009

ప్రేమ

తారాగణం: నాగేశ్వరరావు,భానుమతి
గాత్రం: ఘంటసాల,భానుమతి
సాహిత్యం: కె.జి.శర్మ
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్
నిర్మాత & దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
సంస్థ: భరణి పిక్చర్స్
విడుదల: 1952





పల్లవి:

దివ్య ప్రేమకు సాటి అవునే స్వర్గమే అయినా
వెన్నెల మెచ్చి ఇచ్చే దీవెన
దివ్య ప్రేమకు సాటి అవునే స్వర్గమే అయినా
వెన్నెల మెచ్చి ఇచ్చే దీవెన

చరణం1:

వినిపించును వేయి ప్రేమగీతాలీ రేయి
వినిపించును వేయి ప్రేమగీతాలీ రేయి
మనసే లయగా పాడేనోయి
మనసే లయగా పాడేనోయి

దివ్య ప్రేమకు సాటి అవునే స్వర్గమే అయినా
వెన్నెల మెచ్చి ఇచ్చే దీవెన

చరణం2:

మాయమర్మము లేని ప్రేమ సెలయేరే ప్రేమ
ఇదే శాశ్వతమే ఈ సుఖమే
మాయమర్మము లేని ప్రేమ సెలయేరే ప్రేమ
ఇదే శాశ్వతమే ఈ సుఖమే
చిరుమబ్బుల లీల ఐక్యమౌదామీవేళ
చిరుమబ్బుల లీల ఐక్యమౌదామీవేళ
స్వరరాగములై విహరిద్దామే
స్వరరాగములై విహరిద్దామే

దివ్య ప్రేమకు సాటి అవునే స్వర్గమే అయినా
వెన్నెల మెచ్చి ఇచ్చే దీవెన

చరణం3:

నిన్నే నమ్మిన దాననోయి నీ రాణినోయి
ఇదో నీ వశమే నా మనసే
నిన్నే నమ్మిన దాననోయి నీ రాణినోయి
ఇదో నీ వశమే నా మనసే
కనుమూసితినేమి చూతునోయి నీరూపే
కనుమూసితినేమి చూతునోయి నీరూపే
కలలే నిజమాయే బ్రతుకే హాయి
కలలే నిజమాయే బ్రతుకే హాయి

దివ్య ప్రేమకు సాటి అవునే స్వర్గమే అయినా
వెన్నెల మెచ్చి ఇచ్చే దీవెన


||