Showing posts with label అనార్కలి. Show all posts
Showing posts with label అనార్కలి. Show all posts

Jan 27, 2008

అనార్కలి

గాత్రం:సుశీల


పల్లవి:

కులాసాల సరసాల కురిపింతురా
ఖుషీగా విలాసాల మురిపింతురా
హమేషా తమాషాల అలరింతురా ఆ ఆ ఆ
అందచందాలుగని అందచందాలుగని
ఆదరించు నారాజా అందాల ఆనందం అందుకో నారాజా
అందాల ఆనందం అందుకో నారాజా
అందచందాలుగని ఆదరించు నారాజా

చరణం1:

రంగారు సింగారముల రాసలీల
పొంగారు సంగీతముల రాగమాల
చెంగు చెంగని ఆడు నాట్యాల బాల ఆ ఆ ఆ
అందచందాలుగని అందచందాలుగని
ఆదరించు నారాజా అందాల ఆనందం అందుకో నారాజా
అందచందాలుగని ఆదరించు నారాజా

చరణం2:

రంగరంగేళిగా లాలింపరా
కొంగుబంగారుగా కులికింపరా
జగన్మొహనా నా మొరాలింపరా ఆ ఆ
అందచందాలుగని అందచందాలుగని
ఆదరించు నారాజా అందాల ఆనందం అందుకో నారాజా
అందచందాలుగని ఆదరించు నారాజా

| Track details |

Oct 19, 2007

అనార్కలి

గాత్రం:ఘంటసాల,జిక్కి
సాహిత్యం:సముద్రాల


పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
హాయి నయముకు పాయి మధురమవు రేయి
మరపురాదోయి మరువలేనోయి
ఈ హాయి మరువలేనోయి

చరణం1:

వలచి వలపించే విలాసాల
కలిసి కులికించే కులాసాల
వలచి వలపించే విలాసాల
కలిసి కులికించే కులాసాల
కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని

చరణం2:

వెన్నెల వెల్లువారే నగవుమీర
కన్నుల జాలువారే వగబీడ
మనసైనవారు దరీచేర
మనసైనవారు దరీచేర
కనివారగా చెలి మనసారగా
కనివారగా చెలి మనసారగా
తలపుల వలపుల తనివీరగా

కలిసె నెలరాజు కలువ చెలిని
కలిసె యువరాజు అనార్కలిని
కలిసె యువరాజు అనార్కలిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Oct 15, 2007

అనార్కలి

గాత్రం:ఘంటసాల,జిక్కి
సాహిత్యం:సముద్రాల

పల్లవి:

మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ ఈ
అనార్కలి అనార్కలి అనార్కలి
వహ్వ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా

చరణం1:

మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మధురమైన భాదరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా

చరణం2:

కానిదాన కాదురా కనులనైన కానరా
కానిదాన కాదురా కనులనైన కానరా
ఆ ఆ జాగుసేయనేలరా వేగ రావదేలరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
వేగ రార వేగ రార వేగ రార

||

Oct 1, 2007

అనార్కలి

తారాగణం:నాగేశ్వరరావు,అంజలీదేవి
గాత్రం:జిక్కి
సాహిత్యం:సముద్రాల
సంగీతం:ఆదినారాయణరావు
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: అంజలీ దేవి
సంస్థ:అంజలి పిక్చర్స్
విడుదల: 1955




పల్లవి:

జీవితమే సఫలము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం1:

హాయిగా తీయగా ఆలపించు పాటలా
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
అనారు పూలతోటలా అనారు పూలతోటలా
ఆశ దెలుపు ఆటలా

జీవితమె సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం2:

వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా
అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా
వరించు భాగ్యశాలలా వరించు భాగ్యశాలలా
తరించు ప్రేమ జీవులా

జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~