Showing posts with label ఆత్మబంధువు. Show all posts
Showing posts with label ఆత్మబంధువు. Show all posts

Oct 6, 2007

ఆత్మబంధువు

గాత్రం: సుశీల






పల్లవి:

చదువురాని వాడవని దిగులు చెందకు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు

చరణం1:

మంచువంటి మల్లెవంటి
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు

చరణం2:

ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను
ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
కొమ్మ పైని కోకిలమ్మకెవడు పాట నేర్పెను
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు

చరణం3:

తెలివి లేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాప ఏడ్చును అమ్మాయని
తెలివి లేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాప ఏడ్చును అమ్మాయని
చదువులతో పని ఏమి హృదయమున్న చాలు
చదువులతో పని ఏమి హృదయమున్న చాలు
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు

చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Oct 4, 2007

ఆత్మబంధువు

తారాగణం: రామారావు,ఎస్వి.రంగారావు,సావిత్రి
గాత్రం: ఘంటసాల,సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాత: వై.ఆర్.కృష్ణప్రసాద్
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
సంస్థ: సారథి స్టూడియోస్
విడుదల: 1962



పల్లవి:

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఉహు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండికూడా చవటలైయ్యారు
ఒట్టి చవటలైయ్యరు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

చరణం1:

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యొ ఇంటిదీపం ఆర్పివేయ నెంచెనొక్కడు
తల్లితండ్రులు విషమని తలెచెనొక్కడు
తల్లితండ్రులు విషమని తలెచెనొక్కడు
పడుచుపెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు
భ్రమసెనొక్కడు


అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

చరణం2:

కొడుకులతో పాటు రాజు కుక్కనుపెంచి
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను
కొడుకులతో పాటు రాజు కుక్కనుపెంచి
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను
కంటిపాపకంటే ఎంతో గారవించెను
కంటిపాపకంటే ఎంతో గారవించెను
దానిగుండెలోన గూడుకట్టి వుండసాగెను
తానుండసాగెను

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి


చరణం3:

నాది నాది అనుకున్నది నీదికాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునరా
నాది నాది అనుకున్నది నీదికాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునరా
కురిమికవారంతా కొడుకులేనురా
కురిమికవారంతా కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా
కుక్కమేలురా


అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~