గాత్రం: సుశీల
పల్లవి:
చదువురాని వాడవని దిగులు చెందకు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
చరణం1:
మంచువంటి మల్లెవంటి
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
చరణం2:
ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను
ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
కొమ్మ పైని కోకిలమ్మకెవడు పాట నేర్పెను
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
చరణం3:
తెలివి లేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాప ఏడ్చును అమ్మాయని
తెలివి లేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాప ఏడ్చును అమ్మాయని
చదువులతో పని ఏమి హృదయమున్న చాలు
చదువులతో పని ఏమి హృదయమున్న చాలు
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు
చదువురాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు
చదువురాని వాడవని దిగులు చెందకు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment