తారాగణం:ప్రశాంత్,ఆనంద్,హీరా,అను అగర్వాల్
గాత్రం:మనో,చిత్ర
సాహిత్యం:రాజశ్రీ
సంగీతం:ఏ.ఆర్.రహమాన్
దర్శకత్వం:మణిరత్నం
విడుదల:1993
పల్లవి:
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చరణం1:
జంట నెలవంకలుండె నింగి కావాలి మాకు
వెండివెన్నెల్లలోనె వెయ్యికలలు పండాలి మాకు
పూవులే నోరు తెరిచి మధురరాగాలు నేర్చి
పాటలే పాడుకోవాలి అది చూసినే పొంగిపోవాలి
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను వుండని
మమతలే ప్రతి మనసులో కొలువుండని
మనుగడే ఒక పండగై కొనసాగని
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చరణం2:
ఓడిపోవాలి స్వార్ధం ఇల మరిచిపోవాలి యుద్ధం
మరణమేలేని మానవులే ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోని అమృతం పొంగిపోని
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతినిత్యం
వేదనే ఇక తొలగని వేడుకే ఇక వెలగని
ఎల్లనా పోరాటమే ఇక తీరనీ ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకని
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~