పల్లవి:
నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ
నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ
చరణం1:
ఒక ఆట ఆడి ఒక పాట పాడి
ఒక మాటగానే ఉన్నామమ్మ ఓ ఓ ఓ
ఒక ఆట ఆడి ఒక పాట పాడి
ఒక మాటగానే ఉన్నామమ్మ
చిననాటి చెలిమి ఆనాటి చెలిమి
మరువనివాడు మంచివాడమ్మ ఓ ఓ ఓ
నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ
చరణం2:
తనవెంట నేనుంటె నా కంట తానుంటె
మనకేమి లోటని అనుకుంటినమ్మ
తనవెంట నేనుంటె నా కంట తానుంటె
మనకేమి లోటని అనుకుంటినమ్మ
కలిసాకు కాని ఎడబాటు కాని
చివరకు మేము ఒకటేనమ్మ
నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ
|