Mar 4, 2009

దొంగల్లో దొర

గాత్రం: ఘంటసాల,పి.లీల



పల్లవి:

ఈ తీయని యామినిలో
తారల జలతారల తెరలలో
నిండుగా రావోయి
పండుగేనోయి

విన్నావ చిన్నదాన
విన్నావ చిన్నదాన
అదో ఆ దూరతీరాల
అనురాగ రాగాల ఆలాపనేదో
విన్నావ చిన్నదాన

విన్నానోయ్ చిన్నవాడ
అది చిన్నారి మనసులోని
చిన్ననాటి మమతలన్ని
పల్లవించు ప్రణయగీతి
విన్నావ.. విన్నావ చిన్నవాడ

చరణం1:

చుక్కల్లో జాబిలి ఎక్కడున్నావోయి
చక్కని చుక్క రాణి పక్కనున్నాయోయి
చుక్కల్లో జాబిలి ఎక్కడున్నావోయి
చక్కని చుక్క రాణి పక్కనున్నాయోయి
పక్కుమని నవ్వుతావా
పండు వెన్నెలిస్తావా
పక్కుమని నవ్వుతావా
పండు వెన్నెలిస్తావా
వెన్నెలంటి మనసుదాన
వెన్నవాంటి మనసిస్తా

విన్నావ చిన్నదాన
అది చిన్నారి మనసులోని
చిన్ననాటి మమతలన్ని
పల్లవించు ప్రణయగీతి
విన్నావ.. విన్నావ చిన్నవాడ

చరణం2:

నీ నీడలో నేను మేడలే కడతాను
ఆ ఇంట నీజంట కాపురమే ఉంటాను ఆ ఆ ఆ ఆ
నీ నీడలో నేను మేడలే కడతాను
ఆ ఇంట నీజంట కాపురమే ఉంటాను
చెలిమే మన కలిమిగా
వలపే మన వరముగా
చెలిమే మన కలిమిగా
వలపే మన వరముగా
ఒకరికొకరు కనుపాపై
ఒద్దికగా ఉందాము

విన్నావ చిన్నదాన
అది చిన్నారి మనసులోని
చిన్ననాటి మమతలన్ని
పల్లవించు ప్రణయగీతి
విన్నావా.. విన్నానోయ్ చిన్నవాడ
విన్నావ చిన్నవాడ

||

No comments: