Showing posts with label దేవదాసు (1953). Show all posts
Showing posts with label దేవదాసు (1953). Show all posts

Dec 12, 2007

దేవదాసు



పల్లవి:

ఓ దేవద
ఓ పార్వతి
చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడు దౌడ
ఓ దేవద చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడు దౌడ
ఓ దేవద

చరణం1:

కూనలమ్మ మర్రిలో దివిగాలున్నయే పడితే వాటముగ పట్టుపడేనే
కూనలమ్మ మర్రిలో దివిగాలున్నయే పడితే వాటముగ పట్టుపడేనే
బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలగే ఆటే ఆట
బడిమానే ఎడముంతే ఎపుడూ ఇలగే ఆటే ఆట
ఓ పార్వతి

చరణం2:

రేక్కరాని కూననె పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా
రెక్కరాని కూననె పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా
బడిలోనె చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
బడిలోనె చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
ఓ పిరికి పార్వతి
తేలెనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
తేలెనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
లడాయి ఇలా సరే మనకు జిలాయిలో జిలాయిలో
లడాయి ఇలా సరే మనకు జిలాయిలో జిలాయిలో
ఆ అన్న ఊ అన్న అలిగి పోయే ఉడుకుమోత
ఆ అన్న ఊ అన్న అలిగి పోయే ఉడుకుమోత
రా రా పిరికి పార్వతి పో ఓ దుడుకు దేవదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Dec 10, 2007

దేవదాసు

గాత్రం:ఘంటసాల,జిక్కి


పల్లవి:

ఓ దేవదా
ఓ పార్వతీ
చదువూ ఇదేనా మనవాసీ వదిలేసీ
అసలు దొరల్లే సూటూబూటా
ఓ దేవదా చదువూ ఇదేనా మనవాసీ వదిలేసీ
అసలు దొరల్లే సూటూబూటా
ఓ దేవదా

చరణం1:

పల్లెటూరి పిల్లకూ ఉలుకూ హెచ్చిందే
బదులూ పల్కడమూ పట్టుపడిందే
పల్లెటూరి పిల్లకూ ఉలుకూ హెచ్చిందే
బదులూ పల్కడమూ పట్టుపడిందే
పసికూనా సిసలైనా జాణా అయిందే బాగూ బాగు
పసికూనా సిసలైనా జాణా అయిందే బాగూ బాగు
ఓ పార్వతీ

చరణం2:

ఉన్న తీరు మారినా ఊరూ మారినా
తమరూ ఎన్నటికీ పసివారేనా
ఉన్న తీరు మారినా ఊరూ మారినా
తమరూ ఎన్నటికీ పసివారేనా
అలనాటి కలలన్నీ వెలుగూలయేనా నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగూలయేనా నిజమయ్యేనా
ఓ పార్వతీ

చరణం3:

నా ఎదుటే నీ బడాయీ
జీవితమే ఓ లడాయీ
నా ఎదుటే నీ బడాయీ
జీవితమే ఓ లడాయీ
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడూ ఈ నాడూ ఒకటే మాటా ఉడుకూమోతా
ఆ నాడూ ఈ నాడూ ఒకటే మాటా ఉడుకూమోతా
ఓ పిరికి పార్వతీ
ఓ దుడుకు దేవదా

||

Dec 7, 2007

దేవదాసు (1953)

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్

పల్లవి:

పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో

చరణం1:

ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగీ
ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగి
మనసేమొ మక్కువేమొ మనసేమొ మక్కువేమొ
నగవేమొ వగేమో
కనులారా చూదము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో

చరణం2:

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకున నా దరికి దూకున
తానలిగి పోవునో
ఏమౌనో చూదము

పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో చలో చలో

||

Dec 5, 2007

దేవదాసు

గాత్రం:రావు బాలసరస్వతి

పల్లవి:

అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
పొంగారే సోయగము రంగు సేయగ
పొంగారే సోయగము రంగు సేయగ
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య

చరణం1:

ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్య
ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్య
పూల జంపాలలు తూగుటుయ్యాలలు
పూల జంపాలలు తూగుటుయ్యాలలు
నీడగా జోడుగా ఆడిపాడేనయ్య
నీడగా జోడుగా ఆడిపాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య

చరణం2:

హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాననయ్య
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాననయ్య
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
హాయిగా తీయగా ఆడి పాడేనయ్య
హాయిగా తీయగా ఆడి పాడేనయ్య

అందం చూడవయ్య ఆనందించవయ్య
పొంగారే సోయగము రంగు సేయగ
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య

||

Dec 4, 2007

దేవదాసు

గాత్రం:కె.రాణి


పల్లవి:

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చరణం1:

చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాట వెరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాట వెరచితివో ఓ ఓ
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా
నా ఆశే దోచినదా
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చరణం2:

మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
వంతలపాలై చింతించేనా వంతా దేవదా
నా వంతా దేవదా

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

||

Dec 2, 2007

దేవదాసు

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్


పల్లవి:

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

చరణం1:

కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

చరణం2:

ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
భాదే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
భాదే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ

||

Dec 1, 2007

దేవదాసు

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్


పల్లవి:

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే
పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

చరణం1:

ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
వరమింతే
చివురించిన పూదీవే విరియగా విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే
పరిణామమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

చరణం2:

నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో ఓ ఓ
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే
అనురాగమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఇంతేనులే

||

Nov 29, 2007

దేవదాసు

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్

పల్లవి:

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా ఆ అ అ అ అ ఆ
సుడిలో దూకీ ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్, మునకే సుఖమనుకోవోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

చరణం1:

మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ అ అ అ అ ఆ
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ ఆ
కొండలే రగిలే వడగాలీ ,కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పూవేలోయ్, నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

చరణం2:

చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోనా ,లాయిరీ నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్ ,లంగరుతో పని లేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్

||

Nov 28, 2007

దేవదాసు

తారాగణం: నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు
గాత్రం: ఘంటసాల,కె.రాణి
సంగీతం:సీఅర్.సుబ్బరామన్
సాహిత్యం: సముద్రాల సీనియర్
నిర్మాత: చక్రపాణి
దర్శకత్వం:వేదాంతం రాఘవయ్య
సంస్థ:వినొదా పిక్చర్స్


పల్లవి:

చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేలే
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ

చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
చేరదిసి సేవచేసే తీరూ కరువాయే
చేరదిసి సేవచేసే తీరూ కరువాయే నీ దారె వేరాయె
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె

చరణం1:

మరపురాని బాధకన్నా మధురమే లేదూ
మరపురాని బాధకన్నా మధురమే లేదూ
గతము తలచి వగచేకన్న సౌఖ్యమే లేదూ
గతము తలచి వగచేకన్న సౌఖ్యమే లేదూ
అందరాని పొందుకన్నా అందమేలేదు ఆనందమే లేదూ
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ

చరణం2:

వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా కధ తీరిపోయేనా
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేనే

||