సాహిత్యం: సముద్రాల సీనియర్
పల్లవి:
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా ఆ అ అ అ అ ఆ
సుడిలో దూకీ ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్, మునకే సుఖమనుకోవోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
చరణం1:
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ అ అ అ అ ఆ
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా ఆ ఆ
కొండలే రగిలే వడగాలీ ,కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పూవేలోయ్, నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
చరణం2:
చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోనా ,లాయిరీ నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్ ,లంగరుతో పని లేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
|
No comments:
Post a Comment