సాహిత్యం: సముద్రాల సీనియర్
పల్లవి:
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
చరణం1:
ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగీ
ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగి
మనసేమొ మక్కువేమొ మనసేమొ మక్కువేమొ
నగవేమొ వగేమో
కనులారా చూదము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
చరణం2:
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకున నా దరికి దూకున
తానలిగి పోవునో
ఏమౌనో చూదము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో చలో చలో
|
No comments:
Post a Comment