పల్లవి:
పూచిన తారలు పువ్వులుగా దోచిన చీకటి తుమ్మెదగా
జాము వేచింది నాలా ,జాబిలి జాగుయేలా
రేగిపోవాలి నాలా రేపి దూకాలి నీలా
తీరని తాపము చేరని తీరము
పూచిన తారలు పువ్వులుగా దోచిన చీకటి తుమ్మెదగా
జాజుల జాములోన ,జాబిలై నేను రానా
చేరుకోవాలి నీలా ,సేదతీరాలి నాలా
తీరని తాపము చేరని తీరము
చరణం1:
తార దారాలు తీసి చూపు రాట్నాలు నేసి
చీర గారాలు చూపి నీకు జోహారు చేసి చేసి
తేనె మారాలు చేసి పూల వాలేటి వాని
రూపు నీలోన చూసి ప్రేమ వారాసి రాశి పోసి
చూసి చూసి చూపే దోచి ఆశ ఆశ ఆరా తీసి
తీరా మోజు తీరేరోజు ఆపేవేళ ఆపేదేల పాడే కోయిల
రావే రాధిక ప్రేమే నీదిక
ఏది కానుక ప్రేమే నీదిగా
పూచిన తారలు పువ్వులుగా దోచిన చీకటి తుమ్మెదగా
జాము వేచింది నాలా ,జాబిలి జాగుయేలా
రేగిపోవాలి నాలా రేపి దూకాలి నీలా
తీరని తాపము చేరని తీరము
చరణం2:
చూపు గారాము చూసి మాట మారాము చేసే
మారు మాటాడలేక కోరి నీదారి చేరి చేరి
మాకు మారాకు వేసి పూత పూదోట పూసి
కాపు మారాకతోటి ఏపుగా లేత వేచి వేచి
వేచేవాడు కాచేరేడు వీడే వాడు కానేకాడు
ఈడే నేడు దోచేవాడు కానీ జోడు ఆడిపాడు తోడునీడగా
నీవే మాలిగా రావే మాలిక
తీరే కోరిక లోటే లేదిక
పూచిన తారలు పువ్వులుగా దోచిన చీకటి తుమ్మెదగా
జాజుల జాములోన ,జాబిలై నేను రానా
చేరుకోవాలి నీలా ,సేదతీరాలి నాలా
తీరని తాపము చేరని తీరము
|
No comments:
Post a Comment