గాత్రం:ఘంటసాల,సుశీల
సాహిత్యం:సి.నారాయణరెడ్డి
పల్లవి:
ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత లేని పులకింత
ఓ ఓ చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
చరణం1:
ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే
నీ కన్నుళ్ళో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే
నీ కన్నుళ్ళో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళు నీ హొయలు చూసాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను
ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత లేని పులకింత
చరణం2:
దూరాల గగనాల నీ మేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా
దూరాల గగనాల నీ మేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా
నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా కొలచేను నిలిచేను
ఓ ఓ చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత లేని పులకింత
No comments:
Post a Comment