Dec 8, 2007
పదహరేళ్ళ వయసు
పల్లవి:
పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది
పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేతపచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే ,గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
అమ్మాడి నవ్వవే ,గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది
చరణం1:
శివగంగ తిరనాళ్ళలో నెలవంక తానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికిల్లతో గొరవంక గుడిగంట కొట్టలా
నువ్వు కంటి సైగ చెయాలా నే కొండ పిండి కొట్టాల
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాల ఆ ఆ
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది
చరణం2:
గోదారి పరవళ్ళలో మా పైరు బంగారు పండాల
ఈ కుప్ప నూర్పిళ్ళతో మా ఇళ్ళు వాకిళ్ళు నిండాల
నీ మాట బాట కావాల నా పాట ఊరు దాటాల
మల్లి చూపే పొద్దుపొడుపై పోవాల
మల్లి చూపే పొద్దుపొడుపై పోవాల
ఆ పొద్దులో మా పల్లె నిద్దుర లేవాల
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
పంటచేలో పాలకంకి నవ్వింది
పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది
పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేతపచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి
నవ్వవే
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అమృతం!
నెనర్లు.
Post a Comment