తారాగణం:నరెష్,ప్రదీప్,రాజేష్,శుభకర్,మహాలక్ష్మి
గాత్రం:బాలు,జానకి
సంగీతం:రమేష్ నాయుడు
విడుదల:1983
నిర్మాతలు:జయకృష్ణ,కె.కేశవరావు
దర్శకత్వం:జంధ్యాల
పల్లవి:
కొబ్బరినీళ్ళ జలకాలాడి ఉహు ఉహు ఉహు
కోనసీమ కోక కట్టి ఉహు ఉహు ఉహు
పొద్దుటెండా తిలకాలెట్టి ముద్దపసుపు సందెళ్ళకొస్తావా
ముద్దుతీర్చే సందింటికొస్తావా
ముద్దుతీర్చే సందింటికొస్తావా
కొబ్బరినీళ్ళ జలకాలాడి ఉహు ఉహు ఉహు
కోనసీమ కోక కట్టి ఉహు ఉహు ఉహు
పొద్దుటెండా తిలకాలెట్టి ముద్దపసుపు సందెళ్ళకొస్తాలే
ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే
ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే
చరణం1:
ఆకాశ వీణల్లో నేను అనురాగమే పాడుకుంటా
గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకొంటా
నే నుల్లిపాయె నంజుకొంటా
అకాశ వీణల్లో నేను అనురాగమే పాడుకొంటా
శృంగార వీధుల్లో నేను రస నాట్యమే ఆడుకొంటా
ప్రేమ రస నాట్యమే ఆడుకొంటా
మాటివ్వు నాకు మనసిచ్చుకొంటా
వదిలేస్తే వంకాయ వండించుకొంటా ఐ యాం సారి
వంకాయ వంటి కూరయు పంచముఖ సీత వంటి భార్యామణి అన్నారు కదండి
అందుకే అలా పాడానన్నమాట
కొబ్బరినీళ్ళ జలకాలాడి ఉహు ఉహు ఉహు
కోనసీమ కోక కట్టి ఉహు ఉహు ఉహు
పొద్దుటెండా తిలకాలెట్టి ముద్దపసుపు సందెళ్ళకొస్తావా
ముద్దుతీర్చే సందింటికొస్తావా
ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే
చరణం2:
అమ్మవారి ఎదుట నేను నీ కుంకుమే దిద్దుకొంట
నీ కోసమె కాచుకొంట
అమ్మతో చెప్పి నేను అప్పచ్చుళే తెచ్చుకొంట
అమ్మవారి ఎదుట నేను నీ కుంకుమే దిద్దుకొంట
నీ కోసమె కాచుకొంట
అసుర సంద్యవేళ నేను అలయంలో వేచి ఉంటా
నీ హారతే అందుకొంటా
మాగాయలోన పెరుగేసుకొంటా
వదిలేస్తే నా దారి నే చుసుకొంటా
మాగాయ మహ పచ్చడి
పెరుగేస్తె మహత్తరి
అదివేస్తే అడ్డవిస్తరి మానిన్యం మహ సుందరి అన్నారు కదండి
అందుకే అలా పాడనన్నమాటా
No comments:
Post a Comment