పల్లవి:
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
పొంగారే సోయగము రంగు సేయగ
పొంగారే సోయగము రంగు సేయగ
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
చరణం1:
ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్య
ముల్లోకాల లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్య
పూల జంపాలలు తూగుటుయ్యాలలు
పూల జంపాలలు తూగుటుయ్యాలలు
నీడగా జోడుగా ఆడిపాడేనయ్య
నీడగా జోడుగా ఆడిపాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
చరణం2:
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాననయ్య
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాననయ్య
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
హాయిగా తీయగా ఆడి పాడేనయ్య
హాయిగా తీయగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
పొంగారే సోయగము రంగు సేయగ
రంగరంగేళిగా ఆడి పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
అందాల ఆనందం ఇందేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయ్య
|
No comments:
Post a Comment