పల్లవి:
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
చరణం1:
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాట వెరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాట వెరచితివో ఓ ఓ
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా
నా ఆశే దోచినదా
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
చరణం2:
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
వంతలపాలై చింతించేనా వంతా దేవదా
నా వంతా దేవదా
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
|
No comments:
Post a Comment