పల్లవి:
ఓ దేవదా
ఓ పార్వతీ
చదువూ ఇదేనా మనవాసీ వదిలేసీ
అసలు దొరల్లే సూటూబూటా
ఓ దేవదా చదువూ ఇదేనా మనవాసీ వదిలేసీ
అసలు దొరల్లే సూటూబూటా
ఓ దేవదా
చరణం1:
పల్లెటూరి పిల్లకూ ఉలుకూ హెచ్చిందే
బదులూ పల్కడమూ పట్టుపడిందే
పల్లెటూరి పిల్లకూ ఉలుకూ హెచ్చిందే
బదులూ పల్కడమూ పట్టుపడిందే
పసికూనా సిసలైనా జాణా అయిందే బాగూ బాగు
పసికూనా సిసలైనా జాణా అయిందే బాగూ బాగు
ఓ పార్వతీ
చరణం2:
ఉన్న తీరు మారినా ఊరూ మారినా
తమరూ ఎన్నటికీ పసివారేనా
ఉన్న తీరు మారినా ఊరూ మారినా
తమరూ ఎన్నటికీ పసివారేనా
అలనాటి కలలన్నీ వెలుగూలయేనా నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగూలయేనా నిజమయ్యేనా
ఓ పార్వతీ
చరణం3:
నా ఎదుటే నీ బడాయీ
జీవితమే ఓ లడాయీ
నా ఎదుటే నీ బడాయీ
జీవితమే ఓ లడాయీ
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడూ ఈ నాడూ ఒకటే మాటా ఉడుకూమోతా
ఆ నాడూ ఈ నాడూ ఒకటే మాటా ఉడుకూమోతా
ఓ పిరికి పార్వతీ
ఓ దుడుకు దేవదా
|
No comments:
Post a Comment