గాత్రం:వాణిజయరాం
పల్లవి:
తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలిపునీయనా ప్రభూ
తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలిపునీయనా ప్రభూ
నీ దోవ పొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ
చరణం1:
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భానుమూర్తి నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రనవశృతిని
పాడనీ ప్రకృతినీ ప్రధమ కృతినీ
తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ
చరణ2:
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును తేరిన చాలు
తలయుచు తలిరాకు బహుపరాకుల విని
దొరలని దోరనగవు దొంతరని
తరలని దారి తొలగి రాతిరిని
తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలిపునీయనా ప్రభూ
నీ దోవ పొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలిమంచు కరిగింది తలుపుతీయనా ప్రభూ
---------------------------------------------
పాట ఇక్కడ వినండి
--------------------------------------------
No comments:
Post a Comment