Dec 11, 2007

ముత్యాలముగ్గు

గాత్రం:రామకృష్ణ


పల్లవి:

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

చరణం1:

ఒదిగి ఒదిగి కూచుంది బిడియ పడే వొయ్యారం
ముడుచుకొనే కొలది మరీ మిడిసి పడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి ఉం ఉం ఉం
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

చరణం2:

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతొ పూల పానుపు వేసారు ఉం ఉం ఉం
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

------------------------------------------

పాట ఇక్కడ వినండి

-----------------------------------------

No comments: