Dec 11, 2007

శ్రీకృష్ణార్జునయుద్ధం

గాత్రం:ఘంటసాల

పల్లవి:

అలిగితివా సఖి ప్రియ కలత మానవా
అలిగితివా సఖి ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా ఆ ఆ
అలిగితివా సఖి ప్రియ కలత మానవా

చరణం1:

లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా ఆ ఆ ఆ
అలిగితివా సఖి ప్రియ కలత మానవా

చరణం2:

నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా ఆ ఆ ఆ
అలిగితివా సఖి ప్రియ కలత మానవా

చరణం3:

ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ఆ ఆ ఆ ఆ అ అ అ అ ఆ అ అ ఆ అ అ అ ఆ ఆ ఆ
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరించవా
నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కించబూని తార్చిన
అదినాకు మన్ననయ చెల్వగు నీపదపల్లవంబు
మత్తను కులకాగ్ర కంటత వితానము తాకిన నొచ్చునంచు నేనియెద
అల్కమానవుగద ఇకనైన అరాలకుంతలా అరాలకుంతలా
ఆ ఆ ఆ ఆ అ అ అ అ ఆ



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments:

Anonymous said...

విహారి గారు,

పవన్‌ పేరుతో ఎవన్నా ఘంటశాల పాటలున్న డివిడి అంతర్జాలం లో అప్లోడ్ చేశారా?

-- విహారి

విహారి(KBL) said...

లేదండి.నేను చెయ్యలేదు.