Oct 11, 2007

బాలమిత్రులకథ

గాత్రం:ఎస్.జానకి
సంగీతం:సత్యం
విడుదల:1973

పల్లవి:

గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

చరణం1:

ఆ ఆ ఆ చిలకేమో పచ్చనిది
కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
ఆ ఆ ఆ చిలకేమో పచ్చనిది
కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలుకను చూడందే
ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలుకను చూడందే
ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల ఆ ఆ ఆ

గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

చరణం2:

ఆ ఆ ఆ ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగా తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఆ ఆ ఆ ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగా తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపూ వేరైనా
జాతీ రీతీ ఏదైనా
తమ జాతీ రీతీ ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకి తరగని కలిమి

ఒయ్ గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

||

No comments: