పల్లవి:
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు ఊ ఊ ఊ
ఏడ తానున్నాడో బావ
ఏడ తానున్నాడో బావ
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాల ఆ
అందాల ఓ మేఘమాల
గగనసీమల ఓ మేఘమాల
మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా ఆ
నీలాల ఓ మేఘమాల ఆ రాగాల ఓ మేఘమాల
చరణం1:
మమత తెలిసిన మేఘమాల ఆ
మమత తెలిసిన మేఘమాల
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు
ఎదురుతెన్నులు చూచెనే బావకై
చెదిరి కాయలు కాచెనే
ఏ అందాల ఓ మేఘమాల ఆ
అందాల ఓ మేఘమాల
చరణం2:
మనసు తెలిసిన మేఘమాల
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లి రూపే నిలిచెనే
నా చెంత మల్లి మాటే పిలిచెనే
చరణం3:
జాలి గుండెల మేఘమాల ఆ ఆ
బావ లేనిది బ్రతుకజాల
జాలి గుండెల మేఘమాల
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగ కురిసిపోవా కన్నీరు
ఆనవాలుగా బావమోల
|
1 comment:
మంచి పాట దీన్ని ఇష్టపడనివారు ఎవరూ వుండరేమో
Post a Comment