Oct 28, 2007

మల్లీశ్వరి

గాత్రం:భానుమతి
సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి



పల్లవి:

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా ఆ ఆ ఆ
అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా ఆ ఆ
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

||

1 comment:

ramya said...

మల్లీశ్వరి లో పాటలు నాకు చాలా ఇష్టం.చాలా మంచి కలెక్షన్స్ వున్నాయి విహారి గారు మీదగ్గర