పల్లవి:
చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనుహించిన అందమే నీలో చిందెనులే
చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము
చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన నాకలే నిజమాయెనులే
చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము
చరణం1:
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిలగీతములే ఏ ఏ ఏ ఏ ఏ
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిలగీతములే
చెలువములన్ని చిత్రరచనలే ఏ ఏ ఏ
చెలువములన్ని చిత్రరచనలే చెలనములోహో నాట్యములే
చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము
చరణం2:
శరములవలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే ఏ ఏ ఏ ఏ ఏ
శరములవలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీరవిహారమే ఏ ఏ ఏ
ఉద్యానమున వీరవిహారమే
చెలి కడ ఒహొ శౌర్యములే
చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ కలవరము
|
No comments:
Post a Comment