తారాగణం: బాలక్రిష్ణ,విజయశాంతి,శారద
సంగీతం : చక్రవర్తి
దర్శకత్వం:బి.గోపాల్
నిర్మాత : జయరామరావు
సంస్థ : జయ ప్రొడక్షన్స్
విడుదల:1990
పల్లవి:
తల్లి దండాలే ఓ ఓ ఓ ఓ తాయి జేజేలే ఓ ఓ ఓ ఓ
దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య
దశమి వచ్చిందయ్య దశనే మార్చిందయ్య
జయహొ దుర్గాభవాని హొయ్ వెయ్యరో పువ్వులహారాన్ని హొయ్
ఓ ఓ ఓ ఓ రాతిరిలో సూర్యుడునే చూడాలా
జాతరతో స్వాగతమే పాడాలా
చరణం1:
ఈ జోరు పైజోరు తొక్కాలా చుక్కల్లు చేతుల్లో చిక్కాలా
అమ్మోరి దీవెన్లు దక్కేలా ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలా
నింగినేలా ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాలా
గుళ్ళో దేవుడు సారధికాగ లారీడ్రైవరు ఓనరుకాడా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ముచ్చటగా ముందుకురా తొందరగా
పచ్చదనం పంచుకునే పండగరా
దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య
దశమి వచ్చిందయ్య దశనే మార్చిందయ్య
జయహొ దుర్గాభవాని హొయ్ వెయ్యరో పువ్వులహారాన్ని హొయ్
ఓ ఓ ఓ ఓ రాతిరిలో సూర్యుడునే చూడాలా
జాతరతో స్వాగతమే పాడాలా
చరణం2:
వాకిట్లో చీకట్లు తొలిగేలా చూపుల్లో దీపాలు వెలగాలా
దాగున్న దెయ్యాలు జడిసేలా తెళ్ళార్లు తిరనాళ్ళు జరగాల
మచ్చేలేని జాబిలి నేడు ఇచ్చిందమ్మ చల్లని తోడు
నిన్నమొన్నటి పేదల పేట నేడో పున్నమివెన్నెల కోట
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
బంజరులో బంగరులే పండెనురో
అందరిలో సంబరమే నిండెనురో
దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య
దశమి వచ్చిందయ్య దశనే మార్చిందయ్య
జయహొ దుర్గాభవాని హొయ్ వెయ్యరో పువ్వులహారాన్ని హొయ్
ఓ ఓ ఓ ఓ రాతిరిలో సూర్యుడునే చూడాలా
జాతరతో స్వాగతమే పాడాలా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment