Oct 28, 2007

రాముడు - భీముడు

తారాగణం:రామారావు,జమున
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:పెండ్యాల
సాహిత్యం:కొసరాజు
నిర్మాత:డి.రామానాయుడు
సంస్థ:సురేష్ ప్రొడక్షన్స్

పల్లవి:

తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చరణం1:

చలిగాలి రమ్మంచు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
చలిగాలి రమ్మంచు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
ఏముందిలే ఇపుడేముందిలే ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చరణం2:

వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా ఆ ఓ ఆ ఆ ఆ ఆ
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల అనుకొందునా అనుకొందునా
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చరణం3:

సోగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
సోగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కధ ఏమిటో కనులేమిటో ఈ కధ ఏమిటో
శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది
అ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

Get this widget | Track details | eSnips Social DNA

No comments: