సంగీత:ఆర్.డి.బర్మన్
దర్శకత్వం:రాంగోపాల్ వర్మ
విడుదల:1990
పల్లవి:
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
హో లాలలాల హో లాలలాల
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
చరణం1:
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్నని
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్నని
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
పంచెందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తొడుకి నోచుకోని నడకెంత అలుపో అని
చరణం2:
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్విలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
చరణం3:
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదె శుభముహూర్తం సంపూర్ణమైయెందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
హా లాలలాల హా లాలలాల
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
|
No comments:
Post a Comment