తారాగణం:నాగేశ్వరరావు,రాధిక,సుజాత,కార్తిక్,తులసి,ప్రభాకరరెడ్డి
సంగీతం:చక్రవర్తి
దర్శకత్వం:కోదండరామరెడ్డి
నిర్మాత:అనురాధాదేవి
పల్లవి:
ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మునుముందిక రావేమిరా
హహ లేదుర ఆ సుఖం రాదుర ఆ గతం ఏమిటో జీవితం
ఒరే ఫూల్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు
మోకాలికి తగిలిన దెబ్బలు చికట్లో పిల్లనుకుని
ఒరే ఒరే ఒరే పక్కన పెళ్ళికావలసిన పిల్లలు వున్నారురా
నేర్చుకుంటారూఅ
చరణం1:
నేను మారలేదు నువ్వు మారలేదు
కాలం మారిపోతే నేరం మనదేమికాదు
ఈ నేల ఆ నింగి ఆలాగె వున్నా
ఈ గాలి మోస్తుంది మనగాధలెన్నో
నెమరేసుకుందాము ఆ రోజులు
భ్రమలాగ వుంటాయి ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు ఏమాయెర ఆ
ఒరే రాస్కెల్ జ్ఞాపకం వుందిరా
కాలేజిలో క్లాసురూములో ఒక పాప మీద నువ్వు పేపరు బాలు కొడితే
ఆ పాప ఎడమ కాలు చెప్పు ఒరే ఒరే ఒరే వూరుకోర పిల్లలు వింటారు
వింటే వింటారురా పిల్లల పిల్లలకు పిట్టకధగా చెప్పుకుంటారు అంతే ఆ హహహ హహహ
ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మునుముందిక రావేమిరా
చరణం2:
మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను
చితిలో చూసినాను చిత్తై మండినాను
నా గుండె మంటింక ఆరేది కాదు
నేనుండి తను వెళ్ళి బ్రతుకింక లేదు
తన శాపమే నాకు తగిలిందిరా ఎరే
పసిపాపలే లేని ఇల్లయెరా
ఈ కన్నుల కన్నీటికి తుది ఏదిరా
ఒరే ఒరే ఎమిటిరా పసిపిల్లడులాగ
ఆ చిచి ఊరుకో
ఒరే ఈ కన్నీళ్ళకి తుది ఎక్కడరా
కర్చీపుతో తుడిచేయటమేరా ఆ హహహ హహహ
ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
హహ రియల్లి దిసిజ్ ఫ్యాబులస్ ఆ కరక్ట్ రా
హహహ హహహ లాలలలలాలలాలల హహహ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment