Oct 25, 2007

శ్రీ షిర్డి సాయిబాబా మహత్యం

గాత్రం:బాలు
సాహిత్యం:రంగసామి పార్థసారథి




పల్లవి:

బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవు మావలె మనిషివని నీకు మరణం వున్నదని
అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా

చరణం1:

నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం మూగై పొతాడా
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవు మావలె మనిషివని నీకు మరణం వున్నదని
అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా

చరణం2:


దివిలో వున్న భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కుల లోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో వున్న భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కుల లోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులను చుక్కల గుంపును కుల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోలాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లొకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లొకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపొనీ
ముల్లోకాలు కల్లొలంలో శూన్యమైపొనీ
కదిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్దం చేసెది
నేనె ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్ను ఐక్యం అయిపొనీ పొనీ

||

No comments: