Nov 13, 2007

మల్లీశ్వరి

గాత్రం:భానుమతి



పల్లవి:

ఎందుకే నీకింత తొందర
ఎందుకే నీకింత తొందర
ఇన్నాళ్ళ చెరసాల తీరే తీరునే
ఎందుకే నీకింత తొందర
ఓ చిలుక నా చిలుక ఆ ఆ
ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక ఆ ఆ
వయ్యారి చిలుక గారాల మొలక
ఎందుకే నీకింత తొందర

చరణం1:

భాధలన్ని పాత గాధలైపోవునే ఏ ఏ ఏ
భాధలన్ని పాత గాధలైపోవునే
వంతలన్ని వెలుగు పుంతలో మాయునే
ఎలాగో ఓలాగ ఈరేయి దాటెనా
ఈరేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే
ఎందుకే నీకింత తొందర

చరణం2:

ఆ తోట ఆ తోపు ఆకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్ని వున్నాయిలే ఏ ఏ ఏ
ఆ వంక గొరవంక అన్ని వున్నాయిలే
చిరుగాలి తరగలా చిన్నారి పడవలా
పసరు రెక్కల పరిచి పరిగెత్తి పోదామె
ఎందుకే నీకింత తొందర

---------------------------------------------



---------------------------------------------

No comments: