Nov 14, 2007

మంచిమనసులు

గాత్రం:ఘంటసాల,పి.సుశీల



పల్లవి:

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే

తావిలేని పూవు విలువు లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే
తావిలేని పూవు విలువు లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే

చరణం1:

నా మనసే చిక్కుకొని నీ చూపులవలలో
నా వయసు నా సొగసు నిండెను నీమదిలో
నా మనసే చిక్కుకొని నీ చూపులవలలో
నా వయసు నా సొగసు నిండెను నీమదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె

తావిలేని పూవు విలువు లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే

చరణం2:

సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
రంగులీను నీమెడలో బంగారపు తాళిగట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే ఓ ఓ ఓ

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే

చరణం3:

తొలినాటి రేయి తడబాటు పడుతూ మెలెమెల్లగా నీవు రాగ
నీ మేని హొయలు నీలొని వగలు నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలిసి ఉయ్యాలలూగి ఆకాశమే అందుకొనగా
పైపైకి సాగే మేఘాలదాటి కనరాని లోకాలు కనగా
అహ ఒహొ ఉహు ఆ ఆ ఆ ఆ అ అ అ
ఓ ఓ ఓ ఓ ఓ

నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే
నీవులేని నేను లేనే లేనులే
నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే
నీవులేని నేను లేనే లేనులే


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: