పల్లవి:
రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి
రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం
చరణం1:
శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి
శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి
రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం
చరణం2:
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి భువినెల్ల గాచినట్టి
రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం
|
No comments:
Post a Comment