Nov 26, 2007

సీతారత్నంగారి అబ్బాయి

తారాగణం:వాణిశ్రీ,వినోద్ కుమార్,రోజా
గాత్రం:బాలు
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: రాజ్-కోటి
దర్శకత్వం:ఇవివి.సత్యనారాయణ
సంస్థ: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్
విడుదల: 1992




పల్లవి:

పసివాడో ఎమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఎమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
పసివాడో ఎమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

చరణం1:

తానెరుగని తల్లొక్కరు తోడెరుగని మోడొక్కరు
కొడుకుండి తండ్రవలేక సతులుండి పతికాలేక
తన తలరాతకు తలవంచి శిలలాగే బ్రతికేదొకరు
బంధాలే సంకెల్లు వేయగా బ్రతుకంతా చెరసాలలాగ మారగా
పసివాడో ఎమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఉ ఉ ఉ

చరణం2:

చేజేతులా ఏ ఒక్కరు ఏ నేరము చేసెరగరు
తెలిసెవరు దోషులుకారు ఫలితం మాత్రం మోసారు
పరులంటూ ఎవరూలేరు ఐనా అంతా పగవారు
ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంతచేరునా
పసివాడో ఎమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు హా ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

Anonymous said...

thanks andi
merru chinna సైజు server laa unnnaru
entha rare paatainaa mee blaagulO adagagaane vachchestunnayi,