తారాగణం:రామారావు,అంజలీదేవి,కాంతారావు
గాత్రం:ఘంటసాల
సంగీతం:ఘంటసాల
సాహిత్యం:కొసరాజు
నిర్మాత: శంకరరెడ్డి
దర్శకత్వం:పుల్లయ్య,సి.ఎస్.ఆర్
విడుదల:1963
పల్లవి:
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తపించుటకై ఎవరు సాహసించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
చరణం1:
కంచెయె నిజముగ చేనుమేసిన కాదనువారెవరూ
రాజే ఇది శాశనమని పలికిన ప్రతిఘటించువారెవరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
చరణం2:
కరుణామయులిది కాదనలేర కట్టిన కార్యమనబోరా
సాధ్వులకేపుడు వెతలేనా తీరని దు:ఖపు కధలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
చరణం3:
ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిలచి విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
చరణం4:
ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాశాలూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
అగ్నిపరీక్షకే నిలిచిన సాద్విని ఆనుమానించుట న్యయమా
అలుపుని మాటయె జనవాక్యమని అలుపుని మాటయే జనవాక్యమని
అనుసరించుటయె ధర్మమా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తపించుటకై ఎవరు సాహసించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఎవరూహించెదరు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment