Nov 17, 2007
సీతారామయ్యగారి మనవరాలు
పల్లవి:
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మాఇంటికాంపించవయ్య మావయ్య ఆ ఆ ఆఅ
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి
చరణం1:
ఆచేయి ఈచేయి అద్దగోడలికి ఆమాట ఈమాట పెద్దకోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివే తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలుకై తల్లిగా చూసి పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటిపాపను మన్నిచి పంపు ఊ ఊ ఊ ఊ
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి
చరణం2:
మసకపడితే నీకు మల్లెపూదండ తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో ఓ ఓ
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేతరామ
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment