Nov 24, 2007

రంగులరాట్నం

తారాగణం:అంజలీదేవి,చంద్రమోహన్,వాణిశ్రీ,విజయనిర్మల,రేఖ
సంగీతం:గోపాలం,సాలూరి రాజేశ్వరరావు
దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి
సంస్థ:వాహిని స్టుడియొస్
విడుదల:1966



పల్లవి:

నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో
నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

చరణం1:

మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మామాట వినిపించవమ్మ
ప్రభువుకు మామనవి వినిపించవమ్మ

చరణం1:

ఏడేడు శిఖరాలనేనడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నాభాద వినిపించలేను
అమ్మా ఆ ఆ ఆ ఆ
మముగన్న మాయమ్మ అలివేలుమంగ
మముగన్న మాయమ్మ అలివేలుమంగ
విభునికి మామాట వినిపించవమ్మ
ప్రభువుకు మామనవి వినిపించవమ్మ

చరణం2:

కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు
స్వామి కరుణామయుండన్న బిరుదులేలనమ్మ
అడగవె మాతల్లి అనురాగవల్లి
అడగవె మాయమ్మ అలివేలుమంగ

నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

No comments: