Nov 17, 2007

అంతస్తులు

గాత్రం:పి.సుశీల
సంగీతం:కె.వి.మహదేవన్
సాహిత్యం:ఆత్రేయ

పల్లవి:

నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కధనేనే

నిను వీడని నీడను నేనే

చరణం1:

నునులేతనై పువ్వునై విరిసి నిను నమ్మి చేరినా వలచి

వలపంతా ధూళిలో కలిసే
వలపంతా ధూళిలో కలిసే
బ్రతుకే బలియై ముగిసే

నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కధనేనే
నిను వీడని నీడను నేనే

నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కధనేనే
నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కధనేనే
నిను వీడని నీడను నేనే

చరణం2:

నిరుపేదకెందుకో వలపు కలవారి ఆటకే గెలుపు
నిరుపేదకెందుకో వలపు కలవారి ఆటకే గెలుపు
మృతినైన మాయదీ తలపు
మృతినైన మాయదీ తలపు
బ్రతుకే చితియౌ తుదకు

||

No comments: